రాష్ట్రీయం

శరవేగంగా ఏపి సచివాలయ నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మార్చి 12: అనుకున్న సమయానికి ఏపి రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వ సచివాలయ భవనాన్ని నిర్మించేందుకు ఎల్ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణ పనులు కొనసాగిస్తున్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో సుమారు 45 ఎకరాల విస్తీర్ణంలో సెక్రటేరియట్‌ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. సుమారు 6 లక్షల చదరపు గజాల విస్తీర్ణంతో సెక్రటేరియట్ జూన్ 15నాటికి సిద్ధం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు చివరిసారిగా ప్రస్తుతం ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. వచ్చే అసెంబ్లీ సమావేశాలు విజయవాడలోనే నిర్వహించనున్నారు. దీంతో అసెంబ్లీ సిబ్బంది అంతా త్వరలోనే ఇక్కడికి రావల్సి ఉంటుంది. తమకు వసతి సౌకర్యం కల్పిస్తే విజయవాడకు రావడానికి సిద్ధమని ఏపి ఎన్‌జిఓ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి.
జూన్ 15 తరువాత విజయవాడ నుంచే పూర్తిస్థాయిలో పాలన చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. సుమారు 15వేల మందికి సరిపడా సెక్రటేరియట్ భవనాన్ని సిద్ధం చేస్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చే ఉద్యోగులకు వసతి కల్పించేందుకు కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషిస్తోంది. విజయవాడలో ఇళ్ల అద్దెలు భారీగా పెరిగిపోవడంతో ఉద్యోగులకు క్వార్టర్లు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నా ప్రస్తుతానికి అది సాధ్యపడడం లేదు. దీంతో కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్లను లీజుకు తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే గుంటూరుకు సమీపంలోని రెయిన్ ట్రీ పార్క్‌లో 400 ఫ్లాట్లను ప్రభుత్వం లీజుకు తీసుకుంది. ఏదేమైనా ప్రభుత్వ కార్యకలాపాలు జూన్ నుంచి విజయవాడలో ఊపందుకోనున్నాయి. ** ముమ్మరంగా సాగుతున్న ఏపి సచివాలయ నిర్మాణ పనులు **