రంగారెడ్డి

హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రవేశం కోసం దరఖాస్తుల ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, డిసెంబర్ 5: హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్, రామాంతపూర్‌లలో ఒకటవ తరగతి ప్రవేశం కోసం షెడ్యూల్డ్ కులాల బాల బాలికల నుండి 2016 - 17 విద్యా సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు మేడ్చల్ డివిజన్ దళిత అభివృద్ధి శాఖ సహయ అధికారి సంజీవరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశం కోసం ఈ నెల 9వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. తల్లితండ్రుల వార్షిక ఆదాయం రూరల్‌లో రూ. 65వేలు, అర్బన్‌లో రూ. 75వేల లోపు ఉండాలని, జిల్లా వాసులై ఉండటంతో పాటు కుల, ఆదాయ, స్థానిక ధ్రువీకరణ పత్రాలు మీసేవ నుండి పొంది ఉండాలని పేర్కొన్నారు.
ప్రవేశం కోసం 1-6-2010 నుండి 31-5-2011 వరకు పుట్టిన వారు అర్హులని, మున్సిపల్/తహశీల్దార్ నుండి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం పొంది జరాక్స్ పత్రాలన్నింటిపై గెజిటెడ్ అధికారిచే ధ్రువీకరించి దరఖాస్తు ఫారంతో జత పర్చాలని వివరించారు. అలాగే రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ జత చేసి అన్ని ధ్రువీకరణ పత్రాలను జత చేయాలని సూచించారు.
ఒక కుటుంబం నుండి ఇద్దరు మాత్రమే ప్రవేశానికి అర్హులని, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా దరఖాస్తు చేసుకున్న బాలబాలికలు మాత్రమే స్కాలర్‌షిప్‌కు అర్హులని పేర్కొన్నారు.