డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు ..17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత

రాత్రి తన పైఅధికారుల ఎదురుకుండా ఓథ్ తీసుకున్నాడు- ఆర్మీ శపథం- ‘నా జీవితం భారతదేశ రాష్టప్రతి పేరు మీద సమర్పిస్తున్నాను. నేను దాని కోసమే బతుకుతాను. నా గురించి అన్నింటికన్నా చివరన ఆలోచిస్తాను.
ఒక్కసారిగా మొబైల్‌పైన మెసేజ్ మెరిసింది- RAJORI AND PHULGAM POLICE 31 R R 62 RR & 4 PARA IN A JOINT OPERATION KILLED 2 MILITANTS BETWEEN SAIPATRI & ARDWAS AREA IN THE HILLS OF SHOPIAN (INAB-VN-NABI)
స్మృతులలో తనను తను కోల్పోయిన సందీప్ ఈ లోకంలోకి వచ్చాడు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తల ఒకసారి గట్టిగా ఊపాడు. గతం నుండి వర్తమానానికి వచ్చాడు. మెసేజ్ మళ్లీ ఒకసారి చదివాడు. తన సిటిజన్ గడియారం వంక చూసాడు. తనలో తనే గొణుక్కోవడం మొదలుపెట్టాడు. ఉఫ్.. స్మృతుల సముద్రంలో తను ఎంత లోతుగా మునిగిపోయాడు. ఎంతో దూరం వెళ్లిపోయాడు. దాదాపు 15 సం.లు ఏ శపథం తన మనస్సులో అలలను లేపిందో, లోకం అంటే ఏమిటో తెలియని అమాయకుడు. అంతటా ఒక కొత్త సౌందర్యం.. ఆనందం.. సైనికుడిగా కావాలి. ఆర్మీ అంటే అండికి అదొక దివ్యలోకం.. అంతా కొత్తగా.. మత్తుగా.. గమ్మత్తుగా.. కాని ఇప్పుడు ఇప్పుడు.. ఆ శపథంలోని అసలు సిసలైన భావం.. విస్తారంగా.. ఇప్పుడు.. 45 సం.ల ప్రౌఢ వయస్సులో...
ఉఫ్! అసలు ఆ సమయంలో ఈ శపథంలో ఉన్న గూఢార్థం అర్థం అయి ఉంటే ఎంత బాగుండేది. కాని అసలు జీవితంలోని రహస్యం అదేగా.. అసలు జీవితానికి అతి దగ్గరగా మనం రానంతవరకు, అందులో పూర్తిగా మనం మేమకం కానంతవరకు మనం అర్థం చేసుకోలేము. జీవితాన్ని తెలుసుకోవడానికి మీరు ఎన్నుకున్న దారులు సరియైనవి కావు అని తెలుసుకున్నాడు. మళ్లీ తిరిగి వెనక్కి వెళ్లిపోవాలంటే అన్ని దారులు మూసుకుపోయి ఉంటాయి. సమయం చేతినుండి జారిపోతుంది. అసలు తను ఆర్మీ అంటే ఏమిటో అర్థం చేసుకోగలిగాడా? ఒకవేళ కాశ్మీర్‌లో గుండ్ లాంటి సెన్సిటివ్ ఏరియాలలో రాష్ట్రీయ రైఫిల్స్ 14లో పోస్టింగ్ కాకపోతే.. అసలు తను కూడా తెలుసుకునేవాడా సైన్యం అంటే అర్థం.. విస్తారపూర్వకంగా.. అన్ని కోణాల్లో...
రాష్ట్రీయ రైఫిల్స్ 14, బేస్ కాంప్‌లో ఉన్న తన చెక్కతో చేయబడిన కాటేజ్ నుండి బయటకు వస్తున్నాడు మేజర్ సందీప్. పూలూ- రాళ్ళు, యాపిల్-అఖరోట్ పళ్ల చెట్లను దాటుకుంటూ ఆయన చూపు ఒక బోర్డుపై పడ్డది. దానిపైన కొన్ని సూచనలను కమాండింగ్ ఆఫీసర్ కర్నల్ కేదార్ ఆప్డే రాయించారు. ప్రతీ కంపెనీ కమాండర్, సైనికుడు ప్రతీరోజూ చదవాలనే ఉద్దేశ్యంతో ఇట్లా రాయించాడు. కర్నల్ కేదార్ ఆప్డే చాలా డిసిప్లెయిన్‌గా ఉంటాడు. కాశ్మీర్‌లో నాల్గవసారి పోస్టింగ్ అయింది. కాశ్మీర్‌లో మిలిటెంట్లను కంట్రోల్ చేయడంలో ఈయన ఎంతో కృషిచేశాడు. ఆయన తన కర్తవ్యాన్ని ఎప్పుడూ నిర్వహిస్తూనే ఉంటాడు.
మేజర్ సందీప్‌కి చెక్కతో తయారుచేయబడ్డ బోర్డు- దానిపైన సూచనలు పట్ల ఎంతో ఉత్సుకత. అన్నింటికన్నా పైన రాసి ఉంది- ‘్ళ్జ’ఒ ష్యూశళూ దానికింద ఎన్నో సూచనలు ఇవ్వబడ్డాయి. వాతావరణం పొలాలను ఆధారం చేసుకుని మీరు క్రాస్ కంట్రీ మూవ్, నడవండి- అంటే ముందే తయారు చేయబడ్డ దారులు, మిలిటెంట్లు ఏ దారుల నుండి వస్తారని ఊహిస్తారో ఆ దారులో రాకండి. మీరు మిలిటెంట్లు ఊహించని దారులలో ప్రయాణం చేయండి. మీరు ఎప్పుడు ఒక చోట ఉండవద్దు. మీకు కాలిబాటలు, రోడ్లు అన్నీ తెలిసి ఉండాలి. మీ దగ్గర ఉన్న ఆయుధాల గురించి, శస్త్రాల గురించి సివియన్లతో ఎంతమాత్రము మాట్లాడవద్దు. మిలిటెంట్లకి మీ శక్తి గురించి ఏ మాత్రం తెలియకూడదు. వాళ్ళు మూర్ఖులుగా ఉంటేనే మంచిది. ఈ ప్రదేశంలో ఆడపిల్లలవలన మీరు మృత్యువు వాత పడతారు. అభాస్ పాలౌతారు. అంతకన్నా ఏమీ లభించదు. సైనికులు మగవాళ్ళు లేని ఇళ్ళల్లో, కేవలం అందమైన ఆడపిల్లలు ఉన్న ఇళ్ళల్లోకి జొరబడుతున్నారన్న విషయం తెలిసింది. వాళ్ళ చేత టీ తయారుచేయిస్తారు. సూచన ఏమిటంటే, సైనికులు యువతులతో మాట్లాడకూడదు. యువతులతో ఆఫీసర్లు మాత్రమే మాట్లాడాలి. ప్రతీ సైనికుడికి ఒక ఫ్లాస్క్ లభిస్తుంది.
వాహ్! అసలు ఇది కాశ్మీరమా! లేక గురుకులమా! ఆడపిల్లలతో మాట్లాడడం కూడా పాపమా! నిజానికి ఇది సైనికులపట్ల అన్యాయం కాదా! వాహ్! కర్నల్ ఆప్టే .. వాహ్.. గురు.. ప్రతీ సూచన లిఖిత రూపంలో ఉంది. ఎవరు ‘నాకు తెలియదు’ అని అంటూ చేయరాని పనులు చేయకూడదు.
ఆయన రెండో CO's cornerను చదవడం మొదలుపెట్టాడు. ఇది కూడా ఎంతో ఉత్సుకతను కలిగించింది.
‘కంపెనీ కమాండర్’కి ఊళ్ళో ప్రతీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారో తెలిసి ఉండాలి. ప్రతి ఇంట్లో ఎంతమంది మెంబర్లు ఉన్నారు? వాళ్లు ఏం పనులు చేస్తారు? మేజర్ సందీప్ లోలోన నవ్వుకున్నాడు.
యాక్టివ్ /కిల్డ్ / సరెండర్డ్ / మిస్సింగ్ / మిలిటెంట్ల గురించి వాళ్ళ అన్నదమ్ముల గురించి దగ్గర బంధువుల గురించి తెలుసుకోవాలి.
ఊరి మొత్తం స్కెచ్ మీ మైండ్‌లో ఉంచుకోండి. కొత్త కొత్త దారుల వెంట నడవండి. ఒకే మార్గంలో నడిస్తే మిలిటెంట్లు ఎప్పుడైనా మీమీద ఆక్రమణ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఊళ్ళో నుండి కాకుండా వీలున్నంతవరకు అడవుల నదుల మార్గాలలో ప్రయాణం చేయండి.
మనం యుద్ధం వాళ్ళ వెంట పరుగెత్తి పరుగెత్తి చేయం, బుర్రను ఉపయోగించి యుద్ధం చేస్తాము.
తన మేధస్సును ఆర్మీ కండిషనింగ్ చేసేసింది. పైఅధికారులు చెప్పినట్లు ఆర్మీ వింటుంది. వాళ్ళ అనుగుణంగా వీళ్ళు ఆలోచిస్తారు.

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత