జాతీయ వార్తలు

గోవా సీఎంగా ప్రమోథ్ ప్రమాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు. గోవా మాజీ స్పీకర్‌గా చేసిన 45 సంవత్సరాల సావంత్‌కు సీఎం పదవి దక్కే అవకాశాలు ఉన్నట్లు భావించారు. పారికర్ అంత్యక్రియలు సాయంత్రం జరిగిన తరువాత సమావేశంలో సావంత్‌ను సభానేతగా ఎన్నుకున్నారు. వాస్తవానికి రాత్రి 11 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని భావించారు. కాని ఆ సమయం అర్థరాత్రి దాటిన తరువాత 1.50 నిమిషాలకు మారింది. ఆయనతో పాటు గోవా ఫార్వ‌ర్డ్ చీఫ్ విజ‌య్ స‌ర్దేశాయ్‌, మ‌హారాష్ట్ర‌వాది గోమాంత‌క్ పార్టీ ఎమ్మెల్యే సుదిన్ ద‌వ‌లిక‌ర్‌లు ప్ర‌స్తుతం డిప్యూటీ సీఎంలుగా ఉన్నారు. గోవా క్యాబినెట్‌లో మ‌రో 9 మంది మంత్రులుగా ఉన్నారు. డిప్యూటీ స్పీక‌ర్ మైఖేల్ లోబో .. ఇప్పుడు స్పీక‌ర్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.
పలువురు పోటీ

పారికర్ మృతితో గోవా సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు పలువురు ఆసక్తి చూపారు. సంకీర్ణపక్షమైన మహారాష్టవ్రాది గోమంటక్ పార్టీ నేత సుదిన్ ధావలికర్ తనను సీఎంను చేయాలని పట్టుబట్టారు. గోవా ఫార్వర్డ్ పార్టీ అధినేత విజయ్ సర్‌దేశాయ్ కూడా సీఎం స్థానానికి పోటీపడ్డారు. మా పార్టీ ఇంతవరకు పారికర్‌కు మద్దతు పలికింది బీజేపీకి కాదు అని విజయ్ వాఖ్యానించటం గమనార్హం. కాగా మళ్లీ బీజేపీ అభ్యర్థిని సీఎం స్థానంలో నిలబెట్టేందుకు మరో ఆ పార్టీ అధిష్టానం సమాలోచనలు చేసింది. మరోవైపు గోవా అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ సైతం తన ప్రయత్నాలు చేసింది. గోవా అసెంబ్లీలో బీజేపీకి 12 స్థానాలు ఉండగా సంకీర్ణ పక్షాలతో కలుపుకుని 20 మంది శాసనసభ్యులతో ప్రభుత్వాన్ని నడుపుతుంది. కాంగ్రెస్‌కు 14మంది శాసనసభ్యులు ఉన్నారు. వీరంతా నిన్న గవర్నర్‌ను సైతం కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరటం జరిగింది. ఏదిఏమైనా చివరకు గోవా సీఎం పీఠంపై సావంత్ అధిష్టించారు.