ఆంధ్రప్రదేశ్‌

జ్ఞానసాయికి ప్రభుత్వ ఖర్చుతో వైద్యచికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: మొలకలచెరువు మండలంలోని ఆర్‌ఎస్‌ కొత్తపల్లెకు చెందిన రమణప్ప, సరస్వతి దంపతుల కుమార్తె ఎనిమిది నెలల జ్ఞానసాయి చికిత్సకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, వైద్య ఆరోగ్య శాఖమంత్రి కామినేని ప్రకటించారు. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. జ్ఞానసాయికి పుట్టుకతో కాలేయ సంబంధిత వ్యాధి ఉంది. ఇప్పటికే లక్షలు ఖర్చు చేసి చికిత్స చేయించినా ఫలితం దక్కలేదు. కారుణ్య మరణం ప్రసాదించాలని కోరుతూ జ్ఞానసాయికి సంబంధించిన కథనం రాష్ట్రమంతటా చర్చనీయాంశమైంది.