డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు 12

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని బాక్సింగ్ ఛాంపియన్‌కి విలవిలకొట్టుకుంటున్న చేపలను పట్టుకుని ఎదురు చూడగానే తెలివితప్పి పడిపోయే పరిస్థితి వచ్చింది. గుండెల దడదడలాడాయి. కాని భయపడే సైనికుడు ఒక సైనికుడేనా? పిరికితనం- సైనికుడు కలిసి నడవలేరు.
ఆ రోజు ఎన్నో దెబ్బలు తిన్నాడు. దెబ్బలు తింటూనే ఉన్నాడు. కాని ఎరీనాని వదలలేదు. జపాన్ సైనికుడు సోకోరుూ గుర్తుకు వచ్చాడు. అతడు సుకోమలమైన మనస్సు- మస్తిష్కాలలో సైనికుడికి కొత్త భాష నేర్పించాడు. దేశభక్తి గుర్తుకురాగానే అతడిలోని బలహీనత గోడకి ఉన్న సున్నంలా రాలిపోతుంది.
సొకొరుూ ద్వితీయ మహాయుద్ధంలో సైనికుడిగా పనిచేసాడు. జపాన్ ఆత్మసమర్పణ చేసింది అని తెలియగానే అతడు నమ్మలేకపోయాడు. తన దేశం ఎంతో శక్తిగల దేశం. అమెరికా ముందు ఆత్మసమర్పణ చేసిందా? ఈ కారణం వలన 1944లో గుహాన్ ద్వీపాన్ని విముక్తం చేసింది అని తెలియగానే పదిమంది సైనికుల కల సోకోరుూటుకుడీ ఆత్మ సమర్పణ చేయడానికి ఎంతమాత్రం ఇష్టపడలేదు. అడవులలోకి పారిపోయారు. ప్రాణాలు ఉన్నంతవరకు పోరాడుతాం అని నిశ్చయించుకున్నారు. ఆత్మసమర్పణ చేశారు అని అమెరికా ప్రాపకాండ ఇది అని అనుకున్నారు. 1945లో రెండో మహాప్రపంచ యుద్ధం మొదలయింది. కాని వాళ్ళు అడవుల్లోనే ఉన్నారు. తరువాత వాళ్ళలో ఏడుగురు సైనికులు సివిలీయన్ జీవితంలోకి వెళ్లిపోయారు. ఇంకా తమ దేశం యుద్ధం చేస్తూనే ఉన్నది అని వాళ్ళు నమ్మకం. వాళ్ళ ముగ్గురిలో ఇద్దరు ఆకలితో చచ్చిపోయారు. 1972లో రెండో ప్రపంచ యుద్ధం అయ్యాక 28 సం.లకు అక్కడ స్థానీయ మత్స్యకారులు ఆ సైనికుడిని బలవంతంగా అడవిలో నుండి లాక్కొచ్చారు. అతడు బయటికి వచ్చాక రాష్ట్రీయ అవార్డు లభించింది. కాని అతడు మనస్సులో తను సైనికుడిగా తన కర్తవ్యాన్ని నిర్వహించలేదు అన్న భావన ఉంది. జపాన్ రాజు అతడిని సభకు పిలిచినపుడు ఆయన ఇట్లా అన్నారు- ‘ఇట్ ఈజ్ మచ్ ఎంబ్రాస్‌మెంట్ దట్, ఐ హావ్ రిటర్న్‌డ్ అలైవ్’.
సైనికుడంటే ఇతడే...
సందీప్ ముఖం బాగా వాచిపోయింది. అతడు తన ముఖాన్ని తనే గుర్తుపట్టలేకపోయాడు. ముక్కు, పెదిమలు, బుగ్గలు అంతటా రక్తం. నాలికకు దెబ్బ తగలలేదు.
ఇది తను ఎంచుకున్న జీవితమే కదా! అతడు తనని తనే హేళన చేసుకున్నాడు.
ఆరు నెలలు గడిచిపోయాయి. మొదటిసారి ఆదివారం అతడు సివిల్ డ్రెస్‌లో బయటికి వెళ్ళేందుకు అనుమతి దొరికింది.
ఇప్పుడు సమయంలో చాలా మార్పు వచ్చింది. ఆదివారం ఎంతో ఆనందంగా మనస్సుకు నచ్చేటట్లు గడుపుకుంటాడు. ఆదివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ తక్కిన రోజులను ఏదోవిధంగా గడిపేస్తాడు.
ఒక రోజు హఠాత్తుగా సంతోషకరమైన వార్త విన్నాడు. ఇంటికి వెళ్ళడానికి పది రోజుల సెలవు దొరికింది. ఎగిరి గంతేసాడు. వావ్.. భోజనం చేసేటప్పుడు, రాత్రి నిద్రపోయేటప్పుడు, సీనియర్ల బెదిరింపులు విన్నప్పుడు- ప్రతీక్షణం అతడికి ఇల్లు గుర్తుకువచ్చేది.
ఇంటినుండి దూరంగా ఉండటం వలన ఇంటి విలువ ఏమిటో తెలుసుకున్నాడు. తన సంతోషాన్ని పంచుకోవడానికి పరమజీత్ ఉండే హాస్టల్ దగ్గరకు వెళ్లాడు. పరమజీత్ ఉదాసీనంగా కూర్చుని ఉన్నాడు.
‘పరమజీత్! ఎందుకురా అంత ఉదాసీనంగా ఉన్నావు. కొంపలు మునిగిపోతున్నట్లుగా! ఏమిటిరా ఆ చూపులు? ఇంటికి వెళ్ళవా? అంతా సర్దేసుకున్నావా? సామాన్లు ఎక్కడ ఉన్నాయిరా? అరె యార్ ఎందుకట్లా ఉన్నావు?
పరమజీత్ కళ్ళల్లో ఎటువంటి భావం లేదు. శూన్యంగా ఉన్న ఆ కళ్ళను చూసి మళ్లీ సందీప్ అన్నాడు.
‘‘ఏమిటిరా! ఎందుకట్లా ఉన్నావు? చెప్పవేంరా?’’
‘‘నా సెలవులను కాన్సిల్ చేశారురా? నేను ఇంటికి వెళ్ళడం లేదు’’ పరమజీత్ చెప్పలేక చెప్పలేక ఉదాసీనంగా అన్నాడు.
‘‘ఎందుకు?’’
‘‘పనిష్‌మెంట్’’
‘‘కారణం’’
‘‘డ్రిల్ సరిగ్గా చేయలేకపోయాను’’
‘‘్భగవంతుడా! ఇది ఆర్మీయా లేక సుత్తా.. సైనికులలోని కోమలమైనభావాలను అణగదొక్కి అణగదొక్కి వేళ్ళతో సహా పెరికివేయాలని ఇట్లా కూడా చేస్తారా’’
మరుభూమి లాంటి అతడి మైండ్‌లో చిన్న మొక్కలా ఒక ప్రశ్న పుట్టింది. సందీప్‌కి ఏం చేయాలో తోచలేదు. తన స్నేహితుడిని ఎట్లా ఓదార్చాలో అతడికి అర్థంకాలేదు. తను ఇంటికి వెళ్ళాలని ఎంతగా గెంతులు వేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని ఉవ్విళ్ళూరుతున్నాడు. ఎంత అశాంతిగా అలమటిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు వెళ్దామా అని.
ఎంతో ఆత్మీయంగా పరమజిత్ భుజాన్ని స్పర్శించాడు సందీప్. ఏదో చెప్పాలనుకున్నాడు కాని చెప్పలేకపోయాడు. కొంచెంసేపు అతడి ఉదాసీనమైన ముఖాన్ని చూస్తూ ఉండిపోయాడు. అనుకున్నట్లుగానే సందీప్‌కి ఇంటిల్లిపాదీ స్వాగతం పలికారు. అతడు రైలు నుండి కిందికి దిగగానే అందరు ఎంతో భావుకులయ్యారు. ఆత్మీయంగా పలకరించారు. ఆలింగనం చేసుకున్నారు.
సందీప్ తల్లి ఒక్కసారిగా అతడి ముఖం చూడగానే నిశే్చష్టురాలైంది. నా సందీప్‌యేనా! ఏవిటి వీడి ముఖం ఇంత వాడిపోయింది. ఇంతగా చిక్కి శల్యం అయిపోయాడు. నల్లబడ్డాడు. అయ్యో.. అయ్యో.. ఎముకలగూడు అయిపోయాడు.
‘ఏవిటిరా! ఈ ఆర్మీ వాళ్ళు కడుపునిండా అన్నం కూడా పెట్టరా? వెంట్రుకలను కూడా పెరగనివ్వరా! అవ్వ! ఇదేం ఆర్మీరా! ఈ ఆర్మీ నిన్ను పిండి పిప్పి చేస్తుందిరా!’’ అంటూ ఒక్కసారిగా ఏడ్చేసింది.

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత