జాతీయ వార్తలు

లౌకికవాదానికి పెనుముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ అధినేత్రి సోనియా హెచ్చరిక
సంఘటితంగా ఉండాలని పిలుపు
న్యూఢిల్లీ, మార్చి 12: భారతదేశం సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. ఇందుకు కారణం అధికారంలో ఉన్న వ్యక్తులు వైషమ్యాలను రెచ్చగొట్టడమేనని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజలందరినీ సంఘటితం చేసి ఈ విష ప్రచారాన్ని అడ్డుకోవల్సిన అవసరం ఎంతో ఉందని పిలుపునిచ్చారు. జామియత్ ఉలేమా ఈ హింద్ సంస్థ ఏర్పాటు చేసిన జాతీయ సమగ్రత సదస్సుకు పంపిన లిఖితపూర్వక సందేశంలో ఆ విషయాన్ని స్పష్టం చేశారు. లౌకిక వాదాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రయత్నాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఎంతో ఉందని ఇందుకు ప్రజలందరూ కుల, మత, ప్రాంత, వర్గాలకు అతీతంగా సంఘటితం కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడారు. సమగ్రత పర్యవేక్షణలో జామియత్ ఉలేమా నిర్వహిస్తున్న పాత్రను ఆయన ప్రశంసించారు.