డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు 29

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోపాన్ని ఆపుకోలేకపోయారు. రైఫిల్ ఎత్తిపెట్టారు. అంతే- ఇంట్లో ఏడుపులు-పెడబొబ్బలు మొదలైనాయి. నేను ఇంటి యజమానికి క్షమార్పణ చెప్పాను. పిల్లలని ముద్దాడాను. చాక్లెట్లు ఇచ్చాను. నేను ఎంతో నమ్రతగా ఆయనతో అన్నాను- ‘‘ఇది మా డ్యూటీ. ఇక్కడ మిలిటెంట్లు దాగివున్నారన్న సమాచారం వచ్చింది.’’
ఇంటి యజమాని ఒప్పుకున్నాడు. మేము వినయ విధేయతలతో ఆ ఇంట్లో మూల మూలని వెతికాము. మా వినయ విధేయతలు చూసాక ఇంటి ఆడవాళ్లలో భయం పోయింది. ఎంత చెప్పినా, ఎన్ని ఉపదేశాలు చేసినా మా సైనికులకు అప్పుడప్పుడు తల పొగరుమోతుతనం ఎక్కువ అవుతూ వుంటుంది. ఈకాశ్మీరీలకు ఆర్మీవాళ్లు క్రూరులు కారని, వాళ్లకి హృదయం వుంటుంది, కాశ్మీరులకు మిత్రులే కాని శత్రువులు కాదు వాళ్లకి సేవ చేయడానికి ఉన్నారు అంతేకాని వాళ్లమీద పెత్తనం చేయడానికి కాదని తెలియచెబుతూ ఉండాలి.’’
వెనక్కి కాటేజ్ వెళ్తున్నారు. ఇంతలో అక్కడ కనిపించిన దృశ్యం చూసి సిద్ధార్థ ఆశ్చర్యపోయాడు. అక్కడ అందమైన అరుగు వుంది. రెండు వైపుల చిన్నచిన్న మెట్లు. ప్రతీ మెట్టుమీద అందమైన తొట్లు. రెండు మెట్ల మధ్య ఉన్న అరుగుమీద తిరంగా జెండా వుంది. దానికి ఇద్దరు సిపాయిలు సెల్యూట్ చేసి కిందకి దించి చుట్టేసారు. దాన్ని తీసుకుని బయలుదేరారు.
‘‘ఇదేమిటి?’’ సిద్ధార్థ అడిగాడు. ‘‘ప్రతీ యూనిట్‌కి ఒక మువ్వనె్నల జెండా ఉంటుంది. ప్రతి సాయంత్రం ఆరు గంటలకు జెండాను దించేసి మళ్లీ మరునాడు ఆరు గంటలకు ఎగరవేస్తారు.’’ సిద్ధార్థ ఇంకేదో అడగాలనుకున్నాడు- ఇందులో సందీప్ కొంచెం ముందుకు నడిచాడు. తన తోటివాడితో మాట్లాడటంలో తలమునకలై పోయాడు.
ఇంటి విషయాలను గురించి మాట్లాడుతూ, బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ మూడు గంటలు గడిపారు. ఇంతలో ఫోన్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడటం, అతడి ముఖ కవళికలు చూడగానే అతడు ఆందోళనగా ఉన్నాడు అన్న సంగతిని సిద్ధార్థ కనిపెట్టాడు.
సిద్ధార్థ ఢిల్లీలో జరగబోయే మీటింగు కోసం రిపోర్టులు తయారుచేసుకోవడంలో కొంత టైమ్ గడిచిపోయింది. అక్కడ ఫైవ్‌స్టార్ హోటల్లో కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మానేజర్స్ అందరు కలుస్తున్నారు. తమ కంపెనీ ప్రొడక్ట్ ‘ఫైన్ అండ్ లవ్‌లీ’ని ఇంకా ఏ విధంగా ఆకర్షణీయంగా లాంచ్ చేయాలి, ఎక్కువ సంఖ్యలో ఆడపిల్లలను ఏ విధంగా ఆకర్షించాలి మొదలైన విషయాలమీద చర్చలు జరుపుతారు. ‘అన్నయ్యా! ఏం జరిగింది? అట్లా ఉన్నావు?’ సిద్ధార్థ అడిగాడు. ‘‘నిన్ను ఒంటరిగా వదిలేసి ఎట్లా వెళ్లనా అని ఆలోచిస్తున్నాను. కర్నల్ ఆప్టే తన యూనిట్‌లో వెంటనే కలవాలని, అర్జంట్ పని ఒకటి ఉందని తెలియజేశాడు. ఇంకో అరగంటలో నా కోసం జీపు వస్తుంది. బహుశా నేను రాత్రికి రాలేకపోవచ్చు. ఒకవేళ రేపు పొద్దునదాకా రాలేకపోతే నేను కెప్టెన్ మహేష్ కులకర్ణికి నిన్ను తీసుకువెళ్ళి ఎయిర్‌పోర్ట్‌లో దించమని చెప్పాను’’.
సందీప్ అసలు సంగతిని దాచిపెట్టాడు. ప్రాగ్ కొండలపైన ఇద్దరు ముగ్గురు మిలిటెంట్లు కిందకి దిగే ప్లాన్‌లో ఉన్నారు. కమాండింగ్ ఆఫీసరు కర్నల్ ఆప్టే ఈ టుడే ఆపరేషన్ బాధ్యతను సందీప్‌కి అప్పగించాడు. సందీప్ నేతృత్వంలో ఇది మొదటి ఆపరేషన్. అందువలన అతనిలో థ్రిల్, ఉద్వేగం, భయం, కోపం అన్నీ చోటుచేసుకున్నాయి. అందుకే అతడు మైండ్‌ని ఒకచోట కాన్‌సన్‌ట్రేషన్ చేయలేకపోతున్నాడు. కమాండింగ్ ఆఫీసరు ఆప్టే అన్న మాటలు అతడి మైండ్‌పైన సుత్తిదెబ్బలు కొట్టినట్లుగా మారుమ్రోగుతున్నాయి.
మీ మైండ్‌లో ఆ పిక్చర్ అంతా క్లియర్‌గా ఉండాలి. అక్కడ మూల మూలల గురించి మీకు తెలియాలి. పగలే వెళ్లి మీరు లొకేషన్‌ని క్షుణ్ణంగా చూసుకోవాలి. ఆలోచనా తరంగాలలో మునిగిపోయి ఉన్న సందీప్ సిద్ధార్థ మాటలకు ఈ లోకంలోకి వచ్చాడు. ‘‘అన్నయ్యా! ఏ లోకంలోకి వెళ్లిపోయావు. అసలు మిలిటరీ వాళ్లందరూ ఇట్లాగే ఉంటారా? మాట్లాడుతూ, మాట్లాడుతూ.. ఇంకెక్కడో మరి దేన్ని గురించో ఆలోచిస్తూ ఉంటారు. నేనూ నీ వెంట రానా?’’
‘‘ఉహూ.. నిన్ను తీసుకువెళ్ళడానికి అనుమతి ఇవ్వరు. నేను నా టీమ్‌తో వెళ్తాను. వెళ్ళేటప్పుడు నిన్ను నేను కలవలేకపోవచ్చును. ఏమో ఆపరేషన్‌లో.. మనస్సు బాధపడ్డది’’. అయినా పైకి తనని తను కంట్రోలు చేసుకుంటూ తమ్ముడిని కౌగిలించుకున్నాడు. అంత హడావిడిలో కూడా ఒక అందమైన చిన్న పెట్టెను తీసాడు. కఫ్‌లింగ్ జోడీని ఒకటి బయటకు తీశాడు. తమ్ముడికి ఇచ్చాడు. మధుర పోస్టింగ్ అప్పుడు వీటిని కొన్నాడు.
తమ్ముడికి వీడ్కోలు చెప్పి అల్ఫా కంపెనీలోకి కెప్టెన్ ప్రశాంత్ హల్గిన్‌తోపాటు లొకేషన్ చూడటానికి బయలుదేరాడు.
***
నలుమూలలా వెతికి వెతికి ఎక్కడ ఏముందో తెలుసుకున్నాక ‘జైకాళీమాతా’ ‘జయభజరంగ్’ అన్న నినాదాలతో, డెబ్భై రెండు గంటలకు సరిపడే తినుబండరాలను తీసుకున్నాక, మేజర్ సందీప్ ఆధ్వర్యంలో ఆపరేషన్ శౌర్య బయలుదేరింది. మూడు కంపెనీల కమాండింగ్ ఆఫీసర్లు, సిపాయిలు అందులో ఉన్నారు. అందరు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, బుల్లెట్ ప్రూఫ్ కాప్‌లు ధరించారు. దాదాపు నాలుగు గంటల శ్రమ తరువాత మూడు వేరు వేరు గ్రూపులు చిమ్మ చీకటిలో సిపాయిలు, ఆఫీసర్లు ప్రాగ్ కొండపై అనుకున్న స్థలాలలో తమ తమ పొజిషన్‌లో నిలబడ్డారు. ఒక్కసారిగా బయటికివస్తే వాళ్ళ రహస్యం శత్రువులకి తెలుస్తుంది. అందువలన మేజర్ సందీప్ వేరు వేరు దిశలో వేరు వేరుగా రావాలని చెప్పాడు. ఏ ఆపరేషన్‌లోనైనా సర్‌ప్రైజ్ ఉండి తీరాలి.

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత