రాష్ట్రీయం

కాయ్ రాజా కాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ మాటున జరిగే కోడి పందాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. మరో 24 గంటల్లో ఈ కోడి పందాలు ఆరంభమవుతాయని పందాలరాయుళ్లు ధీమాగా చెబుతున్నారు. అంతేకాదు ఈ నెల 14వ తేదీన భోగి పండుగను సెంటిమెంట్‌గా భావించి ఈ పందాలు జరపనున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయానే్న ముహూర్తాన్ని పందాల రాయుళ్లు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ముహూర్తాన్ని ఖరారు చేసిన తర్వాత చదును చేసుకున్న బరులను పందాలకు పూర్తిస్థాయిలో హంగులతో సిద్ధం చేయనున్నారు. ఇప్పటికే బరి రేటు సుమారు రూ.25 లక్షల నుంచి పై మాటే. ప్రభుత్వం కమిటీలను ఏర్పాటుచేసి పటిష్ట చర్యలు తీసుకోవడం, గతంలో వ్యవసాయ భూమిని బరుల కోసం ఇచ్చిన వాళ్లకు నోటీసులు జారీచేయడంతో వ్యవసాయ భూమిని బరిగా ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో బరి రేటు మరింత పెరిగింది. అయితే రేటు ఎంత ఉన్నా ఖచ్చితంగా ఆ భూమిని నాలుగు రోజులపాటు బరికి తీసుకుంటున్నారు. గోదావరి జిల్లాల్లో దాదాపు పందాల రాయుళ్లు బరుల పనులను పూర్తిచేశారు. బరి చుట్టూ ఆడే పేకాట, ముక్కాట, గుండాట, లోన, బయట తదితర వివిధ ఆటలకు కూడా వేలాన్ని పందాలరాయుళ్లు పూర్తిచేసినట్టు తెలుస్తోంది. కోడి పందాల బరి చుట్టూ నాలుగు రోజులపాటు వ్యాపారాలు చేసేందుకు భారీగానే వారి నుంచి పందాలరాయుళ్లు వసూలు చేసినట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలు, గ్రామాల్లోను కోడి పందాలు జరగడానికి వీల్లేదని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఎక్కడ పందాలు వేసినా వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని కూడా ఆదేశించింది. అదే విధంగా వివిధ శాఖల అధికారులతో కలిపి కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు రంగంలోకి దిగాయి. ఆ విధంగా ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో కోడి పందాలకు కత్తులు తయారుచేసే వారి నుంచి పెద్ద ఎత్తున కత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు, ఇతర జూద క్రీడలపై అవగాహన కలిగి పందాలు జరిపే వారిని అరెస్టు చేశారు. అటు కోడి కత్తులు, ఇటు పందాలు నిర్వహించే వారిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. అందులోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన నేపథ్యంలో గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగ సాంప్రదాయాన్ని గౌరవించాలని పొలిటికల్ మాట్లాడుతుండగా.. కాదు అది ముమ్మాటికీ పందెమే అంటోంది పోలీస్. కాగా ఈ ఏడాది సంక్రాంతి పండుగ నేపథ్యంలో కోడి పందాల మాటున రూ.కోట్లు కొల్లగొట్టే క్యాసినో గేమ్‌ను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రాంతంలో ఆడనున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. పండుగ నేపథ్యంలో ఇప్పటికే ఏటీఎంలు అన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి.

*కోడి పందాల కోసం వేసిన టెంట్లు ( ఫైల్ ఫొటో)