తెలంగాణ

కిషన్‌ను ఎందుకు తప్పించారంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: అనుకున్నట్లే, పార్టీలో మెజారిటీ నాయకులు, కార్యకర్తలు ఆశించినట్లే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్ కె. లక్ష్మణ్ నియమించటంపై పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో పార్టీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ ఇక పార్టీ లక్ష్మణ్ నేతృత్వంలో బలపడుతుందని కూడా శుక్రవారం వ్యాఖ్యానించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి పదవీ కాలం ముగిసి నాలుగు నెలలు అవుతున్నది. నాలుగు నెలలుగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి పలు పేర్లు ‘తెర’పైకి వచ్చాయి. బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తదితరులు పేర్లు వినిపించాయి. అయితే ఆంధ్రభూమి పత్రిక ముందే ప్రముఖంగా ప్రచురించినట్లే డాక్టర్ లక్ష్మణ్‌ను బిజెపి అధ్యక్షుడిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. బిసి అయిన లక్ష్మణ్‌కు బిజెపి రథసారధిగా నియమించి, ఆయన స్థానంలో (శాసనసభాపక్షం నాయకుడిగా) కిషన్ రెడ్డిని నియమించే అవకాశం ఉందని ప్రచురించడం జరిగింది. అలా చేయడం ద్వారా అసంతృప్తులకు తావు ఉండదు. బిజెపి అధ్యక్షుడిగా మూడేళ్ళ పాటు ఉండేందుకు అవకాశం ఉంది. కిషన్ రెడ్డి తొలుత ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం ముగిసిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉండడంతో అప్పట్లో మరొకరిని నియమించలేదు. గత ఏడాది డిసెంబర్‌లోనే అధ్యక్షుడి ఎన్నిక జరగాల్సి ఉండగా వాయిదా పడింది.
విద్యార్థి దశ నుంచే..
ఎంఎస్సీ పిహెచ్‌డి పట్టా పొందిన డాక్టర్ లక్ష్మణ్ విద్యార్థి దశ నుంచే ఉత్సాహంగా విద్యార్థి సంఘం ఎన్నికల్లో పాల్గొనే వారు. 1978-80 మధ్య కాలంలో పిజి సైన్స్ కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా, 1982-86 వరకు ఉస్మానియా వర్సిటీ రిసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎబివిపి ప్యానల్ నుంచి గెలుపొందారు. 1980లో బిజెపిలో చేరారు. 1989-94 వరకు బిజెపి నగర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 1994లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. 1994లో బిజెపి నగర శాఖ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1999లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2002 వరకు పార్టీ శాసనసభాపక్షం ఉప నేతగా పని చేశారు. 2002లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 2004లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2008నాటి ఉప ఎన్నికల్లోనూ ఓడిపోయారు. 2009లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. 2010-13 వరకు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2013-14లో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా పనిచేశారు. 2014లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన పార్టీ శాసనసభాపక్షం నేతగా ఎన్నికయ్యారు.
ప్రత్యామ్నాయం మేమే: నూతన రథ సారధి లక్ష్మణ్
ఇలాఉండగా పార్టీ నూతన రథ సారధిగా నియమితులైన డాక్టర్ కె. లక్ష్మణ్ శుక్రవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేస్తున్నారన్నారు. తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగకుండా పార్టీకి అంకితమైన భావంతో పని చేస్తున్నారని ఆయన తెలిపారు.