క్రీడాభూమి

మూడో రౌండ్‌కు సెరెనా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్

ఇండియన్ వెల్స్ (అమెరికా), మార్చి 14: ఇండియన్ వెల్స్ పిఎన్‌బి పరిబాస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ మూడో రౌండ్‌కు దూసుకెళ్లింది. యులియా పుత్నిత్సెవాతో జరిగిన మ్యాచ్‌లో మొదటి సెట్‌ను 7-6 తేడాతో అతి కష్టం మీద గెల్చుకున్న ఆమె రెండో రౌండ్‌లో పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 6-0 తేడాతో ఆమెను చిత్తుచేసింది. కెరీర్‌లో 21 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను కైవసం చేసుకున్న ఆమె 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఇండియన్ వెల్స్ టైటిల్ కోసం పోటీపడుతున్నది. ఇతర మ్యాచ్‌ల్లో, అగ్నీస్కా రద్వాన్‌స్కా 6-2, 6-1 తేడాతో మోనికా నికలెస్క్యూను ఓడించగా, కాతెరీన బొడెరెన్కో 3-6, 6-4, 7-6 ఆధిక్యంతో లెసియా సురెన్కోపై విజయం సాధించింది. నికోల్ గిబ్స్ 6-0, 6-4 స్కోరుతో యార్లొస్లావా ష్వెడోవాను ఓడించింది. జెలెనా జన్కొవిచ్ 6-0, 6-1 తేడాతో కొకొ వాంగెవాగ్‌పై, సిమోనా హాలెప్ 6-2, 6-4 స్కోరుతో కాతరీన మకొరోవాపై విజయాలను నమోదు చేశారు.
జొకోవిచ్ ముందంజ
పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ కూడా మూడో రౌండ్ చేరాడు. అతను రెండో రౌండ్‌లో బోర్న్ ఫాటాంగిలోను 2-6, 6-1, 6-2 తేడాతో ఓడంచాడు. మరో మ్యాచ్‌లో స్టీవ్ జాన్సన్ 6-4, 6-2 ఆధిక్యంతో జాన్ మిల్మన్‌పై గెలిచాడు. ఇటీవల కాలంలో ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతూ ఆసించిన స్థాయిలో రాణఇంచలేకపోతున్న రాఫెల్ నాదల్ 6-2, 2-6, 6-4 తేడాతో గిలెస్ ముల్లర్‌పై గెలిచి, మూడో రౌండ్ చేరాడు. జాన్ ఇస్నర్ 7-6,6-4 తేడాతో ఆండ్రియాస్ సిప్పీని, జాక్ సాక్ 6-2, 6-4 తేడాతో మైఖేల్ బెరెర్‌ను ఓడించారు.
సాన్‌టినా ఓటమి
సానియా మీర్జా, మార్టినా హింగిస్ జోడీ మహిళల డబుల్స్ రెండో రౌండ్‌లోనే పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. వనినా కింగ్, అలా కుద్య్రుత్సెవా జోడీతో తలపడిన సాన్‌టినా జోడీ 6-7, 4-6 తేడాతో పరాజయాన్ని చవిచూసింది.