డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు 50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మ సమర్పణ అంత సులభమా! ఈ చిగురుటాకులకు జిహాదీలుగా మారితే జీవితం ఎంత రౌరవ నరకం అవుతుందో అర్థం అయ్యేలా చెప్పి వాళ్ళ చేత ఆత్మసమర్పణ చేయించాలని సందీప్ కోరిక. జీవితం గురించి మళ్లీ ఆలోచించి మంచి మార్గంలో నడిచే ఒక అవకాశం వాళ్ళకి తప్పకుండా ఇవ్వాలి. ఈ విషయంలో కర్నల్ ఆర్యతో చర్చించాడు. ఆర్య కళ్లజోడు తీసి అతడి వంక కొండపైన వుండే వ్యక్తి కొండ కింది వున్న వ్యక్తిని చూసినట్లు చూసాడు. కళ్లు ఎరుపెక్కాయి. తనని తను కంట్రోల్ చేసుకుంటూ ఆర్య అన్నాడు- ‘‘పిచ్చిగా మాట్లాడకు. ఉగ్రవాదులని సమూలంగా మట్టుపెట్టాలన్నదే మన ప్రధమ ఉద్దేశ్యం. ముందు వేళ్లను పెరికివేయాలి. అప్పుడే ఏమైనా చేయగలం. ఉగ్రవాదుల మీద దయాదాక్షిణ్యలు చూపించి సమాజ సేవ చేయమని మనలని ఇక్కడికి పంపించలేదు. ఈ కుటుంబం వీక్ లింక్ గురించి తెలుసుకో. దానిని స్ట్రెటజీగా చేసుకో. ఓ.కె.,
దాదాపు శ్మశానంలా మారిన ఆ ఊళ్లో ఉన్నది ఎక్కువగా విధవలు, ముసలివాళ్లు మాత్రమే. ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో యువకులు చనిపోయారు. ఎవరైనా కొంతమంది మిగిలి వుంటే వాళ్ళందరు ఎ.కె.47ను చేతబట్టినవాళ్లే. వీళ్లందరూ వెదజల్లబడ్డ గింజల్లా అటూ ఇటూ చెల్లాచెదురయ్యారు.
సందీప్ కఠోరమైన కంఠంతో జమీల్ తండ్రిని అడిగాడు. ‘నీ కొడుకు ఎక్కడ? అబ్బూ (జమీల్ తండ్రి) ఒణికిపోతూ జవాబు చెప్పాడు. ‘సాహెబ్‌జీ! నాకు తెలియదు. ఇంటిల్లిపాదీ భయంతో థర థర వణుకుతూనే ఉన్నారు. ఇంటి కప్పు ఒంగిపోయింది.
ఎ.కె.47 రైఫిల్‌తో సందీప్ జమీల్ తండ్రిని బెదిరించాడు. అతడి కళ్లలో కళ్లు కలిపి కోపంగా మళ్లీ మళ్లీ అదే ప్రశ్న వేశాడు. జమీల్ తండ్రి ఒణుకుతూ, ఏడుస్తూ గొణగసాగాడు. జమీల్ గురించి ఏమన్నాడో ఏమో ఏమీ అర్థం కాలేదు. ట్రాన్స్‌లేటర్ సందీప్‌కి అర్థం అయ్యేలా చెప్పసాగాడు. ‘సర్‌జీ! ఇతడు ఒట్టు పెట్టమన్నా పెడతానంటున్నాడు. ఆరు నెలలు అయింది జమీల్ ముఖం చూసి అని చెబుతున్నాడు’-
‘‘మరయితే ఇంట్లో ఈ డబ్బంతా ఎక్కడినుండి వచ్చింది. మనీ ఆర్డర్ రసీదు చూపెట్టు’’ సందీప్ కోపం ద్విగుణీకృతం అయింది. అబ్బూ ఒణికిపోతున్నాడు. తన భుజంపైన మురికిగా ఉన్న బట్టతో కళ్లనీళ్లు తుడుచుకుంటూ మళ్లీ చెప్పాడు. ‘‘సాహెబ్‌జీ! జమీల్ తన స్నేహితుడి ద్వారా ఈ డబ్బు పంపించాడు’’- అతడి పెదిమలు వణికాయి. అడుగులు తడబడ్డాయి. కళ్లనుండి కన్నీళ్లు జరజరా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఆ కన్నీళ్లు దుఃఖపు మహాగాథను చెబుతున్నాయి. అతడు ఈ యుగంలోని శాపగ్రస్తుడయిన తండ్రిలా అనిపించసాగాడు. సందీప్‌లోని భావుకుడైన వ్యక్తి అన్నాడు- ‘బాబా! బాధపడకు. మీ కొడుకు తప్పకుండా వెనక్కి వస్తాడు. కాని అతడు ధరించిన ఆర్మీ డ్రెస్ అడుగుతోంది- చెప్పరా చెప్పు! నిజం చెప్పు.. వాడితో నీవు ఆఖరిసారిగా ఎప్పుడు కలిసావు? అబ్బు వెక్కి వెక్కి ఏడుస్తూ చిన్న కొడుకు తలమీద చేయి పెడుతూ అన్నాడు- ‘‘సాహెబ్‌జీ! ఒట్టు ఆరు నెలలయింది వాడి ముఖం చూసి’’.
జమీల్ అబ్బు చెప్పేది అక్షరాలా నిజం. అతడు ఆరు నెలల నుండి కొడుకు ముఖం చూడలేదు. మిలిటెంట్లకి కఠోర నియమాలు ఉంటాయి. మిలిటెంట్ల ఏరియా ఆఫ్ ఆపరేషన్ వాళ్ళ ఇళ్ల దగ్గర ఏ మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ఉగ్రవాదిలో కుటుంబం పట్ల ప్రేమ పుడితే అతడు బలహీనుడైపోతాడు. అతడిలో ఏ మాత్రం ప్రేమ ఉన్నా దాన్ని చంపేస్తారు. అనుబంధం- ఆత్మీయత అనే వేళ్లను సమూలంగా పెరికివేస్తారు. వాళ్లని కొరడాలా తయారుచేస్తారు. కాని ఇప్పుడు వాడెక్కడున్నాడు. జమీల్ తండ్రికి అంతో ఇంతో తెలిసి ఉండాలి. ఆలోచిస్తున్న సందీప్‌లో ఏదో బల్బ్ వెలిగినట్లయింది. ఆరు నెలల నుండి జమీల్ రాలేదంటే ఇకముందు ఎప్పుడో ఒకప్పుడు వస్తాడు. తిరుగులేదు. మనిషి ఎంత క్రూరుడైనా రాయి రప్పగా మారలేడు కదా! మారినా దానికి సమయం చాలా తీసుకుంటుంది. జమీల్ ఇరవై రెండేళ్లవాడు. నిజానికి కోమలమైన ఆకు.
అబ్బూ వైపు నుండి సందీప్ జమీల్ అమీ (అమ్మ) వైపు తిరిగాడు. ఆమె పావురంలా గిలగిలా తన్నుకుంటోంది. ఆమె కళ్లు భయం భయంగా చూస్తున్నాయి. భయంతో ఒణికిపోతోంది. అసలు సంగతేమిటో ఆమెకు పూర్తిగా బోధపడలేదు. అసలు తమకు ఎవరూ శత్రువులు లేరు. తన కుటుంబం వాళ్ళు ఎవరినీ పల్లెత్తు మాట అనరు. ఏ ఆస్తి-పాస్తులు లేవు. మరి ఆర్మీ తన ఇంట్లో.. ఇంట్లో వయస్సుకు వచ్చిన మగ పిల్లలు ఉన్నారంటే చాలు.. వీళ్లు ఇట్లాగే వస్తారా? తను కొంతమంది ఇళ్లకు ఆర్మీ వాళ్లు రావడం చూసింది. ఆర్మీ వాళ్లు పోలీసులు ఆ ఇంట్లో యువకులు ఉన్నా వాళ్లు జిహాదీలుగా మారే అనుమానం ఉన్నా, ఆ మార్గంలో వాళ్లు నడుస్తున్నా వస్తారు.
అంటే.. అంటే.. తన ఇంట్లో కూడా జిహాదీ.. ఉహు కాదు. జమీలా? ఖుదారహమ్ కర్! వెనె్నముకలో చలి పుట్టింది. భయం.. భయం.. కాళ్లు చేతులు వణికాయి. ఇంతలో పద్దెనిమిది సం.ల వయసుగల కూతురు రుబీనా కాశ్మీరు భాషలో అన్నది- భాయిజాన్! జిహాదీగా మారాడు. ‘‘ఈ మాటలు విన్న జమీల్ తల్లి పెద్దగా కేక వేసింది. ఆకాశం షామియానాలా ఊగిపోయింది. నిన్నటివరకు ఎవడి వేలు పట్టుకుని తను స్కూల్‌కి తీసుకుని వెళ్లేవాడో.. వాడు.. చేత గన్ పట్టాడా! జిహాదీ అయ్యాడా! అయ్యో.. అయ్యో.. యాఖుదా.. ఎట్లా జరిగింది ఇదంతా! అల్లా జరగరానిది జరిగిపోయిందా? తన కొడుకు.. తన చిన్నారి పొన్నారి జమీల్’’-

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత