రాష్ట్రీయం

2040 నాటికి అంగారకుడిపై నివాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రక్షణ శాఖ శాస్ర్తియ సలహాదారు సతీష్‌రెడ్డి
కాకినాడ, నవంబర్ 21: విజన్ 2040 నాటికి అంగారకుడిపై గ్రహంపై శాశ్వత నివాసాలు ఏర్పాటుచేసుకునేందుకు పలు ఏజన్సీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి శాస్ర్తియ సలహాదారుడు డాక్టర్ జి సతీష్‌రెడ్డి తెలియజేశారు. కాకినాడ జెఎన్‌టియు పంచమ స్నాతకోత్సవం కాకినాడ నగరంలోని వర్సిటీ ప్రాంగణంలో శనివారం ఘనంగా జరిగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సతీష్‌రెడ్డికి విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ తదితరులు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. సతీష్‌రెడ్డి మాట్లాడుతూ మానవుడిని యంత్రాలు శాసిస్తున్నాయన్నారు. దేశ రక్షణ కోసం మన సాంకేతిక వ్యవస్థ అంచెలంచెలుగా ఎదుగుతోందని చెప్పారు. దేశంలో సైబర్ యుద్ధ నేరాలపై మరింత నిఘా అవసరం అని ఆయన అన్నారు. రోబోటిక్స్, ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజన్స్, రెన్యుబుల్ ఎనర్జీ, అంతరిక్ష పర్యాటకం, స్పేస్ మైనింగ్, నానో టెక్నాలజీ తదితర రంగాల్లో సాంకేతికపరంగా కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. ప్రధానమంత్రి నినాదమైన మేక్ ఇన్ ఇండియాను డిజైన్ అండ్ మేక్ ఇన్ ఇండియాగా మార్చగలిగితే 21వ శతాబ్దాన్ని భారత్ శాసించగలదని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో మేధో సంపద ఉత్పత్తులు సేవల రూపంలో ప్రస్తుతం విస్తృతంగా అందుతున్నాయని చెప్పారు. నవ ప్రవర్తన రక్షణ విభాగంలో రోబోట్ మ్యూల్స్, మెష్‌కార్మ్స్, ఫ్లైబోట్స్, సూపర్ డ్రోన్స్ ఆవిర్భవించాయన్నారు. మానవ రహిత నిఘాను ఉపయోగపడుతున్నాయని ఆయన వివరించారు. కైనెటిక్ వెపన్స్, ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్స్, మ్యాన్ మిషన్ ఇంటర్‌పేస్ తదితర అంశాల్లో విస్తృత రీతిలో పరిశోధనలు సాగుతున్నట్టు చెప్పారు. నానో టెక్నాలజీలో నెలకొన్న చిక్కుముళ్ళను విప్పాల్సి ఉందని, యుద్ధ వాతావరణంలో చిక్కులను కూడా ఇంకా విప్పాల్సి ఉన్నదని ఆయన పేర్కొన్నారు. దేశంలో స్టార్టప్ ప్రోగ్రామ్స్‌ను చిన్న పెట్టుబడులతో ప్రారంభిస్తే ఉత్పత్తిదారులను ప్రోత్సహించేందుకు మార్గం సుగమం అవుతుందని ఆయన అన్నారు. వైస్ ఛాన్సలర్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ అధ్యక్షత వహించారు. జె ఎన్‌టియుకె పూర్వ వైస్ ఛాన్సలర్ ఆచార్య అల్లం అప్పారావు, రెక్టార్ ఆచార్య బి ప్రభాకరరావు, రిజిస్ట్రార్ ఆచార్య జివి ఆర్ ప్రసాదరాజు, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ డాక్టర్ సిహెచ్ సాయిబాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ డాక్టర్ ఉదయ్‌భాస్కర్, డైరెక్టర్ ఆఫ్ అకడమిక్ ప్లానింగ్ డాక్టర్ కె పద్మరాజు, ఇంజనీరింగ్ కళాశాల (క్యాంపస్) ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్రరాజు, విద్యార్థులు పాల్గొన్నారు.