డైలీ సీరియల్

ట్విన్‌టవర్స్ 11

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డిగ్రీలు పెద్దవయినా, వయస్సు పెద్దది కాదు. ఈ రెండు రోజుల్లోనూ నేను నోటీసు చేసింది అతను, వాళ్లమ్మకు బాగా క్లోజ్.
వాళ్ళిద్దరిమధ్య ఒక ప్రత్యేకమైన బంధం ఉంది. ఆవిడకి కొడుకంటే చెప్పలేని ప్రేమ. చిన్నప్పుడు అతనికి జబ్బు చేసి, ఇక బ్రతకడని అనుకున్నారుట. బ్రతకాడంటే ఆవిడే కారణం అంటారు వాళ్ళ అమ్మావాళ్ళు. ఈ పెళ్లికూడా, తల్లి మాట కాదనలేక చేసుకున్నాడేమో కూడా!
‘కాఫీ తెచ్చాను’ అన్నాను.
ఉలిక్కిపడ్డట్టు నా వంక చూశాడు. చేతిలో ఉన్న ఫొటో జాగ్రత్తగా పెట్టెలో పెట్టేసి కాఫీ అందుకున్నాడు.
ఖాళీ గ్లాసు తిరిగి నాకిచ్చేస్తూ నా వంకచూశాడు పలకరింపుగా నవ్వుతూ! అప్పుడే ఆ రోజు నన్ను చూచినట్టు. అర్థంకానట్లు చూశాను. అతను సమాధానం చెప్పలేదు, నేను అడగలేదు.
ఆ రాత్రి మంచంమీద పడుకున్న అతను మాత్రం చాలా రెస్ట్‌లెస్‌గా ఉన్నాడు. ముందు రెండు రాత్రులలాగా కబుర్లు చెప్పలేదు. హాయిగా నన్ను గిలిగింతలు పెట్టేటట్లు నవ్వలేదు.
రెండు చేతులు మెడ కింద పెట్టుకుని పైన తిరిగే ఫ్యాన్ వంక చూస్తూ ఉండిపోయాడు. కొద్ది దూరంలో వేరే దిండు మీద తల ఉంచుకుని పడుకున్న నాకు ఏం చేయాలో అర్థం కాలేదు.
ప్రేమగా అతని ఛాతీమీద చెయ్యి వేసి పలకరించే చనువు రాలేదు. అసలు ఏం పలకరించాలో కూడా తెలియదు.
ఈ ముభావమంతా, మర్నాడు మధ్యాహ్నం విమానం ఎక్కవలసి వస్తుందన్న ఆలోచన మూలంగా కావచ్చు. అమెరికా వెడుతున్నానన్న సంతోషం ఎక్కువగానే ఉన్నా, అందరిని వదిలి వెళ్లాలన్న ఆలోచన బాగా బా
ధపెడుతున్నట్టు గా ఉన్నట్టుంది.
అతని పక్కనే ఓ అడుగు దూరంలో నేనున్నట్లు కూడా గమనిస్తున్నట్లు లేదు. నా మీదకు దృష్టి కూడా తిరగడంలేదు. చాలా రెస్ట్‌లెస్‌గా ఉన్నాడు. స్థిరత్వం లేని అతని కళ్ళు తరచుగా అటూ ఇటూ కదులుతున్న తీరు తెలుపుతోంది.
చటుక్కున లేచి కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూస్తూ నుంచుండిపోయాడు. పైజమా జేబుల్లో చేతులుంచుకుని, అటూ ఇటూ పచార్లు చేశాడు. కాసేపు గడిచాక, పక్కనే టేబుల్ మీద ఉన్న మంచినీళ్ళు తీసుకుని గడగడా తాగేశాడు.
ఒక్కసారి బలంగా శ్వాస వదిలి, తిరిగి మంచంమీదకు వచ్చి పడుకున్నాడు.
వత్తిగిలి పడుకుని అతని వంకే చూస్తున్న నా కన్నులు ఎప్పుడు మూతలు పడ్డాయో తెలియదు. ఎంతసేపు అలా నిద్రపోయానో కూడా తెలియదు.
ఎందుకో మెలకువ వచ్చి కన్నులు తెరిచాను. నిద్రమత్తులో ఒక్క క్షణం ఎక్కడున్ననో కూడా అర్థం కాలేదు. మళ్లీ కళ్ళు మూసుకున్నాను నిద్రలోకి జారిపోవాలని.
ముక్కుకు దగ్గరగా ఒక సున్నితమైన వాసన తగిలింది. అది గత రెండు రోజులుగా, అతనికి దగ్గరగా నిలుచుంటే తగిలిన యుడికలోన్ వాసన.
బరువుగా కళ్ళు తెరిచాను. అతను నా వంకే చూస్తున్నాడు. పక్కకు నా వైపుగా తిరిగి, మోచేతిమీదకు లేచి, చేతిని మొహానికి సపోర్టుగా ఉంచి. అతణ్ణి అంత దగ్గరగా ఆ విధంగా చూడటం అదే ప్రథమం. అతని కళ్ళు కొత్తగా చూస్తున్నాయి. ఒక విధమైన నిద్రమత్తు అతణ్ణి కూడా ఆవరిస్తున్నది.
నేను కళ్ళు తెరవడం చూచి చాలా మృదువుగా చిరునవ్వు నవ్వాడు. నా గుండె కొట్టుకోవడం మానేసిందేమో అనుకున్నాను.
రెండో చేత్తో నా కళ్ళ మీదకు పడుతున్న జుట్టును పక్కకు జరిపాడు. తన మొహం నా మొహం మీదకు వంచి కనురెప్పల మీద మృదువుగా తన పెదిమలను తాకించాడు.
చెయ్యి తీసేస్తే జారిపోయి మళ్లీ దొరకదేమో అన్నంత ఆర్తిగా దగ్గరకు లాక్కున్నాడు.
మర్నాడు ఉదయం మరో లోకంలో కన్ను తెరచినట్లయింది. గది నిండా వెలుగు ఆవరించుకుంది. పక్కన అతను ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు. అతని మొహం వంకే చూస్తూ కాసేపు పడుకున్నాను. ఎందుకో కొత్తగా కనిపిస్తున్నాడు. ఎప్పుడూ లేనంత దగ్గరగా కనిపిస్తున్నాడు. జీవితంలో ఎంతో కాలంగా ముడిపడిపోయినవాడిలా ఉన్నాడు.
లేచి బయటకు వచ్చేశాను. ఎందుకనో మనసంతా బరువుగా బాధగా ఏదో చెప్పలేని విధంగా ఉంది. యాంత్రికంగా, దైనందిన పనులు చేశాను. నిద్రలేని కన్నులు బరువుగా ఉన్నాయి. నిద్ర లేచిన మనసు బరువెక్కిపోతోంది.
తనకు పెళ్లి అయింది. భర్త ఉన్నాడు. మరి కొద్ది గంటల్లో దూర, దూరంగా చాలా దూరం వెళ్లిపోతాడు. మళ్లీ రెండేళ్ళ వరకు చూడటం కూడా జరగదు. ఈ భావన చాలా చిత్రమయిన అనుభూతిని కలిగిస్తోంది.
అది అతనిని విడిచి ఉండలేనన్న భావన కాదు. అతనంటే అంతులేని ప్రేమేదో ఉందన్న భావన కూడా కాదు. అవేవీ కావు. కాని అతనికి దూరమయిపోతున్నానన్న భావన. అతనితో కలిసి ఉంటే బాగుండునన్న భావన. అతను వెళ్లిపోకుండా ఉండిపోతే బాగుండునునన్న భావన. విడిచి వెళ్లిపోతే మళ్లీ చూడలేమోనన్న భావన.
నా మనసు ఏం కోరుకుంటోందో నాకే అర్థం కావడంలేదు. వారం రోజుల క్రితం అతనెవరో కూడా నాకు తెలియదు. ఈ రోజు తన జీవితమంతా ఆక్రమించాడు. మనసంతా నిండిపోయాడు. నాకెందుకో సంతృప్తిగా లేదు.
ఆ రోజం అందరిని గమనిస్తూనే ఉన్నాను. ఇంట్లో ఎవరూ సంతోషంగా కనిపించలేదు. అతని అమ్మ మొహం బాగా వాడిపోయింది. ఆవిడ కూడా రాత్రంతా నిద్రపోయినట్లు లేదు. ‘‘వాడన్ని సర్దుకున్నాడో, ఏవైనా బయట వదిలేశాడేమో చూడు’’ అని నన్ను పైకి పంపింది అతని తల్లి. అది కేవలం సాకు ఏమో అనిపించింది నాకు. అతను చాలా ఆర్గనైజ్డ్‌గా అనిపించాడు. ముఖ్యమైనవి ఏవీ అతను మరచిపోయే రకంగా అనిపించలేదు. కాని చాలాసేపటినుంచి పైకి అతని గదిలోకి వెళ్లాలనే ఉంది. క్రింద ఇంతమంది ఉండగా, తను పైకి వెడితే, ఎవరయినా ఏమయినా అనుకుంటారేమోనని నాకే కొంచెం జంకుగా ఉంది.

-ఇంకాఉంది

రమాదేవి చెరుకూరి