బిజినెస్

ఇంధన సర్‌చార్జీని తగ్గించిన ఎస్‌బిఐ కార్డ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 26: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) అనుబంధంగా పనిచేస్తున్న ఎస్‌బిఐ కార్డ్.. బుధవారం ఇంధన సర్‌చార్జీని 2.5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయంతో ఎస్‌బిఐ కార్డ్‌కున్న 40 లక్షలకుపైగా కస్టమర్లు లబ్ధి పొందనున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్‌బిఐ కార్డ్ ఎండి, సిఇఒ విజయ్ జసుజా ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు రహిత లావాదేవీలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది తెలిసిందే. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్‌రంగ బ్యాంకులూ ఆ దిశగా పయనిస్తున్నాయి.