భక్తి కథలు

స్వామియే శరణం అయ్యప్పా 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ కౌగిలిలో ఎనలేని ఆనందాన్ని పొందాడు! మణికంఠుని చూస్తూనే దురాలోచనలతో అతనికి కీడు తలపెట్టడానికి పన్నాగం పన్నిన మంత్రి మనస్సులో పరివర్తన కలిగింది! రాణి పరిస్థితి కూడా అలాగే వుంది! వాళ్ళు వణుకుతున్న చేతులతో నమస్కరించి క్షమాభిక్ష వేడారు!
‘‘ఇక ఏ పులి పాలు అవసరం లేదు! దురాలోచనతో నటించిన పాపులం! మమ్మల్ని క్షమించు కుమారా! నీవు సామాన్య బాలుడివి కావనీ, మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన దైవాంశ సంభూతుడివనీ తెలుసుకున్నాము. మమ్మల్ని క్షమించు పుత్రా!’’ అంటూ పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకున్న తల్లిని ఓదార్చాడు మణికంఠుడు!
మంత్రికి క్షమాభిక్ష ప్రసాదించాడు! మంత్రి చేతిలో కీలుబొమ్మలై అసత్యం పలికిన రాజవైద్యుడు సేనాపతి కూడా తప్పులు ఒప్పుకుని క్షమాభిక్ష కోరడంతో వాళ్లను మన్నించాడు కరుణామూర్తి అయిన మణికంఠుడు!
అందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు! ‘‘మీరందరూ నన్ను గుర్తించటమే నాకు కావలసినది! ఒక ప్రయోజనం కోసం నేను ఈ విధంగా పనె్నండు సంవత్సరాలు గడపవలసి వచ్చింది! రాక్షసత్వంతో దేవతలను బాధిస్తున్న మహిషిని మర్దించడమనే లక్ష్యంతో భూమిపై అవతరించిన భూతనాథుడను, హరిహర పుత్రునిగా నన్ను గుర్తెరగండి! మీ అందరి మనస్సులలో జ్యోతిరూపంలో వెలుగుతూ ఇకపై మీ యోగక్షేమాలు చూసే పరమాత్మగా మీలోనే నిలిచి వుంటాను! మణికంఠునిగా నేను వచ్చిన కార్యం పూర్తయినందువల్ల నేను ఈ మానవ రూపాన్ని ఉపసంహరించి మీ అందరి క్షేమాన్ని కోరి మీతోనే మీ మధ్య వుండటానికి నా అర్చారూపాన్ని నాకు ప్రతిగా అనుగ్రహిస్తున్నాను!
రాజా! నా అర్చారూపానికి దేవాలయాన్ని నిర్మించవలసిన బాధ్యత నీపై వుంచుతున్నాను! నీ చేత నిర్మింపబడే ఆ దేవాలయంలో నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏ విధంగా పూజాది కార్యక్రమాలు నిర్వర్తించాలో తెలియజెప్పడానికి ఒక మహర్షి త్వరలోనే మీ దగ్గరకు రాగలడు!’’ అంటూ మేఘ గంభీర స్వరంతో చెబుతుంటే నిశ్శబ్దంగా విన్నవాళ్లంతా ఒక్కసారిగా ఉద్విగ్నులైనారు!
ప్రజలందరూ ‘‘రాకుమారా! మమ్మల్ని విడిచి వెళతావా? వద్దు అయ్యా! అంతటి కఠినత్వం చూపకు మా పట్ల! మా ప్రాణంలో ప్రాణానివి నీవు! నిన్ను ప్రత్యక్షంగా చూడలేకపోతే మా జీవితాలు వ్యర్థం! అప్పా, మణికంఠస్వామి! మా మొరాలకించు! మా మధ్యనుండి వెళ్లిపోవాలని అనుకోకు!’’ అంటూ వేడుకోసాగారు.
రాజశేఖరుని పరిస్థితి దయనీయంగా మారింది! మణికంఠుని చూడకుండా వుండటం సాధ్యంకాదు తనకు! వరపుత్రుడుగా లభించిన ఈ బంగారు కొండను నా నుండి వేరుగా భావించలేను! ఆపాలి! ఎలాగైనా నా కళ్లముందరే వుండేలా చూడాలి!’’ అనుకుంటూ మణికంఠుని చేయి గట్టిగా పట్టుకున్నాడు!
‘‘పుత్రా! అంత కఠినంగా మాట్లాడకు! నిన్ను, నీ మోహన రూపాన్ని చూడకుండా వుండటం మా వల్ల అవుతుందని ఎలా అనుకున్నావు! వద్దు పుత్రా వద్దు! నీ నిర్ణయాన్ని మార్చుకో! మమ్మల్ని అనాథలను చేసి వెళ్లిపోకు!’’ అన్నాడు రుద్ధమైన కంఠంతో!
మణికంఠుడు అందరి ప్రార్థనలు విన్నాడు! చెరగని చిరునవ్వు ముఖంతో నిర్వికారంగా చూస్తూ వాళ్లకు జ్ఞానోపదేశం చేశాడు!
‘‘రాజా! నామీద పుత్రుడనే వ్యామోహంతో నీవు, తమను సదా కాపాడుతుండే ధర్మపరులైన పాలకుడిగా ప్రజలు భావిస్తూనా వియోగాన్ని భరించలేకపోతున్నారు! నిజానికి ఇటువంటి బంధాలకు నేను అతీతుడిని!
నేను నాది అనే భావాలకు నాలో తావు లేదు! నేను గుణాతీతుడిని, బంధముక్తుడిని! అందుకే వ్యర్థంగా విచారానికి గురికాకండి! నాకూ, నా అర్చారూపానికి ఏ విధమైన భేదం లేదు! నా అర్చారూపాన్ని పూజించటంవల్ల నేను ప్రసన్నుడినై మీ సర్వాభీష్టాలు నెరవేరుస్తాను! రాజా! ఇలా చూడు! ఈ రాజభవనం నుండి నేను వదులుతున్న ఈ బాణం అక్కడ ఆ అరణ్య భాగంలో పడ్డ చోటు ఆలయ నిర్మాణం కావించి, నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆరాధించు! మీ అందరి వెంట ఎప్పుడూ నా ఆశీర్వాదాలు వెన్నంటే వుంటాయి!’’ అని చెప్పి బాణం వదిలి అంతర్థానం చెందాడు! రాజపరివారం, ప్రజలు కొంతసేపటి వరకు నోట మాటరాక అలాగే వుండిపోయారు.
***

-ఇంకాఉంది
...................................
రచనలు పంపవలసిన చిరునామా: ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక,
36, సరోజినీదేవి రోడ్, సికింద్రాబాద్-500 003

- డా. టి.కళ్యాణీసచ్చిదానందం