డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు 41

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్కసారిగా అతడి దృష్టి బుర్ఖాలో వణికిపోతున్న ఆమెపై పడ్డది. కారు దగ్గరికి రాగానే ఆమె లిఫ్ట్ అడిగింది. డ్రైవరు కొంచెం ముందుకు కారుని పోనిచ్చాడు కాని సందీప్ వెనక్కి తీసుకువెళ్లి బుర్ఖాలో ఉన్న ఆమెకు లిఫ్ట్ ఇమ్మని చెప్పాడు. ఆమె చలికి వణికిపోతోంది. సందీప్ హీటర్‌ని వెలిగించమని డ్రైవర్‌కి చెప్పాడు. బుర్ఖా స్ర్తి కారులో ఉంటే ఇటువంటి సెన్సిటివ్ ప్లేసులలో రక్షణ ఉంటుందని సందీప్ అనుకున్నాడు.
దాదాపు ఐదారు కిలోమీటర్లు ముందుకు రాగానే ఆమె కారుని ఆపమన్నది. కారు ఆగగానే ఆమె సంకోచంగా కిందికి దిగింది. కారు ఒక కిలోమీటరు వచ్చిందో లేదో బిఎస్‌ఎఫ్ సిబ్బంది కారుని ఆపారు. పిస్తోలు చూపిస్తూ కోపంగా అడిగారు. మీతో వచ్చిన తోటి పాసింజర్ ఏది?’’
‘‘తోటి పాసింజరా! ఎవరు?’’ సందీప్ కంఠం వణికింది. ‘‘ఆమె బుర్ఖాలో మీతో కారులో ఉంది’ ఆమె మాతోటి రాలేదు. మధ్యలో ఎక్కింది. వానలో వణుకుతోంది. నిస్సహాయురాలు లిఫ్ట్ అడిగింది, ఇచ్చాం’’.
అపనమ్మకంగా సందీప్ వంక చూస్తూ బి.ఎస్.ఎఫ్ వాళ్ళు ‘‘మీరు మాతోపాటు హెడ్ క్వార్టర్స్‌కి రావాలి. మీరు లిఫ్ట్ ఇచ్చిన మహిళ ఎవరో తెలుసా? ఆ హరామ్‌జాదీ జెకెఎల్‌ఎఫ్ ఏరియా కమాండర్ మిలిటెంట్ నతాషా’’
‘‘ఏమిటి?’’ సందీప్ తన ఐడెంటిటీ కార్డు చూపించాడు. బి.ఎస్.ఎఫ్ ఆఫీసరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఖుదా దయవలన ఏమీ కాలేదు. మీరు ఎవరి ముఖం చూసి ఇంటినుండి బయలుదేరారో ఏమో, ఒకవేళ ఆ రాక్షసికి కారులో భారతీయ ఆర్మీకి చెందిన మేజర్ ఉన్నాడు అని తెలిస్తే మిమ్మల్ని వదిలేదా! ఉహూ.. చస్తే వదిలేది కాదు’’.
ఉఫ్.. జీవితంలో ఎనె్నన్ని రంగులు ఉంటాయి. నిజానికి ఆమె ముందు సందీప్‌ని డ్రైవర్ ఒక్కసారి కూడా మేజర్ సాహెబ్ అని పిలవలేదు. లేకపోతే మరునాడు వార్తాపత్రికలలో ఓ పెద్ద వార్త అయ్యేది.
భూషణ్ కాంప్ నుండి వెనక్కి వచ్చాక అతడికి మంచి వార్త తెలిసింది. నిజానికి ఆ రోజు అదృష్టం ఎంతో బాగుంది. ఏదో విధంగా బతికి బట్టకట్టాడు. ఇంటికి వెళ్ళడానికి ఇరవై అయిదు రోజుల సెలవు దొరికాయి. సందీప్ అక్రోట్‌ల పాకెట్లు కొన్నాడు. తల్లికోసం కాశ్మీరీ షాల్ కొన్నాడు. స్నేహితుల కోసం చెర్రీ పాకెట్లు తీసుకున్నాడు.
సందీప్ ఇంటికి వచ్చాడు. కాశ్మీర్ పోస్టింగ్ అయ్యాక మొట్టమొదటిసారిగా ఇదే ఇంటికి రావడం. సందీప్ తండ్రి శేఖర్ బాబుకి కొడుకుకి పోస్టింగ్ శ్రీనగర్ దగ్గర ఇచ్చారు అని తెలియగానే బాధపడ్డాడు. ఆ ప్రాంతం అంతా ఉగ్రవాదుల ఉపద్రవాలు చీటికి మాటికి జరుగుతూనే ఉంటాయి. కొడుకుకి రాష్ట్రీయ రైఫిల్స్‌లో పోస్టింగ్ అయిందన్న విషయం ఆయనకింకా తెలియదు. ఇక్కడ ప్రతీ సైనికుడికి గన్ ఎత్తి ఆపరేషన్‌లో పాల్గొని తీరాలి. సందీప్ తను ఇంజనీరు కాబట్టి అంత ప్రమాదం ఏమీ లేదు. నాలుగు వైపులా సెక్యూరిటీ ఉంటుంది అని చెప్పాడు. అక్కడ తనకు ఎంతో రక్షణ ఉన్నదని చెప్పాడు. శేఖర్ బాబుకి కొంత శాంతి కలిగింది. కాని సిద్దార్థ అసలు సత్యాన్ని చెప్పలేదు కదా! అని సందీప్ అనుకున్నాడు. చాలా ప్రమాదకరమైన జీవితం సైనికులది అని చెప్పలేదు కదా.. సందీప్‌లో ఈ అనుమానం పెనుభూతం అయింది. కాని సిద్ధార్థ అంత మూర్ఖుడా! అసలు తను ముందే సిద్ధార్థకి తండ్రికి అక్కడి విషయాలు చెప్పవద్దని చెప్పాల్సింది. కాని ఆ గొడవలు, హింస, రక్తపాతం.. ఏమీ తనకు గుర్తుకురాలేదు.. ఉఫ్.. తను ఒక్కడు ఏం చేయగలుగుతాడు? ప్రతీ విషయం పట్టించుకోవాలంటే చాలా కష్టం. తను ఎంతమంది బరువు మోయగలుగుతాడు?
ఇల్లు..
ఆత్మీయత- అనురాగాలు.. ఇల్లంటే ఇల్లే...
తల్లి సందీప్‌ని కౌగిలించుకుంది. తల్లి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాలాయి. ఎన్ని రోజులయ్యాక వచ్చాడు ఇంటికి సందీప్.. ఆమెలో మమకారం ఉప్పొంగింది. టీవీ వార్తా పత్రికలవలన కాశ్మీర్ పోస్టింగ్‌లో ఉన్న ప్రమాదాల గురించి అంతో ఇంతో ఆమెకు తెలుసు.
ఆనందంతో ఆమె ఉక్కిరి బిక్కిరి అయింది కాని సందీప్ తలపై ఆమె దృష్టి పడగానే మనస్సు చివుక్కుమంది. సగం జుట్టు ఊడిపోయింది. ముఖం వాడిపోయి ఉంది. నల్లబడ్డాడు. ఆమె విచారించసాగింది. ఉఫ్.. ఎందుకు ఇంతగా సన్నబడ్డాడు. అసలు ఆ నవ్వు లేదు. ఆ చిలిపితనం లేదు.
సందీప్ ఇప్పుడు చాలా పెద్దవాడయ్యడని ఆమెకు అనిపించింది. తన నుండి చాలా దూరం వెళ్లిపోయాడనిపించింది. మనస్సు బరువెక్కింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కాని ఆమె ఏమీ మాట్లాడలేదు. కొడుకుకోసం ప్రేమగా చేసిన పిండివంటలన్నీ తల్లి అతడికి పెట్టింది. బూందీ రాయతా, వెల్లుల్లి పాయల చట్నీ, మలాయి కోఫ్తాకూర, బఠానీల కచోరీలు, వెజిటల్‌బుల్ పులావ్, మేఘాలతో నిండిన ఆకాశంలో ఆ ఇల్లు మమతానురాగాలతో నిండిపోయింది. అసలు సందీప్ ఈ ఆత్మీయతను, శాంతిని ఎప్పుడో కోల్పోయాడు. కాశ్మీర్ పోస్టింగ్ అతని జీవితం నుండి భావుకత్వం, సుఖశాంతులను కోల్పోయేలా చేసింది. నిజానికి జీవితం అంటే ఇదే. ఒంటరిగా నడవాలన్న భయం లేదు. క్రాస్ ఫైరింగ్ ఎప్పుడు జరుగుతుందో అన్న ఆందోళన లేనే లేదు. ఇరవై నాల్గుగంటలు మేల్కోవాలన్న బాధా లేదు. బులెట్ ఫ్రూఫ్ జాకెట్టు లేదు. కాంప్ గోల లేదు. ఒక తాళ లయలలో ప్రవహించే జీవితం. నదిలోని నీళ్ళలా.. లోపల అంతా శాంతి. ఏ సుడిగుండాలు లేవు. చాలాకాలం తరువాత ఇటువంటి శాంతి సుఖాలు లభించాయి.

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత