రాష్ట్రీయం

అలా వెళ్లి.. ఇలా వచ్చేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా నుంచి విద్యార్థులు తిరిగొచ్చిన వైనం
సియోటెల్ వర్సిటీలో పరిస్థితి దారుణం
ఉగ్రవాదుల్లా మమ్మల్ని విచారించారు
తెలుగువాళ్లంటేనే అసహ్యించుకున్నారు
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విద్యార్థుల ఆవేదన

హైదరాబాద్, జనవరి 2: అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో, వెస్ట్రన్ వర్సిటీ విద్యార్థులు భారత్‌కు తిరుగుముఖం పట్టారు. ఈనెల 4నుంచి సెమిస్టర్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి వారం రోజులుగా అమెరికాకు బయలుదేరి వెళ్తున్నారు. గత శనివారం నుంచి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాలకు చెందిన 85మంది విద్యార్థులను వివిధ కారణాలు చూపుతూ శాన్‌ఫ్రాన్సిస్కో విమానాశ్రయం నుంచే అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు వెనక్కి పంపిస్తున్న విషయం విధితమే. తాజాగా శనివారం ఉదయం 15మంది విద్యార్థులు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులను అక్కడి అధికారులు ఉగ్రవాదులను విచారించే విధంగా తమను సియోల్ వర్సిటీలో బంధించి ప్రశ్నించారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు విద్యార్థులు అనగానే అసహనంతో వేధింపులకు గురిచేస్తున్నారని హైదరాబాద్ విద్యార్థి నవీన్ వాపోయారు. న్యూయార్కు ఎయిర్‌పోర్టు నుంచి తెలుగు విద్యార్థులను వివిధ ప్రశ్నలతో అవమానించి హైదరాబాద్‌కు తిరిగి పంపించారని మరో విద్యార్థి విక్రమార్జున్ తెలిపారు. ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లిన తమవద్ద అన్ని డాక్యుమెంట్లు సరిగ్గానే ఉన్నాయని, అకారణంగా తమను అక్కడి ఇమిగ్రేషన్ అధికారులు విచక్షణరహితంగా మనోవేదనకు గురిచేస్తూ భారత్‌కు తిరిగి పంపిస్తున్నారని వాపోయారు. తెలుగు విద్యార్థులు అనగానే ఏదో కారణంగా వేధిస్తున్నారని, ప్రభుత్వం జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాల్సిందిగా విద్యార్థులు కోరుతున్నారు.