డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు 6

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉఫ్.. ఈ ఆత్మీయ సంబంధం ఒక రకంగా ప్రాణాలను కూడా తీస్తుంది. ఈ దారం ఎంత గట్టిది. ఎవరి నుండి దూరంగా ఎంతవేగంగా పారిపోవాలనుకున్నాడో వాళ్ళనుండి దూరం అవుతున్నపుడు ఈ క్షణాలు.. అంత వేగంగానూ దగ్గరికి లాగుతున్నాయి.
తను తన తండ్రిలాగా పైసా పైసాలెక్క కడుతూ, ఇత్తడి సామాన్లను తూస్తూ, ఏ ఫర్మ్‌లోనో పనిచేస్తూ, బాస్ వెధవ ముఖం చూస్తూ బతకడం తనకి ఇష్టం లేదు. వీటి బదులు దేశ రక్షణ కోసం సరిహద్దులను పరిరక్షిస్తూ బతకడం తన కల పండుతోంది.
తొందరగా రైలు బయలుదేరితే బాగుంటుంది. తను తన వాళ్ళ ఎదురుకుండా బలహీనుడు కాకూడదు. తనలో ఉప్పొంగుతున్న భావ తరంగాల ముందు తలవంచకూడదు. తనే ఆ రైలుని తోస్తే.. దాదాపు ఒక నెల తన వాళ్ళందరినీ భరించాడు. అరుపులు.. గోలలు.. పోట్లాటలు.. అలకలు.. కాని ఈ పదిహేను నిమిషాలు రాళ్ళలా తనకు బరువు అవుతున్నాయి.
ఇక రైలు బయలుదేరుతోంది అని అనిపించగానే తల్లిదండ్రుల కాళ్ళకు నమస్కరించాడు. తండ్రి అతడిని కౌగిలించుకున్నాడు. మళ్ళీ అతడికి నచ్చచెప్పాలని ప్రయత్నించాడు.
‘‘బాబూ! ఆర్మీ అగ్రిమెంటు ప్రకారం నువ్వు ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వెనక్కి తిరిగి రావచ్చు ఈ సివిలియన్ లైఫ్‌లోకి.. ఇప్పుడు కూడా నీవు నిర్ణయాన్ని మార్చుకోవచ్చు. కాని ఒక్కసారి ఎగ్రిమెంట్‌లో సంతకం చేస్తే ఇక మళ్లీ నీవు వెక్కి తిరిగి రాలేవు. అది సంభవం కాదు కూడా...’’ చెబుతూ చెబుతూ ఆయన ఏడ్చేశాడు. తండ్రి ఈ కొత్త రూపం ఇప్పుడు అతడి ఎదురుగుండా ప్రత్యక్షం అయింది.
ఈనాటివరకు అతడు తండ్రిని కేవలం ఒక వ్యాపారవేత్తగా మాత్రమే చూసాడు. తన దగ్గర పనిచేసేవాళ్ళతో, అప్పులవాళ్ళతో కఠోరంగా మాట్లాడటమే తను చూసాడు.. తండ్రిలోని ఈ కొత్త రూపాన్ని.. తల్లి కళ్ళ వెంట వస్తున్న కన్నీళ్ళను చూడగానే.. అతడి లోపల నిశ్చలంగా వున్న నీటిలో తెలియకుండానే అలలు లేచాయి. ఆ అలల ముందు అతడి దృఢత్వం ఇసుకగూడులా పడిపోయింది.
సందీప్ రైలు బయలుదేరకముందే తన సీటు దగ్గరికి వెళ్లిపోయాడు. వెళ్ళే ముందు తను ఎంత మాత్రం బలహీనుడు కాకూడదు అని అతడు అనుకున్నాడు.
రైలు బయలుదేరింది. అమ్మ కిటికీ ముందు నిల్చుని సందీప్.. సందీప్.. ద్వారం దాకా రారా అని అరవడం విన్నాడు. కాని అతడు అక్కడిదాకా రాలేదు. లోపల లేస్తున్న తుఫానులను ఆపే ప్రయత్నం చేసాడు. ఈ క్షణం విచలితుడైతే ఇక జన్మ అంతా తనను తను క్షమించలేడు. నిజంగా ఎంత రహస్యమైనది ఈ మనస్సు. నిజానికి తను కోరుకున్నదే తను చేస్తున్నాడు కాని... కాని.. తనకు సంతోషంగా ఎందుకు అనిపించలేదు. ఎందుకింత అకలం వికలం అవుతున్నాడు. చివరికి రైలు బయలుదేరింది. పరుగెత్తుకుంటూ దర్వాజా దాకా వచ్చాడు. వీడ్కోలు చెబుతున్నాయి చేతులు. అతడి కళ్ళ ఎదుట ఆ దృశ్యం కదలాడసాగింది.. బాధపడి కృంగిపోతున్న తల్లి చేయి పట్టుకుని తమ్ముడు నడిపిస్తున్నాడు. నెమ్మది నెమ్మదిగా.. డెహరాడూన్ స్టేషన్.. హమ్మయ్య అని అనుకున్నాడు. ఎదురుగుండా ఆర్మీ వాళ్ళ ట్రక్.. అందులో ఎంతోమంది ఆర్మీ ఆఫీసర్లు ఉన్నారు. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి ట్రక్ బయలుదేరింది.
కల పండాక ఎట్లా జీవిస్తాడు మనిషి?
ఇదిగో ఇట్లాగా...
సందీప్‌లోని భావోద్వేగాలు ఒక్కసారిగా అతడిమీద ప్రభావం చూపెట్టాయి. ఇప్పుడు అతడు ఇండియన్ ఆర్మీలో ఉన్నాడు. అతడిలో లేచిన ఈ భావోద్వేగపు అల అతడిని సంతోషంతో ముంచెత్తింది. కాని మరోవైపు తను ఇంటి నుండి వేల మైళ్ళ దూరంలో ఉన్నాడు అన్న ఆలోచన దుఃఖాన్ని కలిగించింది. ఇక ముందు తను తన రెక్కల బలంతోనే ఎగరాలి. తనలో ఇంత సామర్థ్యం ఉందా? అసలు ఆ ట్రైనింగ్ ఎట్లా ఉంటుందో ఏమో.. అయినా తెలియకుండానే ఆశ చిగురిస్తోంది. తప్పకుండా ఆర్మీ తనని ఆహ్వానిస్తుంది. వార్తాపత్రికలో పడ్డ ప్రకటన అతడి కళ్ళలో మెదిలింది. నేషన్ నీడ్స్ యు.. తన కెరియర్‌ని ఫణంగా పెట్టి ఇందులో చేరాడు. మరి తనకు ప్రాముఖ్యత ఇవ్వదా ఆర్మీ?
ఆర్మీ ట్రక్ దగ్గర నిల్చున్న అతడి చెవుల్లో కఠోరమైన శబ్దాలు పడ్డాయి. సామాన్లు ఎత్తు.. ఏమిటి? తనకే చెప్పారా! లోపల ఎక్కడో కలుక్కుమంది. గునపం గుచ్చినట్లయింది. అతడిలోని ఉత్సాహం అంతా కింద పడ్డ గాజు గ్లాసు ముక్క ముక్కలు అయింది. ఆర్మీ జీవితంపట్ల ఉన్న మోహం ఒక్కసారిగా పటాపంచలయింది. కూలీ వచ్చి సామాన్లు ఎత్తుతాడు. తను రాజాబాబులా పాంటు జేబుల్లో చేతులు పెట్టుకుని నవ్వుతూ నెమ్మది నెమ్మదిగా నడుస్తాడు అని అనుకున్నాడు.
ఉఫ్.. అసలు అతడు ఇది ఆర్మీ అన్న సంగతే మరచిపోయాడు. ఇక్కడి జీవిత విధానం కఠోరమైంది. ఇంతకుముందు పడ్డ దెబ్బకే ఇంకా కోలుకోలేదు. మరో దెబ్బ. చెవులకు కర్కశమైన మాటలు వినబడ్డాయి. యూ బాస్టర్డ్ కమ్ హియర్! తనకన్నా ఆర్నెల్లు సీనియర్ అయిన అతడి బిహేవియర్ ఈ విధంగా.. మెల్లి మెల్లిగా తనని తను సంబాళించుకుంటుండగా ఆ ఆఫీసరు అతడి బెల్ట్ లూప్‌లో వేలు పెట్టాడు. మెడమీద గట్టిగా చేయి వేశాడు.
అతడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అసలు ప్రపంచంలో ఆక్సిజన్ తక్కువ అయిందా! ఊపిరి ఆడటంలేదు. ఆ మాట ‘బాస్టర్డ్’ అతడిని రంగుల కల నుంచి ఒక్కసారిగా కిందికి తోసేసింది. అంతేకాదు, భవిష్యత్తును ఊహిస్తున్న అతడిలో భయం కూడా కలిగింది. ఉఫ్.. ఇది ఆర్మీయా! లేక ఎద్దా? కొమ్ములతో పొడిచింది. ఏ ఆర్మీ కోసం అయితే అతడు ఇంటిల్లిపాదినీ ఏడ్పించాడో, ఇప్పుడు అందులో అడుగుపెట్టగానే ఆర్మీ తనని ఏడిపించింది.

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత