ఆంధ్రప్రదేశ్‌

సమానత్వం కోసం పోరాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 8: మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటేనే గుర్తింపుతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా మహిళలకు తోడ్పాటునందిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బుధవారం ఎంతో ఆడంబరంగా వేడుకలు జరిగాయి. ముఖ్యఅతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్‌లు లభించే వరకు మహిళలకు అండగా నిలుస్తానని హామీనిచ్చారు. పురుషులతో మహిళలు సమానత్వం సాధించేందుకు మరో 170 సంవత్సరాలు సమయం పట్టగలదని ప్రపంచవ్యాప్తంగా అంచనాలు వేస్తున్నారని, కానీ, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అందరం కలిసి పోరాడాల్సి ఉందన్నారు. మహిళలకు కావాల్సింది, ఆశించేది గౌరవం.. అలాంటి ఆత్మగౌరవాన్ని ఈ రాష్ట్రం నుంచే ప్రారంభించేందుకు పాఠశాలల్లో ‘తల్లికి వందనం’ పేరిట నిర్ణీత రోజుల్లో తల్లులందరినీ రప్పించి వారికి పాదాభిషేకం జరిపించి కాళ్ళు కడిగి ఆశీస్సులు పొందే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామన్నారు. మహిళలకు మించిన ఆర్థిక మంత్రులు ఎవరూ ఉండరంటూ ఛలోక్తి విసిరారు. తమకు ఎక్కడ పోటీకి వస్తారోనన్న భయంతోనే పురుషులు మహిళలను వంటింటికే పరిమితం చేశారన్నారు. అయితే మహిళ తన చేతిలో ఉన్న డబ్బుతో ఆ నెలంతా ఇంటి పనులన్నీ చక్కదిద్దుకోగలుగుతుందన్నారు. ఆ మహిళ కనీసం నెలకు రూ.10వేలు సంపాదించగల్గితే ఆ కుటుంబం మొత్తం ఎంతో గౌరవిస్తుందన్నారు. తాను డ్వాక్రా గ్రూపులను ప్రారంభించినప్పుడుడే మగవారు ఎగతాళి చేశారన్నారు. ఇప్పుడు వాటిల్లో 90 లక్షల మంది సభ్యులుగా ఉన్నారని, మరో 10 లక్షల మందిని చేర్చి కనీసం ఇంటికొక మహిళ గ్రూపుల్లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నానన్నారు. ప్రతి మహిళ ఓ పారిశ్రామిక వేత్త కావాలనేది తన అభిమతమన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎన్టీఆర్ ఆస్తిలో సమాన హక్కుతోపాటు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌లు కల్పించగా, ఆ స్ఫూర్తితో తాను విద్యా ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్‌లు కల్పించామన్నారు. పోలీసు కానిస్టేబుళ్ళుగా, ఆర్టీసీలో కండక్టర్‌లు, డ్రైవర్‌లుగా అవకాశం కల్పించామన్నారు. జూన్ రెండవ తేదీ లోపు 100 శాతం వంట గ్యాస్ కనెక్షన్‌లు, 2019 లోపు నూరుశాతం మరుగుదొడ్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవం కాపాడుతామన్నారు. ‘‘మహిళలు ఎందులోనూ తక్కువ కాదు.. పైగా ధైర్యం కల్గిన వారు.. స్వాతంత్య్ర సమర పోరాటంలో రాజమండ్రికి చెందిన దువ్వూరి సుబ్బమ్మ అరెస్ట్ కాగా క్షమాపణ కోరితే విడుదల చేస్తామని చెబితే తన కాలిగోరు కూడా చెప్పదంటూ ధైర్యంగా చెప్పారు’ అని సిఎం గుర్తు చేశారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని పొందిన పివి సింధును డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తున్నామని, చిన్నారులు సింధును ఆదర్శంగా తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ నియామకం చేసామన్నారు. ఆడ పిల్లలకు ఆత్మ రక్షణ కోసం కరాటే నేర్పుతున్నామని దీనివల్ల వారిలో ఆత్మ విశ్వాసం పెరుగుతుందన్నారు. 30 ఏళ్ళు దాటిన మహిళలందరికీ ఆరోగ్యపరంగా 10 జబ్బులకు సంబంధించి చెకప్ జరిపించనున్నామంటూ ఎన్నికల కోడ్ వల్ల కొన్ని వరాలు ప్రకటించలేకపోతున్నామన్నారు. ముందుగా డ్వాక్రా గ్రూప్‌ల కోసం మెప్మా సంస్థకు రూ.241.84 కోట్ల చెక్‌ను, కృష్ణాజిల్లా గ్రూప్‌లకు 1.84కోట్ల చెక్‌ను అందజేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత అధ్యక్షతన జరిగిన ఈ సభలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ పంచుమర్తి అనూరాధ, ప్రిన్సిపల్ సెక్రటరీ పునం మాలకొండయ్య, మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మేయర్ కోనేరు శ్రీ్ధర్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, కలెక్టర్ బాబు ఎ, మున్సిపల్ కమిషనర్ వీరపాండియన్, తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... విజయవాడలో బుధవారం మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాదాభివందనం చేస్తున్న మంత్రి పీతల సుజాత