డైలీ సీరియల్

బడబాగ్ని 18

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏమిటో.. ఈవేళ అంతా ఆయన అదోరకంగా ఉన్నాడు.. ముందంతా ‘ఇంద్రజిత్’ తనే చంపేనని ఒప్పుకొని మరణ వాంగ్మూలం కూడా ఇచ్చేడు కదా.. ఎటూ ఆత్మహత్య చేసుకు చనిపోయాడు కనుక యింక కేసు క్లోస్.. అజిత్‌ని నిరపరాధిగా వదిలేస్తారు అన్నాడు.. నేను ఇంద్రజిత్ చెప్పినదానిలో వేరే ఎవరో అసలు దోషి ఉండగా కేసు ఎట్లా క్లోజ్ అవుతుంది? మాకు లైఫ్ థ్రెట్ కదా..అంటే.. కాసేపు ఇవన్నీ రాహుల్ చేయిస్తున్నాడు, రేపు అతనిని ప్రాసిక్యూట్ చేసి నిరూపిస్తా.. అన్నాడు.
మళ్లీ కాసేపు మీరు ఏదైనా మర్డర్ జరగడం చూశారా, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీశారా.. బాగా జ్ఞాపకం చేసుకు చెప్పు అంటాడు.. అసలు అలాంటివి ఎవరైనా మర్చిపోవడం జరుగుతుందా? ఏమిటో ఆయన గోల... అవునూ నీకు ఆయనకు ఏదైనా గొడవలున్నాయా?.. నీ గురించి.. నీతో నా స్నేహం గురించి కాస్త అయిష్టంగా మాట్లాడేడు..’’
‘‘ఆ ఏవో ఉంటాయ్‌లే.. ఎంతైనా వాళ్లు క్రిమినల్స్ తరఫునో.. క్రిమినల్స్ కోసమో వాదించే క్రిమినల్ లాయర్స్... మేము మీడియా ప్రతినిధులం.. చుక్కెదురు ఉంటూనే ఉంటుంది.. బై ద బై.. రేపే కేసు హియరింగ్ కదా, రేపు రాహుల్‌ని అక్యూజ్ చేస్తారా.. ఐ మీన్ ప్రోసిక్యూట్ చేస్తారా.. అసలు రాహుల్ ముద్దాయి అని ఏ విధంగా డిసైడ్ చేసి ప్రోసిక్యూట్ చేస్తారు? దానికి బేస్ ఉందా?
‘‘ఆ.. అమర్ చనిపోయిన స్పాట్ వరకూ.. అడవి దారి మొదలు.. హత్యాస్థలం వరకూ దారి పొడవునా అమర్ అడుగుజాడలకు గజం దూరంలో మరొక అడుగుజాడలు బురదలో కనబడుతున్నాయి.. అవి..
‘‘అవి రాహుల్‌వేనని ఎలా చెప్పగలవ్..’’
‘‘నన్ను పూర్తిగా చెప్పనిస్తే.. నీకే అర్థమవుతుంది.. దానికి ఒకటి కాదు, రెండు కాదు మూడు ముచ్చటగా మూడు ఆధారాలున్నాయ్.. నెంబర్ వన్.. ఆ అడుగుజాడలు... నార్మల్‌గా లేవు.. ఒక షూ సోల్ డిజైన్ వేరు, యింకొకటి వేరు.. అంతేకాదు ఒక పాదం పెద్దది.. ఇంకొకటి చిన్నది, అడుగులు వంకరగా.. మరో ముఖ్యవిషయం అడుగులకి అడుగు దూరంలో ఊత కోసం వాడిన కర్ర బురదలో దిగబడిన గుర్తు..
‘‘అంతా క్రైమ్ పిక్చరైజేషన్ బాగానే చెబుతున్నావ్ కానీ అసలు రాహుల్‌కి లేని లక్షణాలు, అవకరాలు చెప్పి అతనే దోషి అంటే ఎలా..?’’
‘‘మహానుభావా.. రేపు కోర్ట్‌కి రా.. నీకే అర్థమవుతుంది.. ఓకే.. మీ జాబ్ విశేషాలేమిటి?.. క్రైం రిపోర్టర్‌గా తెల్లారి లేస్తే అంతా అదే గోల.. బోర్ కొట్టదూ..?
‘‘్భలేవాడివి.. పోలీస్, లాయర్స్, క్రైం రిపోర్టర్స్.. మన బ్రతుకుమీద ఆధారపడి ఉంటే.. బోర్ అంటే ఎలా? అయినా జరిగినపుడు బాధ అనిపిస్తుంది. కాని పరిశోధన మొదలుపెడితే చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది.. ప్రతీ కేసు.. దాని అంతు చూడాలన్నంత కసి.. ఆ కేసు సాల్వ్ అయితే బోలెడంత ఆత్మ సంతృప్తి.. ఏదో సాధించినంత సంబరం.. అదొక మత్తు.. నిషా.. అయినా తినబోతూ రుచి ఎందుకు. నువ్వూ డ్యూటీలో చేరబోతున్నావ్‌గా, అనుభవంలోకి వస్తుందిలే.. ఓకె.. నాకు కొంచెం పనుంది.. వెళ్లనా.. రాత్రికి రావాలా..?’’
‘‘అరె.. వద్దు.. నువ్వు ఇప్పటికే నీ పనులన్నీ మానుకుంటున్నావ్ మా కోసం.. కానీ రేపు కోర్టుకి మాత్రం రా.. కేసు ఎలా టర్న్ అవుతుందో చూద్దుగాని...
‘‘ష్యూర్.. మరి నే వెళ్లిరానా.. అరుణ్.. త్వరగా రికవర్ అవు.. మనకి బోలెడు పనులున్నాయి.. గుడ్‌నైట్.. సీ యూ..బై’’.
కమల్ వెళ్లిపోయాడు. అనే్వష్ బుర్రలో రకరకాల ఆలోచనలు తిరుగుతున్నాయి.. ఒకవైపు రాహుల్ దోషి అనిపిస్తున్నాడు.. మరోకపక్క అతను కాదు.. కాదు అంటోంది సిక్స్త్‌సెన్స్.. అటు చూస్తే లాయర్ భగవాన్ రేపు కోర్టులో రాహుల్ దోషి అని నొక్కి వక్కాణించి, నిరూపిస్తానంటున్నాడు.. ఒకవేళ నిజంగా అతను దోషి కాకపోతే.. పాపం అతను అన్యాయంగా బలి అవుతాడు.. అలా ఎంతమాత్రం జరగకూడదు.. ఆలోచనలలో ఉండగానే డాక్టర్ విజిట్స్‌కి రావడం, వెళ్లడం కూడా జరిగాపోయాయి. ఎప్పుడు రాత్రి అయి.. ఎప్పుడు తెల్లవారిందో..
***
మర్నాడు.. ఇద్దరు పోలీసు జవాన్లను అరుణ్ దగ్గర కాపలా ఉంచి, బోలెడు జాగ్రత్తలు చెప్పి కోర్టుకి వెళ్ళేడు.. కోర్ట్ మొదలు అయింది..
మొదటగా లాయర్ భగవాన్, అజిత్ నిరపరాధి అనడానికి కావలసిన సాక్ష్యాలు దొరికాయనీ.. ముఖ్యంగా అరుణ్‌ని చంపబోయి విఫలయత్నం అయిన కారణంగా ఎక్కడ దొరికిపోతానో అన్న ఆలోచనతో ‘ఆత్మహత్య’ చేసుకు మణించిన ఐపిఎస్ ట్రైనీ ఇంద్రజిత్ మరణవాంగ్మూలం అజిత్ నిర్దోషిత్వాన్ని చాలా స్పష్టంగా నిరూపించిందని.. అయితే అదే మరణవాంగ్మూలం తను కేవలం పాత్రధారే కానీ తెర వెనుక అసలు సూత్రధారి వేరొకరు ఉన్నారనీ.. వాళ్ళెవరో మాత్రం తనకు తెలియదనీ కూడా తెలియజేసింది... అయితే కొన్ని నిజానిజాలు పరిశీలించిన పిమ్మట అనుమానాస్పద పరిస్థితులు ఒక వ్యక్తిని దోషిగా, హంతకుడిగా నిలబెడుతున్నాయనీ, వాటికి సంబంధించిన సాక్ష్యాధారాలు కోర్టువారికి సమర్పించుకుంటున్నానని.. నిజానిజాలు కోర్టువారు పరిశీలించి సదరు ముద్దాయిని శిక్షించాలని.. నిరపరాధి అయిన తన ముద్దాయిని విడుదల చేయవలసిందిగా వేడుకుంటూ.. అసలు దోషిని ముద్దాయి కోర్టు బోనులో నిలబెట్టడానికి అనుమతి కోరుతున్నానన్నాడు.
‘పర్మిషన్ గ్రాంటెడ్’ ఖంగుమంది జడ్జి గొంతు.
‘మిస్టర్ రాహుల్’ అన్నాడు భగవాన్.

-ఇంకాఉంది

- మీనాక్షి శ్రీనివాస్