డైలీ సీరియల్

ఎండిపోతున్న కాశ్మీరీ చినారులు .. 63

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనది ఎంతో దురదృష్టం. ఇప్పుడు మా సైనికుల యుద్ధం కోసం కాదు, శత్రువుల కోసం కాదు దేశంలో సురక్షితంగా ఉండడానికి చనిపోతున్నారు.
నచికేతుడు అడిగాడు సత్యం ఎక్కడ ఉంది?
బుద్ధుడు అడిగాడు- జరా రోగ మరణాలు అంటే ఏమిటి?
మార్క్స్ అడిగాడు- ఆకలి అంటే ఏమిటి? నా ప్రశ్న- స్వతంత్ర భారతంలో ఒక సైనికుడి స్వతంత్రం అంటే ఏమిటి?
తమ్ముడూ! నా కథ విన్నావుగా! స్వప్నాల, జ్ఞాపకాల, నిజాల మాయాజాలంలో పడికొట్టుకుంటున్న నా కథా- వ్యథలని తెలుసుకున్నావుగా!
నువ్వు కూడా అమ్మ - నాన్నలలా నా నాశనానికి కారణం ఒక ఆడదే అని అంటావా! నా నాశనం వెనక ఏ స్ర్తి లేదు. మానవత్వం కల మనిషిలా బతకాలన్న పట్టుదలే ఉంది. నిజం చెప్పాలంటే నేను ఎవరినీ తప్పుపట్టను. నన్ను నేను నిందించుకోను కాని విధి రాత ఇట్లాగే ఉంది. అందుకనే నా జీవితం ఇట్లా నడిచింది అని అనుకుంటాను. రుబీనా పూర్తిగా శిథిలంలా అయిపోయింది. నేను రెండు శిథిలాలను కలిపి ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మాణం చేయాలనుకుంటున్నాను.
అసలు నా జీవితానికి పరిభాష నేను ఇవ్వలేను. అసలు నా జీవితం గురించి నీకు ఎంత చెప్పగలిగానో అది కూడా తెలియదు. మరొకసారి చెబుతున్నాను రుబీనా నా జీవితంనుండి ఏమీ తీసుకోలేదు. ఏమీ ఇవ్వలేదు. మళ్లీ నన్ను నన్నుగా చేయాలని ప్రయత్నించింది అంతే. నా నుండి ఆమెను వేరు చేయాలని ఎంతో అనుకున్నాను. కాని ఇంకా వేగంగా మరింత దగ్గరయింది. జమీల్‌ని పూర్తిగా మరచిపోవాలని మళ్లీ నేను సందీప్‌గా ఉండిపోవాలని ఆమె కోరిక.
ఇప్పుడు నా ఎదురుగుండా రెండే దారులు ఉన్నాయి. మరో 8 సంవత్సరాలు ఎదురుచూడాలి. అప్పుడు ఆర్మీలో నేను 20 సంవత్సరాలు పనిచేసినట్లు. ఎగ్రిమెంటు ప్రకారం 20 సంవత్సరాలు పనిచేశాక గౌరవంగా ఆర్మీ నుండి బయటికి రావచ్చు. లేకపోతే నేను కేసు వేయాలి. అసలు ఇట్లా ఆలోచించాలంటేనే నాకెంతో బాధగా ఉంది. ఏ ఆర్మీ అయితే నా అందమైన కలో, ఈ రోజు దాని మీదే కేసు వేయాలని ఆలోచిస్తున్నానా? ఆర్మీ నా కల, అది సత్యం. కాని ఇందులో తెలియని సంకెళ్ళు ఎన్నో ఉన్నాయి. ఇది కూడా సత్యమే. కాని నేను ఏం చేయగలను? నేను సంపూర్ణ మానవుడినై జీవించగలగాలి. ఇది నా జీవితోద్దేశ్యం. మనిషి తన చుట్టూ ఉన్న వాతావరణంలో మమేకం కావాలి. అప్పుడే వాడు మనిషిలా జీవించగలుగుతాడు. కాని అసలు ఈనాడు మానవత్వం మంటకలిసిపోతోంది. ఇదే పెద్ద సమస్య అయి కూర్చుంది. నేను ఎక్కడికి వెళ్ళను? ఎవరి దగ్గర ఆశ్రయం పొందను? భగవంతుడి దగ్గరా? గురువు దగ్గరా! ఏదైనా పుస్తకమా! ఎక్కడ దొరుకుతుంది జీవించడానికి ఆధారం? ఈ అస్థిరత, ఈ నిరాశ నిస్పృహలలు ఎప్పుడు దూరం అవుతాయి?
నేను నా గురించి ఏ మాత్రం చెప్పగలిగానో నాకే తెలియదు. నేను నీ దగ్గర ఏ రహస్యం దాచలేదు. అమ్మ నాన్నలకు నీవు అర్థం అయ్యేలా చెప్పు. అసలు నేను మన కుటుంబం కోసం ఏమీ చేయలేకపోయాను. ఈ బాధ నా జీవతం అంతా ఉంటుంది.
- నీ అన్నయ్య
సందీప్
ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి.
చినారుల ఎండుటాకులలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మేజర్ సందీప్ కర్నల్ అయ్యాడు. ఈ ఐదు సంవత్సరాలలో ఎన్నో మార్పులు వచ్చాయి. కాని ఆర్మీలో జాయిన్ కాకముందు ఉన్న రోజులు మళ్లీ తిరిగి రాలేదు. గుడ్‌గాంగ్ నుండి చండీఘర్‌కి పోస్టింగ్ అయింది. కాని రుబీనాను అతడు మర్చిపోలేకపోతున్నాడు. చండీఘర్‌కి రుబీనాని తీసుకురావాలనుకుంటున్నాడు కాని ఎట్లా? ఆమె పట్టుదలని వదలడంలేదు. గత ఎనిమిది తొమ్మిది నెలలో ఆమె సందీప్‌తో ఫోనులో మాట్లాడలేదు. ఉత్తరాలకు జవాబూ ఇవ్వలేదు. సందీప్‌లో బాధ ఇంకా ఎక్కువ అయింది. రాత్రి మళ్లీ డైరీని తెరిచాడు. కొన్ని పాత సంఘటనలను మరచిపోవాలనుకున్నా ఎవరు మరచిపోలేరు.
కొన్ని ఉద్దేశ్యాలు కేవలం స్వప్నాలై జీవితం అంతా బాధపెడతాయి. కొన్ని ఎదురుచూపులు ఎప్పటికీ సంబంధాలుగా మారవు. అంతే ఎదురుచూస్తూ ఉండాలి. అసలు ఎవరికి తెలుసు ఈ కథ ముగింపు ఎట్లా ఉంటుందో!
రుబీనా గత ఎనిమిది నెలల నుండి తనకు ఫోను చేయలేదు. ఒక్క ఉత్తరం రాయలేదు ఎందుకని? తన మానస భూమి మీద ఎప్పుడైనా కోరికల మేఘాలు వర్షిస్తాయా! సందీప్ లాప్‌టాప్ తెరిచాడు. మనసు చికాకుగా ఉంది. మేల్ చెక్ చేయాడానికి వెబ్‌సైట్ తెరిచాడు. ఒక్కసారిగా అతడి కళ్ళలో మెరుపు వచ్చింది. సిద్ధార్థ పంపిన ఈమెయిల్ చదవడం మొదలుపెట్టాడు.

- ఇంకాఉంది

మూలం:మధు కాంకరియా తెలుగు సేత : టి.సి.వసంత