జాతీయ వార్తలు

సావిత్రి నదిలో 14 మృతదేహాలు లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: పురాతన వంతెన కూలిపోయి రెండు బస్సులు సహా పలు వాహనాలు సావిత్రి నదిలో పడిపోయిన రెండు రోజులకు 14 మృతదేహాలు లభించాయి. గల్లంతైన వారి కోసం నదిలో ఇంకా గాలింపుచర్యలు కొనసాగుతున్నాయి. ముంబయి- గోవా రహదారిపై మహద్ వద్ద సావిత్రి నదిపై పురాతన వంతెన కూలిపోగా పలు వాహనాలు కొట్టుకుపోయి దాదాపు 50 మంది ప్రయాణీకులు గల్లంతయ్యారు. సావిత్రి నదీ తీరానికి మృతదేహాలు కొట్టుకువస్తే సమాచారం ఇవ్వాలని పలు గ్రామాల ప్రజలకు రాయగఢ్ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఎన్‌డిఆర్‌ఎఫ్ దళాలు గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని, మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు లేదా ఉద్యోగం ఇవ్వనున్నట్లు మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది.