భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా! 23

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమేశ్వరుడు తిరిగి వృద్ధుని రూపు ధరించి తలుపు తీశాడు! బయట ఆతురతతో ఎదురుచూస్తున్న రాజ దంపతులు, ప్రజలు వృద్ధుని వెనుక పూర్ణారోగ్యవంతుడై వచ్చిన రాకుమారుడికి హర్షధ్వానాలతో స్వాగతం పలికారు!
‘‘రాకుమారుడు స్వస్థుడైనాడు! ఇక మనకే చింతా లేకుండా చూస్తాడు!’’ వాళ్ళలో వాళ్లనుకుంటుంటే చిరునవ్వు నవ్వి ‘‘అవును! ఇక ఏ చింతా దరిచేరదు. మీ ప్రియతమ నాయకుడిని’’ అంటూ అందరిని ఆశీర్వదించి బయలుదేరుతున్న వృద్ధుడికి పళ్ళెరం నిండా బంగారు నాణాలు పోసి బహూకరించబోయాడు రాజు!
‘‘మహారాజా! వాటిని మీ ప్రజలకే దానం చేయండి?’’ అని వడివడిగా నడుస్తూ వెళ్లిపోయాడు వృద్ధుడు!
విషయం తెలిసిన మంత్రి, సేనాపతులలో పరివర్తన కలగకపోగా మణికంఠునిపై ఈర్ష్యాద్వేషాలు ఎక్కువైనాయి. అతనిని తుదముట్టించడానికి మరో పథకం ఆలోచించసాగారు!
***
నేను ఆనాడు అనుకున్నట్టు చేస్తే అందరూ నాది దురాలోచన అనుకొంటారా ఏమి ఇపుడు ఏం చేయాలి...
నేను అనుకొన్నట్టుగానే చేస్తాను.. ఏమి జరుగుతుందో చూస్తాను. మహారాణివారితో మాట్లాడుతాను.. అపుడే నిర్ణయంచుకుంటాను మెల లగా మహారాణి భవనం వైపు మంత్రి నడక సాగింది.
‘‘మహారాణి! మీ దర్శనం కోసం మహామంత్రి వచ్చి అనుమతి కోరుతున్నారు! చాలా ముఖ్యమైన విషయమేదో మీకు విన్నవించాలిట! లోపలకు పంపమంటారా!’’ పరిచారిక వచ్చి చెప్పడంతో పంపమన్నట్లుగా సైగ చేసింది ముఖ్యకార్యమేమైవుంటుందా ఆలోచిస్తూ!
***
‘‘అభివాదాలు మహారాణి! మీ ఏకాంతానికి అంతరాయం కలిగించినట్లున్నాను! క్షమించాలి’’ వంగి వినయం వుట్టిపడుతున్న కంఠంతో అన్నాడు మంత్రి!
‘‘్ఫరవాలేదు, కూర్చోండి! ప్రభువు మీతో ఏదైనా సందేశం పంపించారా?’’ కూర్చోవడానికి ఆసనం చూపుతూ అడిగింది రాణి!
చిన్నగా నిట్టూరుస్తూ రెండు క్షణాలు వౌనంగా వుండిపోయాడు మంత్రి! అతనివైపు పరీక్షగా చూస్తూ ‘‘చెప్పండి మంత్రిగారూ! ఏమైనా గంభీరమైన విషయమా?’’ అడిగింది రాణి కొద్దిగా ఆందోళన నిండిన స్వరంతో!
చిన్నగా దగ్గి గొంతు సవరించుకున్నాడు మంత్రి!
‘‘గంభీరమైన విషయమే! ప్రభువు చెప్పి రమ్మని పంపలేదు! నేనే వుండలేక వచ్చేసాను! మహారాణి! ప్రభువు నిండు సభలో మణికంఠునికి పందల రాజ్య సింహాసనం కట్టబెట్టనున్నట్లు ప్రటించారు! త్వరలో పట్ట్భాషేకం జరగబోతున్నది!’’ చెప్పాడు విషాదం నిండిన స్వరంతో.
‘‘ఎంత మంచి వార్త! ఇది చెప్పటానికి సంకోచపడుతున్నారెందుకు? ఈ శుభవార్త తెచ్చినందుకు మిమ్మల్ని సత్కరించాల్సిందే!’’ అంటూ మెడలోనుండి ఒక హారాన్ని తీయబోయింది రాణి! కంగారుగా లేచి వారించాడు మంత్రి!
‘‘మీలోని మంచితనం, అమాయకత్వం తెలిసే వాటిని ఆసరాగా తీసుకుని మహారాజు ప్రకటించిన వార్త మీకు విచారాన్ని కాకుండా ఆనందాన్ని కలిగిస్తుందని నేను ముందే ఊహించాను!
అందుకే ఇది ఆనందకరమైన వార్త కాదని, మీకు మీ కుమారుడికి జరుగుతున్న అన్యాయమని చెప్పటానికే ఇలా రెక్కలు కట్టుకుని వచ్చి మీకు తెలియజేశాను! మీ కానుకలకోసం ఆశపడేవాడిని కాదు!

రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

-డా. టి.కళ్యాణీ సచ్చిదానందం