డైలీ సీరియల్

బడబాగ్ని 39

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్వర్ మాటలలో ఆనాటి సంఘటన..
..బిజినెస్ పనిమీద హైదరాబాద్ వెళ్లిన ప్రణవ్.. ఆ పని చూసుకు తిరిగి తమ ఊరు విజయవాడ వస్తుండగా, బాగా పొద్దుపోయింది.. అతను ప్రయాణం చేస్తున్న కారు సరిగ్గా వందో మైలురాయి దగ్గరకు రాగానే.. కీచుమన్న శబ్దంతో ఆగిపోయింది.. వెనక సీట్లో కునుకుపాట్లు పడుతున్న ప్రణవ్ ముందుకు తూలి గాబరాగా చూసాడు డ్రైవర్ అన్వర్‌కేసి...
అన్వర్ అతనికేసి భయపడుతూ చూసి... క్షణంలో చూస్తాను సార్, ప్రాబ్లం ఏమిటో.. అంటూ కారు దిగి బోనెట్ ఎత్తి చూశాడు.. ఇంజెన్ వేడెక్కింది తప్పితే.. అందులో ఏ ప్రాబ్లం కనపడలేదు. మళ్లీ మళ్లీ చూసిన అతనికి కారులో పెట్రోల్ అయిపోయిందని అర్థమైంది.. అదెలా? బయలుదేరే ముందరే టాంక్ నిండా కొట్టించిన పెట్రోల్ అప్పుడే ఎలా అయిపోయింది.. అతను భయం భయంగా యజమానికేసి చూశాడు...
‘‘ఏం జరిగింది?’’’ కొట్టినట్టే అడిగాడు ప్రణవ్...
‘‘పెట్రోల్ అయిపోయింది సార్..’’ బలవంతాన గొంతు పెగల్చుకుని అన్నాడు అన్వర్.
‘‘ఎన్నిసార్లు చెప్పాలి.. దున్నపోతా.. దూర ప్రయాణానికి టాంక్ ఫుల్ చేయించమని.. మరి ఇచ్చిన డబ్బేం చేసావ్.. జల్సా చేసావా. ఇడియట్.. అర్థరాత్రి, ప్రొద్దుట నుంచి అలసిపోయి.. కాస్త త్వరగా ఇంటికెళ్లి పడుకుందామంటే లేకుండా.. దేభ్యం ముఖం వేసుకు అలా నిలబడి చావకపోతే.. ఫో.. పోయి కేన్‌తో పెట్రోల్ పట్టుకురా.. దగ్గరలో పెట్రోల్ బంక్ ఉందేమో చూసి.. విసురుగా జేబులోంచి డబ్బు తీసి ఇచ్చాడు.
అర్ధరాత్రి.. అడపాదడపా వచ్చే.. పోయే.. వాహనాల వెలుతురు తప్ప కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి.. ఎక్కడున్నామో.. బంక్ ఎంత దూరంలో వుందో తెలియదు.. ఎక్కడని వెళ్లి తేవాలి? ఈయనకి డబ్బు ఉంది కానీ కొంచెం కూడా మానత్వం లేదు.. గత్యంతరం లేక తను ఈయన దగ్గర చచ్చినట్టు పని చేస్తన్నాడు.. కానీ ఈయన దగ్గర పట్టుమని నెలా.. రెండు నెలలు కూడా ఎవరూ పనిచేయలేరు.. ఇంతవరకూ పనిచేయలేదు కూడా.. ఆలోచిస్తూ, ఈసురోమని నడుస్తున్న అన్వర్‌కి ఒక పోలీస్ పెట్రోలింగ్ జీప్ వస్తూ, అతనిని చూసి అనుమానపడి ఆపి.. ఆవేళలో ఎక్కడకు వెళుతున్నావ్ అని అగి.. అనుమాన నివృత్తికోసం.. ప్రణవ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఆ విషయం నిర్థారించుకుని.. అతనిని కిలోమీటర్ దూరాన వున్న పెట్రోల్ బంక్ దగ్గర దిగబెట్టారు..
పది నిముషాలు గడిచింది.. చిరాగ్గా కారు దిగి సిగరెట్ వెలిగించిన ప్రణవ్‌కి మెల్లిగా డిక్కీ తెరచుకున్న చప్పుడు వినబడి వెనక్కి తిరగేడు.. తనకి దగ్గరగా వస్తున్న ఆ ఆకారాన్ని.. ‘‘ఎవరు.. ఎవరదీ’’ గట్టిగా అడిగాడు... బదులు చెప్పని ఆ ఆకారం అతని దగ్గరగా వచ్చి చేతిలో టార్చ్.. ఫోకస్ చేసింది.. ఆ చిరుకాంతిలోనే అతనిని పోల్చుకునే ప్రయత్నం చేస్తూ.. నువ్వు.. నువ్వు..
‘‘ఆ నేనే.. అంటూనే.. అతడిని వడిసిపట్టుకుని మెడకి తాడు బిగించాడు ఆ ఆగంతకుడు..
అతని ఉడుంపట్టు ముందు.. ఎంత గింజుకున్నా లాభం లేకపోయింది ప్రణవ్‌కి. కొన్ని క్షణాలలో అచేతనమైపోయింది అతని శరీరం.. విసురుగా వెనక డోర్ తెరచి ఆ శవాన్ని అందులో కూలేసి.. డోర్ మూసి.. నింపాదిగా హైవే దిగి నడక సాగించాడు.. ఆ ఆగంతకుడు.
సుమారు గంట తర్వాత ఒక ఆటోలో పెట్రోల్ కాన్ పట్టుకు వచ్చిన అన్వర్.. ఆలస్యానికీ, అసౌకర్యానికీ యజమాని గుర్రుగా ఉన్నాడేమో అనుకుని వౌనంగా కారు టాంక్‌లో పెట్రల్‌పోసి.. కారు స్టార్ట్ చేసి... బయలుదేరుదాం అనుకుంటూ.... యజమని అంత కామ్‌గా ఉన్నాడేమిటి చెప్మా అనుకుంటూ వెనుదిరిగి చూసి.. ఆయన సీట్లో వరిగిపోయి కూర్చున్న తీరుకు.. ఏమైందబ్బా ఈయనకు అనుకుంటూ.. దిగి వచ్చి చూసి పెట్టిన వెర్రికేక ఆ ప్రశాంతంగా వున్న నిశీధిలో.. మారుమ్రోగింది.
వెంటనే భయంతో.. కారు స్టార్టు చేసి... తనను బంక్ దగ్గర దింపి వెళ్లిన పోలీస్ పెట్రోలింగ్ జీప్ వెతుక్కుంటూ.. పోలీస్ స్టేషన్ చేర్చి.. జరిగినదంతా వివరించాడు.
పోస్ట్‌మార్టం కోసం దగ్గరలోని హాస్పిటల్‌కి ఆడెడ్ బాడీ తరలించి.. అతని ఇంటికి ఫోన్ చేసిన పోలీసులకు.. ఆ హత్య ఎలా జరిగిందో... అంత రాత్రివేళ ఎవరు వాళ్లని అనుసరించి.. డ్రైవర్ పెట్రోల్ కోసం వెళ్లిన సమయంలో హత్యగావించారో అర్థం కాలేదు.. అన్వర్‌ని కస్టడీలోకి తీసుకుని.. వేరే ఇంకొకరితో కలసి పథకం ప్రకారం హత్య చేసి నాటకం ఆడుతున్నావా అని అతనిని దారుణంగా ఇంటారాగేట్ చేశారు..
కనా అతను తనకే పాపం తెలియని ఎంత మొత్తుకున్నా.. ఎక్కడ ఆ రెండోవాడు.. ఏమాశించి ఆ హత్య చేశారు అంటూ జైల్లో పడేసి అతనిమీద కేసు నమోదు చేశారు.. జైల్లో వున్న అన్వర్‌కి అర్థం కాలేదు తననెందుకు అరెస్టు చేశారో.. తను చంపలేదని మొత్తుకున్నా.. ఆ కేసు విచారించిన జడ్జి.. అతని ఘోష విని.. డాక్టర్స్ పోస్టుమార్టం చేసి ప్రణవ్ చనిపోయాడని నిర్థారించిన సమయంలో అన్వర్ పెట్రోలింగ్ జీప్‌లో పెట్రోల్ బంక్‌కి వెళ్లడంవలనా.. హతుడి దగ్గర భద్రంగా బాగ్‌లోనే దొరికిన పది లక్షల రూపాయలు వున్నందున.. ఇది అన్వర్ డబ్బుకాశపడి చేసిన మర్డర్ కాదని విశ్వసించి.. అతనిని విడుదల చేసి అంతు చిక్కని హత్యగా కేసు క్లోజ్ చేశారు...

-ఇంకాఉంది

-మీనాక్షి శ్రీనివాస్