రాష్ట్రీయం

పథకాలే గెలిపించాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజావ్యతిరేకత వట్టిమాటే!
బలహీనమైన ప్రత్యర్థులు,
రాజయ్య ఉదంతం కలిసొచ్చాయి
ఫలించిన నియోజకవర్గానికో ఇంఛార్జి మంత్రి
ఆద్యంతం టిఆర్‌ఎస్ వ్యూహాత్మకం

హైదరాబాద్, నవంబర్ 24: వరంగల్ ఉప ఎన్నికల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువ మెజారిటీ లభించడంతో టిఆర్‌ఎస్ నాయకుల ఆనందానికి అంతు లేదు. వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉండగా, ఏడింటిలోనూ టిఆర్‌ఎస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. టిఆర్‌ఎస్ అభ్యర్థి ఘన విజయానికి ప్రభుత్వ పథకాలు బాగా ఉపయోగపడ్డాయి. దీనికి తోడు బలహీనంగా ఉన్న విపక్షాలు టిఆర్‌ఎస్ దూకుడు ముందు నిలువ లేకపోయాయి. మీడియా ప్రచారాన్ని మాత్రమే నమ్ముకున్న విపక్షాలు ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లలేకపోయారు. ఒకవైపు ప్రతి కుటుంబానికీ ఏదో ఒక ప్రయోజనం కలిగే విధంగా ఉన్న ప్రభుత్వ పథకాలు, బలమైన పార్టీ యంత్రాంగం టిఆర్‌ఎస్‌కు ఘన విజయాన్ని చేకూర్చి పెట్టాయి.
విపక్షాలు వ్యక్తిగత దూషణకు దిగుతున్నా, అధికార పక్షం పట్టించుకోకుండా బలాన్ని కూడగట్టుకోవడంపై దృష్టిసారించింది. టిఆర్‌ఎస్ విజయం సాధిస్తుందనే అభిప్రాయం కాంగ్రెస్, బిజెపిల్లో సైతం బలంగా ఉంది. అయితే అధికార పక్షం మెజారిటీని తగ్గించాలని విపక్షాలు కంకణం కట్టుకున్నాయి. గత ఎన్నికల కన్నా దాదాపు తొమ్మిది శాతం తక్కువ పోలింగ్ జరగడంతో అధికార పార్టీ అభ్యర్థికి గతానికంటే మెజారిటీ తగ్గుతుందని, అదే జరిగితే ప్రజా వ్యతిరేకత వల్లనే మెజారిటీ తగ్గిందంటూ దాడి చేయవచ్చని వ్యూహం రచించాయి. కానీ చిత్రంగా తొమ్మిది శాతం పోలింగ్ తగ్గినా, మెజారిటీ మాత్రం గతంలో కన్నా పెరిగింది. 2014 ఎన్నికల్లో కడియం శ్రీహరికి మూడులక్షల 93వేల ఓట్ల మెజారిటీ రాగా, ఉప ఎన్నికల్లో ఏకంగా దయాకర్‌కు నాలుగు లక్షల 59వేల ఓట్ల మెజారిటీ వచ్చింది. గత ఎన్నికల కన్నా కాంగ్రెస్, బిజెపి అభ్యర్థుల ఓట్లు గణనీయంగా తగ్గిపోవడం ఆ పార్టీ నాయకులను నిరాశ పరిచింది. 2014లో కనీసం కాంగ్రెస్‌కు డిపాజిట్ దక్కింది. ఈసారి మాత్రం కాంగ్రెస్, బిజెపి రెండు పార్టీల అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతు అయింది. సాధారణంగా ప్రభుత్వంపై ప్రజల్లో కాలం గడిచినా కొద్ది వ్యతిరేకత ఏర్పడుతుంటుంది. కానీ తెలంగాణ రాష్ట్ర సమితి అలాంటి వ్యతిరేకతకు అవకాశం ఇవ్వలేదు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపిలకు ఓటు వేసిన వారు సైతం ఈసారి టిఆర్‌ఎస్‌కు ఓటు వేశారు. ఆసరా, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వంటి పథకాలతోపాటు ఒక్కో నియోజకవర్గానికి మంత్రిని ఇన్‌చార్జ్‌గా నిర్వహించడం వంటి వ్యూహాలు టిఆర్‌ఎస్ విజయానికి దోహదం చేశాయి. కాంగ్రెస్ ప్రచారానికి మీరాకుమార్, షిండే లాంటి వాళ్లను రంగంలో దించినా ఫలితం లేకపోయింది.
ఇక బిజెపి అభ్యర్థి గెలిస్తే కేంద్ర మంత్రి అవుతారు, వరంగల్ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు నిధులు తెస్తారని బిజెపి, టిడిపి చేసిన ప్రచారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. పైగా గతంలో కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. ప్రధానంగా టిడిపి, బిజెపి నాయకులు వ్యక్తిగత దూషణలకు దిగినా అధికార పక్షం వ్యూహాత్మకంగానే వౌనంగా ఉంది. ప్రధానంగా ఏడాదిన్నర కాలంలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారం చేసుకోవడానికే టిఆర్‌ఎస్ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ వ్యూహం బాగానే పని చేసింది. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా చివరి నిమిషంలో రాజయ్యను మార్చి, సర్వే సత్యనారాయణను రంగంలో దింపడం, బిజెపికి సరైన అభ్యర్థి లభించక అమెరికా నుంచి దేవయ్యను పిలిపించి పోటీ చేయించడం వంటివి టిఆర్‌ఎస్‌కే మేలు చేశాయి. అంది వచ్చిన అవకాశాలన్నింటిని ఉపయోగించుకుని మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం వ్యూహ రచన చేసి టిఆర్‌ఎస్ ఘన విజయం సాధించింది.