బిజినెస్

నిధుల వేటలో ఎస్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాండ్ల జారీతో రూ. 12,000 కోట్ల సమీకరణకు యోచన
న్యూఢిల్లీ, డిసెంబర్ 21: దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ బేసిస్‌పై టైర్-2 బాండ్ల జారీ ద్వారా 12,000 కోట్ల రూపాయల వరకు నిధుల సమీకరణ చేపట్టాలని యోచిస్తోంది. ఈ నిధుల సమీకరణను డైరెక్టర్ల కమిటీ పర్యవేక్షించనుందని సోమవారం ఓ ప్రకటనలో బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు ఎస్‌బిఐ తెలిపింది. గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ నివేదిక ప్రకారం భారతీయ బ్యాంకులకు బాసెల్-3 నిబంధనల మేరకు 2018-19 నాటికి 140 బిలియన్ డాలర్ల మూలధనం అవసరం. దశలవారీగా 2013 ఏప్రిల్ 1 నుంచి బాసెల్-3 క్యాపిటల్ రెగ్యులేషన్స్ భారత్‌లో అమలవుతున్నాయి.
అలహాబాద్ బ్యాంక్ చేతికి వెయ్య కోట్లు
మరో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ అలహాబాద్ బ్యాంక్ ప్రైవేట్ ప్లేస్‌మెంట్ బేసిస్‌పై టైర్-2 బాండ్ల జారీ ద్వారా 1,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో బ్యాంక్ తెలియజేసింది.