జాతీయ వార్తలు

పాక్‌ను వదలొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లి:కాశ్మీర్‌లో సైనిక స్థావరంపై దాడి వెనుక పాకిస్తాన్ ఉందని భారత్ విశ్వసిస్తోంది. దీనికి తగ్గట్టుగానే పౌరులుకూడా పాక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ పాక్ వైఖరిని తూర్పారపడుతూ భారత్ తగిన చర్యలు తీసుకోవాలని ట్విట్టర్‌లో స్పందించారు. సైనికులపై ఆత్మాహుతి దాడి, జవాన్ల వీరమరణం వార్త విని తన గుండె పగిలిందని సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన రక్తం మరిగిపోతోందని, శత్రుదేశంపై చర్యలు తీసుకోవాలని ఆ క్రికెటర్లు సూచించారు. ఇక పాక్‌పై యుద్ధం చేయాల్సిందేనని, ఆ దేశం అదే కోరుకుంటున్నట్లుందని, అలాంటప్పుడు వారికి నచ్చిన మార్గంలోనే మనం దాని పనిపట్టాలని ప్రముఖ బాక్సర్ విజేందర్ అభిప్రాయపడ్డారు. ఇక ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపి జెసి దివాకర్ రెడ్డి స్పందిస్తూ పాకిస్తాన్‌పై యుద్ధం చేసి మట్టికరిపించాలని, అఖండభారత్ అవశ్యమని పిలుపునిచ్చారు. కుట్రలు, విద్రోహ చర్యలతో ఎంతకాలం వేగుతామని, సైన్యంకోసం పెట్టే ఖర్చుకన్నా యుద్ధం చేసి శాశ్వత పరిష్కారం చేసుకుంటే దేశాన్ని సస్యశ్యామలం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.