భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! 9

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దేవతలారా! మహిషాసురుని సంహరించగలది ఒక్క దేవీమాతయే! వరప్రభావంవలన మాలో ఎవరి చేతా మరణం లేని ఆ అసురుడిని అసాధారణ రూపంలో ఆవిర్భవించి జగన్మాత అంతంకావిస్తుంది! అందరూ కలిసి ఆ మాతను ధ్యానించండి!’’ అని బ్రహ్మ చెప్పడంతో అందరూ కన్నులరమోడ్చి భక్తిపూర్వకంగా దేవీమాతను స్తుతించసాగారు!
‘‘అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తి పాలయమాం!
శ్రీ్భవనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం!!
వీణావాణి విమల స్వరూపిణి వేదాంతరూపిణి పాలయామాం!
కౌమితదాయిని కరుణ స్వరూపిణి కన్యాకుమారి పాలయమాం!’’
అంటూ వాళ్లు స్తుతిస్తుండగా వాళ్లముందర దివ్యకాంతులు వెదజల్లుతూ తేజో మండల మధ్యంలో దేవీమాత సాక్షాత్కరించింది! అందరూ భక్తి ప్రపత్తులతో నమస్కరించి మహిషాసురుని వధించమని వేడుకున్నారు! దేవి వాళ్లవైపు ప్రసన్నంగా చూసింది!
‘‘దేవతలారా! మహిషాసురుడు ప్రకృతి రూపమైన స్ర్తి శక్తిని సామాన్యంగా భావించి తనను అజేయుడుగా భావించుకుంటున్నాడు! అతని గర్వాహంకారాలను అణచి అంతం కావించడానికి ఆవిర్భవించిన ఈ రూపాన్ని దర్శించండి!’’ అన్నది!
దేవతలు, త్రిమూర్తులు ఆశ్చార్యానందాలతో చూస్తుండగా వాళ్లందరి నుండి తేజాలు వెలువడి దేవీమాతలో విలీనం చెందాయి! అద్భుతంగా ప్రకాశిస్తున్న రూపంతో, వివిధాయుధాలు హస్తాలలో ధరించి సింహ వాహనంపై తరలివెళుతున్న మాతకు ప్రణామాలర్పించారు దేవతలు!
దేవీమాత మహిషుని పురబాహ్యంలో నిలిచి శంఖాన్ని పూరించింది! ఆ నాదాన్ని, ఆమె రూపాన్ని చూసి భయభ్రాంతులైన రాక్షస భటులు ఎవరో దివ్యాంగన సింహవాహనారూఢురాలై పురబాహ్యంలో నిలిచివున్నదన్న వార్తను తమ ప్రభువుకు నివేదించారు!
‘దివ్యాంగన’ అన్న వార్త మోహవిశుడిని చేసింది మహిషాసురుని!
‘‘దివ్యాంగనా? అయితే అసమాన సౌందర్యవతియై వుంటుంది! అటువంటి కాంత నా పట్టమహిషి కావాలి! వెంటనే వెళ్లి ఆమెకు నా అభీష్టం తెలిపి సగౌరవంగా సభకు తీసుసుకురండి! వెళ్లండి వెంటనే!’’ అంటూ మంత్రులను ఆదేశించాడు!
ప్రక్కనే కూర్చుని వున్న మహిషి మాత్రం గంభీరంగా ఆలోచనామగ్నురాలైంది ఆ వార్త విని!
‘‘సోదరా! తొందరపడకు! ఆమె ఎవరో, ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా వివాహ రాయబారం సాగించడం మంచిది కాదు! ముందు ఆ వివరాలు తెలుసుకోవాలి!’’ అన్నది.
‘‘ఆ వివరాలు తెలుసుకోండిగానీ ఆమెను మాత్రం త్వరగా నా సముఖానికి తీసుకుండి! అని చెప్పి పంపాడు మహిషాసురుడు!
వెళ్లినవాళ్లు కొద్దిసేపటిలో తిరిగివచ్చారు! వాళ్ల ముఖాలలో భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి! వౌనంగా నిలిచారు!
‘‘ఆ దివ్యాంగన రానన్నదా? ఏం జరిగింది? చెప్పండి త్వరగా!’’ అరిచాడు మహిషుడు అసహనంగా!
‘‘ప్రభూ! అష్టాదశ భుజాలలో వివిధాయుధాలు ధరించి సింహవాహనంపై ఆసీనురాలై వచ్చిన ఆ దివ్యాంగన మిమ్మల్ని యుద్ధానికి ఆహ్వానిస్తున్నది! తనను యుద్ధంలో గెలిచితే మీ అభీష్టం నెరవేరుతుందని తెలియజేయమన్నది! మీ బల పరాక్రమాల గూర్చి ఎంతగానో చెప్పి చూశాము! కానీ ఆమె మా మాటలు లక్ష్యపెట్టలేదు!’’ అన్నారు భయం భయంగా చూస్తూ!
‘‘ఎంత సాహసం? నా మాటను మన్నించకుండా ననే్న యుద్ధానికి ఆహ్వానిస్తున్నదా! ఇప్పుడే వెళ్లి నా శక్తి సామర్థ్యాలు తెలిసేలా చేసి వస్తాను!’’ అంటూ ఆవేశంగా గదనందుకుని లేచాడు మహిషుడు! ‘‘సోదరా! ఇప్పుడు కావలసింది ఆవేశం కాదు ఆలోచన! ఇది ఆ దేవతల పన్నాగంలా నాకు తోస్తున్నది!

-ఇంకాఉంది

- డా. టి. కళ్యాణీసచ్చిదానందం