డైలీ సీరియల్

బడబాగ్ని.. 3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘సార్.. మాకూ అదే అర్థం కావడంలేదు.. ఎక్కడికి వెళ్లాడో.. ఫోన్‌కి కూడా దొరకడంలేదు.. మాకూ చాలా కంగారుగా ఉంది..’’ అనే్వష్ అన్నాడు.
‘‘అదేమిటి.. మొన్న రాత్రి మీరంతా కలిసే వెళ్లారుగా..’’
జరిగిందతా విన్న ఆయన బాగా తిట్టారు..‘‘ఎంత పనిచేశారు. అవసరమైనపుడు తెలివీ, సాహసం చూపాలి కాని ఇలా తెలివితక్కువగా కోరి కష్టాలు తెచ్చుకుంటారా.. పోనీ నిన్న రాగానే అయినా చెప్పాలిగా.. ఇడియట్స్.. వెంటనే మిస్సింగ్ కేసు ఫైల్ చేయించాలి.. ఎవరూ నాకు చెప్పకుండా బైటకు వెళ్లకండి. ఈవేళ ఇంక క్లాసు కేన్సిల్. బుద్దిగా రూమ్స్‌లో వుండండి.. వెళ్లండి..’’
‘‘ఇదంతా నావల్లనే జరిగింది.. వాడికేమైనా జరిగితే నన్ను నేను క్షమించుకోలేను.. భగవాన్ వాడిని క్షేమంగా రప్పించు తండ్రీ’’ తనలో తనే కుమిలిపోసాగాడు అనే్వష్...
‘‘నువ్వెందుకురా బాధపడతావ్... ఇందులో మా తప్పు కూడా ఉంది.. వాడు వద్దు వద్దు అంటున్నా వినకుండా వాడిని రెచ్చగొట్టి ఒప్పించి తప్పు చేశాం. వాడికేదైనా జరిగితే ఆ పాపం మనందరిదీ’’ అజిత్, అరుణ్ కూడా కుమిలిపోసాగారు.
రెండు రోజులు గడిచిపోయాయి.. అమర్ జాడ లేదు.. మొత్తం పోలీస్ యంత్రాంగం అంతా అడవి.. అంగుళం అంగుళం గాలిస్తున్నారు.
నడుస్తూ నడుస్తూ కాలికి నైలాను తాడు తగిలింది ఒక సార్జంట్‌కి.. తీగలాగితే డొంక కదిలినట్లు ఆ తాడు వెంట వెళ్లిన పోలీసులకి అమర్ శవం కనబడింది. దానికి కొంత దూరంలో ఒక సెల్ పడి వుండటం... అజిత్ సెల్‌గా గుర్తించిన పోలీస్ వెంటనే అతనిని అరెస్టు చేయడం.. అమర్ చావు కలిగించిన షాక్ కంటే షాక్ అయింది ఆ మిత్రులకి..
అనే్వష్‌ని, అరుణ్‌ని కూడా బాగా ఇంటరాగేట్ చేసి సాక్ష్యాధారాలు లేనందున వాళ్లని వదిలేసినా, సాక్ష్యాధారాలన్నీ అజిత్‌ని దోషిగా చూపడంతో అతనిని అరెస్టు చేసి కోర్టులో కేసు ఫైల్ చేశారు.
అతనిని దోషిగా నిలబెట్టిన సాక్ష్యాలు... అమర్‌ని రెచ్చగొట్టి బయలుదేరేలా చెయ్యడం, అనే్వష్‌తోబాటు వెళ్లడానికి రాసిన పది చీట్లలలోనూ అమర్ పేరే రాయడం, అమర్ శవం దగ్గర దొరికిన అజిత్ సెల్, ఆ రాత్రి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నుంచి అజిత్ మాత్రమే బయటికి వెళ్లిరావడం.. అతనే దోషి అనడానికి దోహదం చేశాయి. అనే్వష్, అరుణ్ అతను దోషికాడు.. అమర్ తమ ముగ్గురికి ప్రాణమిత్రుడు.. అని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు.
విషయం తెలిసిన అజిత్ తల్లి, తండ్రి వెంటనే వచ్చేశారు.. తమ ముద్దులకొడుకు పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడనుకుంటే, ఇలా హత్యకేసులో ముద్దాయిలా బోనులో నిలబడటం తట్టుకోలేకపోతున్నా.. ఏం చెయ్యలేని పరిస్థితి.. అనే్వష్, అరుణ్ వాళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటూ ఇటు అజిత్ తరఫున వాదించి అతనిని నిరపరాధిగా నిరూపించేందుకు మంచి క్రిమినల్ లాయర్‌కి కేసు అప్పచెప్పారు.
మొత్తం దేశంలోనే పేరుమోసిన క్రిమినల్ లాయర్ భగవాన్.. ఎలాంటి క్లిష్టమైన కేసుమైనా సాల్వ్ చెయ్యడంలో ఆయనకి ఆయనే సాటి... అనే్వష్, అరుణ్ ఆయనను కలిసి విషయమంతా వివరించి.. తమ ప్రియ మిత్రుడిని కిరాతకంగా చంపడమే కాక అందులో తెలివిగా తమ వాడినే ఇరికించిన ఆ హంతకుడెవరో తెలుసుకుని, వాడికి శిక్షపడేటట్లు చెయ్యడమే కాక ఏ పాపం ఎరుగని తమ అజిత్‌ని ఎలాగైనా రక్షించమని, ఎంత ఖర్చైనా భరిస్తామని, ఎంత కష్టమైనా పడతామని మరీ మరీ ప్రాధేయపడి అడిగారు.
‘‘వెల్.. నేనొకసారి హత్యా స్థలాన్ని చూస్తాను.... మీరు చూపించగలరా.. ఐ మీన్ మీరు లొకేట్ చెయ్యగలరా..?’’
‘‘చేస్తాను సర్, ఆ రోజు పోలీసులు అమర్ బాడీ గుర్తుపట్టడానికి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లారు. పైగా వాళ్లు ఆ స్థలాన్ని మార్క్ చేసి పెట్టారు.. ఎప్పుడు వెడదాం.. ఇప్పుడు వెడదామా..’’ ఆత్రంగా అడిగాడు అనే్వష్.
‘‘నో.. నో.. మై బాయ్.. రేపు ఉదయం తొమ్మిదింటికి వెడదాం.. బై ది వే.. హతుడు.. అదే అమర్‌కి ఎవరైనా శత్రువులు.. పోనీ ఈమధ్య అతను ఎవరితోనైనా గొడవ పడటం లాంటివి జరిగేయా?’’
‘‘లేదు సర్, వాడు చాలా మంచివాడు.. గొడవ మాట దేముడెరుగు, కనీసం ఎవరితోనూ గట్టిగా మాట్లాడను కూడా మాట్లాడడు.. వాడు మా ముగ్గురితో తప్ప పెద్దగా ఎవరితోనూ కలవను కూడా కలవడు.. అసలు ఇది హత్యేనంటారా.. లేకపోతే.. ఆ చీకటిలో వాడు సపోర్ట్ కోసం కట్టుకున్న తాడు పొరపాటున క్రింద పడ్డప్పుడు బిగిసిపోయి ప్రాణం తీసిందా..’’
‘‘లేదు.. ఇది పర్‌ఫెక్ట్ మర్డర్.. అన్నట్లు మీరు యిలా బెట్ కట్టి బయలుదేరినట్లు ఇంకా ఎవరికైనా తెలుసా? .. ఐ మీన్ ఎవరైనా దీనిని అవకాశంగా తీసుకునే ఛాన్స్ ఉందా? అసలు ఆ సమయంలో... అక్కడ అజిత్ సెల్ ఎలా దొరికింది.. అతను సెల్ ఎవరికైనా ఇచ్చాడా..’’ ఆలోచనగా అడిగాడు భగవాన్.
‘‘అసలు ఆ సెల్ అజిత్ పోగొట్టుకుని సుమారు రెండు నెలలపైనే అయింది.. మరి ఇప్పుడు ఆ సెల్ అక్కడికి ఎలా వెళ్లిందో, ఎవరైనా కావాలని అజిత్‌ని ఇందులో ఇరికించడానికి అక్కడ పడేసారో.. అసలా అవసరం ఎవరికుందో ఎంత ఆలోచించినా అర్థం కావడంలేదు...’’ బాధగా అన్నాడు అనే్వష్.
‘‘బై ది వే.. అమర్‌కి ఏదైనా లవ్ ఎఫైర్స్.. లాంటివి...’’
‘‘నో సర్.. వాడికి అసలు ఆడపిల్లలతో మాట్లాడాలంటేనే భయం.. బెరుకు..’’ భగవాన్ మాట పూర్తికాకుండానే చెప్పాడు అనే్వష్.
‘‘పోనీ.. అజిత్‌కు ఎవరైనా శత్రువులు.. ఐ మీన్ ఏమైనా గొడవల్లాంటివి..?’’
‘‘లేదు సార్.. అసలు అందరితో ఎంతో కలవిడిగా సరదాగా ఉండే అజిత్‌ని ట్రాప్ చేసి ఇలా హత్యకేసులో ఇరికించేంత కక్ష వాడిమీద ఎవరికుంటుంది..’’ ‘‘మరి అతనికి ప్రేమా.. అమ్మాయిలతో అఫైర్స్ లాంటివి..’’
‘‘అదీ.. అది..’’ చెప్పాలా వద్దా అన్న సందిగ్ధత అనే్వష్ గొంతులో...

- ఇంకా ఉంది

- మీనాక్షి శ్రీనివాస్