క్రీడాభూమి

బర్న్స్, ఖాజా శతకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆసీస్ 3 వికెట్లకు 345
విండీస్‌తో రెండో టెస్టు

మెల్బోర్న్, డిసెంబర్ 26: జోబర్న్స్, ఉస్మాన్ ఖాజా శతకాలతో చెలరేగడంతో వెస్టిండీస్‌తో శనివారం ప్రారంభమైన తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా మూడు వికెట్లకు 345 పరుగుల భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 29 పరుగుల వద్ద ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్‌ను కోల్పోయింది. అతను 23 పరుగులు చేసి జెరోమ్ టేలర్ బౌలింగ్‌లో మార్లొన్ శామ్యూల్స్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. అనంతరం బర్న్స్, ఖాజా కలిసి రెండో వికెట్‌కు 258 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. గాయాలతో బాధపడుతున్న కారణంగా ఈ సీజన్‌లో చాలాకాలం క్రికెట్‌కు దూరమైన ఖాజా తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కెరీర్‌లో మూడో శతకాన్ని నమోదు చేశాడు. అతను కేవలం నాలుగు టెస్టు ఇన్నింగ్స్‌లోనే మూడు సెంచరీలు సాధించడం గమనార్హం. అతను 227 బంతులు ఎదుర్కొని, 6 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 144 పరుగులు చేశాడు. కాగా, ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్న బాక్సింగ్ డే టెస్టు అయినప్పటికీ, శనివారం మెల్బోర్న్ స్టేడియం గత 16 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత తక్కువగా, కేవలం 53,389 మంది ప్రేక్షకులే హాజరుకావడం నిర్వాహకులను నిరాశ పరచింది. ఖాజాతోపాటు బర్న్స్ కూడా శతకాన్ని నమోదు చేసి, వారిని సంతోషపరిచాడు. అతను 230 బంతులు ఎదుర్కొన్నాడు, 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 128 పరుగులు చేసి, బ్రాత్‌వెయిట్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ రాందిన్ స్టంప్ చేయడంతో వెనుదిరిగాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 90 ఓవర్లలో 3 వికెట్లకు 345 పరుగులు సాధించగా, కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 32, ఆడమ్ వోగ్స్ 10 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. టేలర్ రెండు వికెట్లు సాధించాడు. బ్రాడ్‌వెయిట్‌కు ఒక వికెట్ లభించింది.