బిజినెస్

వినూత్న పథకాలతో మున్ముందుకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎస్‌బిహెచ్ ఎండి శంతన్ ముఖర్జీ
విజయవాడ, డిసెంబర్ 5: ఖాతాదారుల సేవలో అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వినూత్న పథకాల అమల్లో తమ బ్యాంక్ అగ్ర స్థానంలో ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజింగ్ డైరెక్టర్ శంతన్ ముఖర్జీ అన్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం నగరానికి విచ్చేసిన ముఖర్జీ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గత నవంబర్ 30వ తేదీ నాటికి బ్యాంక్ డిపాజిట్లు 1.30 లక్షల కోట్లు కాగా, అడ్వాన్స్‌లు 1.08 లక్షల కోట్లుగా చెప్పారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో డిపాజిట్లు రూ. 14,710 వేల కోట్లు అయితే అడ్వాన్స్‌లు రూ. 10,380 వేల కోట్లుగా తెలిపారు. బ్యాంక్ వ్యాపారంతోపాటు లాభాలను పెంపొందించే దిశలో వేగంగా అడుగులు వేస్తున్నామన్నారు. అవిభజిత ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం ప్రారంభించి నేడు దేశ వ్యాప్తంగా 1871 శాఖలతో 2,475 ఎటిఏంలతో 18 రాష్ట్రాలు రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు విస్తరించామన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం దేశ వ్యాప్తంగా 18 క్షేత్రీయ కార్యాలయాలు ఉండగా, రాష్ట్రంలో విజయవాడ, తిరుపతిలలో ఉన్నాయన్నారు. ప్రత్యేక తరహా సేవలందించేందుకు 102 ప్రత్యేక శాఖలు ప్రారంభించి వ్యవసాయ, మధ్య, చిన్నతరహా, అతి చిన్నతరహా పరిశ్రమలకు సత్వర వ్యాపార సలహాలను సహాయాన్ని అందచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 413 శాఖలున్నాయంటూ వచ్చే మార్చి నాటికి మరో 35 కొత్త శాఖలను ప్రారంభిస్తామన్నారు.
** అనాథ పిల్లల సంరక్షణార్థం రూ. 2 లక్షల విరాళాన్ని అందజేస్తున్న ఎస్‌బిహెచ్ ఎండి శంతన్ ముఖర్జీ