రాష్ట్రీయం

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌లో సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ ఫెస్టివల్‌ను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఈ ఫెస్టివల్ ఈనెల 15 వరకు కొనసాగుతుంది. 20 దేశాలు, 25 రాష్ట్రాల నుంచి 60 మంది అంతర్జాతీయ, జాతీయ కైట్ ప్లేయర్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖతో పాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్), విజయా డైరీ, హైదరాబాద్ పోలీసులు ఈ కైట్ ఫెస్టివల్‌లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఫెస్టివల్‌లో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇళ్లల్లో తయారుచేసిన స్వీట్‌లను ఈ ఫెస్టివల్‌లో అమ్మకాలు చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న సంప్రదాయ ఆటల పోటీలు హైదరాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో జింఖానా మైదానంలో నిర్వహించారు. దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కైట్ ప్లేయర్లు, సందర్శకులు ఈ ఫెస్టివల్స్‌లో పాల్గొంటున్న సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పోలీసు బందోబస్తును ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ఆకర్షణగా నిలిచాయి. ఈ స్టాల్స్‌లో నగర పోలీసు విభాగం ఉపయోగిస్తున్న ఆయుధాలు, డాగ్ స్క్వాడ్, సెక్యూరిటీ విభాగం, ట్రాఫిక్, ఐటీ సెల్ పరంగా ఏర్పాటు చేసిన స్టాల్స్ అకట్టుకున్నాయి. ఈ ఫెస్టివల్‌ను తిలకించేందుకు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు మరో పాడి పరిశ్రమ, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా విభాగం కార్యదర్శి బుర్రా వెంకటేశం, నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, అదనపుసీపీ షికా గోయల్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పలు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించామని తెలిపారు.
'చిత్రం... సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో సోమవారం ఘనంగా ప్రారంభమైన అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్