డైలీ సీరియల్

బడబాగ్ని 47

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మై గాడ్.. అయితే సాహూ ఎప్పుడో యిరవై ఏళ్ళ క్రింద జరిగినదానికి ప్రతీకారంగా యిపుడు ఈ హత్యలు చేస్తున్నాడా’’ ఆశ్చర్యంగా అడిగాడాయన.
‘‘అదే సార్ నాకూ అర్థం కావడంలేదు.. అయితే వెంటనే చంపాలి, లేదూ అప్పుడు చిన్నవాడు.. అంత ధైర్యం, బలం లేవనుకుంటే కనీసం పోలీస్ ఆఫీసర్ అయిన వెంటనే చంపాలి.. అలాంటిది యిన్ని సంవత్సరాలు ఆగి యిప్పుడు చంపడం దేనికో..’’
‘‘అది సరే అసలు యిపుడు చెప్పండి.. అతన్ని అరెస్ట్ చెయ్యడానికి ఈ సాక్ష్యం సరిపోతుందా.. లేదా యింకా బలమైన సాక్ష్యాలు కావాలా..’’ అడిగాడు రాహుల్.
‘‘యిదొక్కడే మాత్రం సరిపోదు. అందులోనూ చెప్పినవాడూ పోయాడు, రికార్డ్ చేసినవాడూ పోయాడు.. అయితే యివన్నీ నిజంగా సాహూయే గనుక చేస్తుంటే, అతను ఖచ్చితంగా యింకా ఏదో పెద్ద సాక్ష్యానే్న మనకోసం వదిలిపెడతాడు..’’ నవ్వేడాయన.
‘‘ఏమో సార్.. మొన్న కమల్, మహేష్‌లను చంపించింది కూడా ఖచ్చితంగా ఆయనే..’’
‘‘అదేమిటి క్రైం రిపోర్టర్ కమల్ హోటల్ గది బల్కానీ నాలుగో అంతస్తుమీద నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మరణించేడని వ్రాశారు పేపర్లో..’’
‘‘ప్రమాదవశాత్తూ కాదు సార్, ప్రమాదం కల్పించబడి..’’ కోపంగా అన్నాడు రాహుల్.
‘‘ప్రమాదం కల్పించబడా.. అదెలాగయ్యా’’ కుతూహలంగా అడిగాడాయన.
ఏసి పైప్ ద్వారా మత్తు మందు గదిలోకి పంపి ఆ మత్తులో డ్రైవ్ చేసుకుంటూ మహేష్, ఫోన్ మాట్లాడడానికి బాల్కనీలోకి వచ్చి మత్తులో జారి నాలుగో అంతస్తుమీదనుండి క్రింద పడి కమల్ ఎలా మరణించాడో మొత్తం కళ్ళకు కట్టినట్లు వర్ణించాడతను.
ఎన్నో నేరాలు- ఘోరాలు చూసిన ఆయనే విస్తుపోయాడు హంతకుడి క్రిమినల్ బ్రైన్‌కి.
‘‘మరి మనం అతన్ని అన్ని సాక్ష్యాధారాలతో పట్టుకోగలమా..’’ మళ్లీ అడిగాడు రాహుల్.
‘‘కొంచెం కష్టం అవ్వచ్చేమో కానీ అసాధ్యం మాత్రం కాదు.. అన్నట్టు.. ఇంద్రజిత్‌ని కూడా ఏదో విధంగా తన కంట్రోల్‌లోకి తెచ్చుకుని అతని చేతే యివన్నీ చేయించాడు కదూ, పాపం పూర్ ఫెలో అతనికి తనను ఎవరు వాడుకుంటున్నారో కూడా తెలియకుండానే యివన్నీ చేసి ఆఖరికి దొరికిపోతానేమో అనే టెన్షన్‌తో తనంత తానుగా ఆత్మహత్య చేసుకున్నాడు.. అవునూ యిన్ని చేసినవాడు మరి విషంవలన చావబోయిన అరుణ్‌ని ఎందుకు సమయానికి హాస్పిటల్‌కి చేర్చి కాపాడంటావ్..’’ అడిగాడాయన.
‘‘ఎందుకంటే కనీసం తనమీద అనుమానం కూడా ఎవరికీ కలగకుండా.. అతని ప్లాన్ ప్రకారం అరుణ్‌ని రక్షించినట్టే రక్షించి, హాస్పిటల్‌లో ఇంద్రజిత్‌తో ఫినిష్ చేయించి తరువాత అమర్ హత్య, అరుణ్ హత్యా అన్నీ ఇంద్రజిత్ ఖాతాలో వేసి అతనిని ఉరికంబం ఎక్కిద్దామనుకున్నాడు.. కానీ ఇంద్రజిత్ భయపడి అర్థాంతరంగా చచ్చిపోయాడు.’’ రాహుల్ వివరించాడు.
‘‘యిప్పుడైనా నేరం ఇంద్రజిత్‌మీదే పడింది.. కానీ యిప్పుడు మనం అసలు ఇంద్రజిత్, అతని ట్రాప్‌లోనికి వెళ్లాల్సి వచ్చిన కారణాలు ఏమిటో పట్టుకోగలిగితే, ఎవరికి అతనిని బ్లాక్‌మెయిల్ చెయ్యాల్సిన అవసరం వుందో తెలిసిపోతుంది.. యివన్నీ తెలియాలంటే మనకి ఆ ట్రైనింగ్ సెంటర్లో బాగా తెలిసి మనకు సహాయపడే వాళ్ళెవరైనా కావాలి..’’ భగవాన్ చెప్పాడు.
‘‘అరుణ్ ద్వారా ఒకతనిని పట్టుకున్నాం, అతనే మనకి అక్కడ ట్రైనర్స్ లీవ్ రికార్డ్ తెచ్చిపెట్టాడు..’’
‘‘వాళ్ళ లీవ్ రికార్డ్స్ ఎందుకు..’’ ఆశ్చర్యంగా అడిగాడు భగవాన్.
‘‘ఓ.. మీకదింకా చెప్పలేదు కదూ.. హంతకుడుట్రైనింగ్ సెంటర్‌లోనే వున్నాడని డిసైడ్ అయ్యాకా.. అది ఎవరూ అన్నది కన్‌ఫర్మ్ చేసుకుందుకు.. వాళ్ళ లీవ్ డేట్స్.. హత్యలు జరిగిన డేట్స్ టాలీ చేసుకున్నాం. ఎందుకంటే.. హత్యలన్నీ తలో చోటా జరిగాయి.. అలా టాలీ చేస్తే సాహు దొరికాడు.. మహేష్ కమల్‌కి చెప్పిన కధలో కూడా సాహూ ఉన్నాడు. మహేష్‌ని కమల్‌ని చంపించిన దానిలో కూడా ఆ ఏసీ మైంటినెన్స్ వాళ్ళతోలాలూచీ పడి, వాళ్ళకి డబ్బు ఎర చూపిన కేస్‌లో బాంక్ ఖాతాలో డబ్బు జమ చేసినది సాక్షాత్తూ సాహూ అసిస్టెంట్. సో.. ఏ రకంగా చూసినా ఈ హత్యల పరంపర సాహూ చుట్టూనే తిరుగుతోంది.. సో అతనిని అరెస్టు చేసి, ఇంటరాగేట్ చేస్తే.. నిజాలన్నీ వాటంతట అవే బయటపడతాయి..’’
‘‘్భలేవాడివయ్యా.. మొత్తం తీగంతా నువ్వు లాగి నన్ను డొంక చూపమంటావెందుకయ్యా.. మొత్తం అన్ని రకాలుగానూ సాహూ హంతకుడు అని ఆధారాలతో సహా తెలుసుకుని, ఈ కేస్ సాల్వ్ చెయ్యడానికి నా సహాయం ఎందుకయ్యా’’ మెచ్చుకోలుగా తల పంకిస్తూ అతని భుజం తట్టాడు.
ఏదో నాకు చేతనైనంత వరకూ విషయ సేకరణ చేసా కానీ దానిని నిరూపించి లీగల్‌లో ప్రొసీడవడం మీవల్లనే అవుతుంది సార్.. కొంచెం వినయం నటించాడు రాహుల్, ఆయనను సంతోషపెట్టడానికి.
ఆ మాత్రానికే పొంగిపోయాడాయన.

-ఇంకాఉంది

- మీనాక్షి శ్రీనివాస్