డైలీ సీరియల్

వ్యూహం-44

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆంధ్రప్రదేశ్‌లో వున్న ఆలయాలలో ఇది బహు ప్రాచీనమైనది.. ద్వాదశ జ్యోతిర్లింగాలలో పనె్నండవది. దక్ష ప్రజాపతి ఈ పవిత్ర స్థలంలో యజ్ఞం చేశాడని చెబుతారు.. అందుకే దీనికి ‘ద్రాక్షారామం’ అని పేరు వచ్చింది. దేవాలయ ప్రాకారాలు, గోపురం చాణుక్య భీముడు నిర్మించాడు. అందుకే లింగస్వరూపుడైన స్వామివారికి ‘్భమేశ్వర స్వామి’ అని పేరు వచ్చింది..’’ ఆలయ విశేషాలు చెప్పాడు పూజారి.
పనె్నండు అడుగుల ఎత్తు వున్న స్ఫటిక లింగానికి నమస్కరించారు సావేరి, నిశాంత్.
రెండవ అంతస్థుపైకి ఎక్కి స్వామివారికి అభిషేకాదులు కావించారు భక్తులు.
‘‘తొందరగా పూజలు ముగించుకుని బయటకు వెళ్ళవలసినదిగా భక్తులకు ప్రార్థన’’ అంటున్నారు ఆలయ నిర్వాహకులు.
‘‘ఏమిటి హడావుడి?’’ పూజారిని అడిగాడు నిశాంత్.
‘‘స్వామివారి దర్శనం కోసం గవర్నరుగారు సతీసమేతంగా వచ్చారు. ఆలయం బయట పోలీసుల హడావుడి కూడా ఎక్కువగానే వుంది’’ అన్నాడు పూజారి నిశాంత్ ఇచ్చిన దక్షిణ పుచ్చుకుంటూ.
ఆలయం వెలుపల చార్లెస్, అతని స్నేహితులిద్దరిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి సావేరికి, నిశాంత్‌కు తెలియదు.
* * *
కొబ్బరి తోటలు చూపించడానికి సావేరిని తీసుకువెళ్ళాడు నిశాంత్.
పట్టణంలో అక్కడో కొబ్బరి చెట్టు ఇక్కడో కొబ్బరి చెట్టు కనిపించేవి. అవి కూడా పెద్ద పెద్ద భవనాలు నిర్మాణంలో అడ్డొస్తున్నాయని నరికివేస్తున్నారు.
రోడ్డుకు అటు ఇటు కాలువలు. ఎటువైపు చూసినా వందలు, వేల సంఖ్యలో కొబ్బరిచెట్లు కన్పించాయి. పచ్చని తలపాగా పెట్టుకుని వేల సంఖ్యలో వరుసగా నిలబడ్డ జవానుల్లా కన్పించాయి.
కొబ్బరి తోటలో తిరిగే సమయంలోనే హఠాత్తుగా వాతావరణంలో మార్పు వచ్చేసింది. నల్లటి మేఘాలు ఆకాశాన్ని కమ్మేశాయి.
చింత చెట్టు కింద చేరుకున్నా ప్రయోజనం లేకపోయింది.
తడిసి ముద్దయిపోయారిద్దరూ.
అప్పటిదాకా ఆమె వొంటి సొంపులను జాగ్రత్తగా కాపాడిన సిల్క్ చీర వర్షంలో తడిసిపోయి ‘నీ అందాలు దాచడం నావల్ల కాదు!’ అంటూ వొంటికి అతుక్కుపోయింది.
‘‘ఏమిటా చూపులు?’’ అందామె కింది పెదవిని మెలికలు తిప్పి.
‘‘ఆకాశంలో ఏడు రంగుల హరివిల్లు కన్పించడంలేదు. నా ఎదురుగా ప్రత్యక్షమైంది’’ అన్నాడతను.
‘‘కార్లో కూర్చుందామా? బట్టలు తడిసి చలిపుడుతోంది’’ అందామె అతని మీదకు వొరిగిపోయి.
‘‘పట్టణాల్లో తిరిగే మనకు ఈ అనుభవం రాదు. రోడ్డుమీద మనం వెళ్ళేటప్పుడు వర్షం కురిస్తే డ్రైనేజీలు ఓవర్‌ఫ్లో అయ్యి మురుగువాసన చుట్టుముడుతుంది’’.
‘‘అమెరికాలో కూడా అంతేనా?’’
‘‘అమెరికాలో రోడ్డుమీద, పొలాల్లో నడిచే అవకాశం ఎక్కడుంటుంది.. ఇంట్లో నుంచి బయటపడితే కారు ఎక్కి తిరగడమే! చిన్న వస్తువు కావాలన్నా కారులో షాపింగ్‌మాల్‌కు వెళ్లి తెచ్చుకోవాల్సిందే!’
‘‘వర్షంలో తడుస్తూ ఎంతసేపు చెట్టుక్రింద నిలబడతాం?’’ అందామె.
‘‘దగ్గర్లో మా ఫామ్‌హౌస్ వుంది... అక్కడకు వెళ్దాం పద!’’ అన్నాడతను.
ఒకరి చెయ్యి మరొకరు పట్టుకుని పరుగులు తీశారు.
చిన్న చిన్న బురద గుంటల్లో కాలుపడి నీళ్ళు చిందినపుడు కేకలు పెట్టారు.. వర్షం జోరు ఎక్కువైనప్పుడు పెద్దగా నవ్వుకున్నారు. చలిగాలి గిలిగింతలు పెట్టినపుడు ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి ఆమెను దగ్గరగా లాక్కున్నాడు.
ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు.
తలుపు తట్టగానే వెంటనే తలుపు తీసింది సీతమ్మ.
‘‘రాములు లేడా?’’
‘‘కొబ్బరికాయల లారీ ఎక్కి కాకినాడ వెళ్ళాడు బాబూ! రాత్రికి తిరిగి వస్తాడు’’ అంది సీతమ్మ.
‘‘బంధువులు, అధికార్లు వచ్చినపుడు రెస్ట్ తీసుకోవడానికి మా నాన్న ఈ ఫామ్‌హౌస్ కట్టించాడు.. అన్ని సౌకర్యాలు వున్నాయి’’ అన్నాడతను.
‘‘బీరువాలో కొత్త టవలు, లుంగీలు ఉన్నాయి.. ఆ గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకోండి.. తడిసిన బట్టలు పిండేసి పొయ్యి దగ్గర ఆరేస్తాను.. అరగంటలో ఆరిపోతాయి’’ అందామె.
గదిలోకి వెళ్ళారు ఇద్దరూ.
‘‘చలికి వొణుకుతున్నావ్.. చీర విప్పేసి లుంగీ చుట్టుకో టవల్‌తో తల తుడుచుకుని భుజం నిండా కప్పుకో’’ అన్నాడు నిశాంత్ బట్టలు మార్చుకుంటూ.
ఆ గదిలో ఓ మూల ఫైర్ ప్లేస్ వుంది. సన్నటి కర్రముక్కలు తెచ్చి వెలిగించింది సీతమ్మ. వెదురు కుర్చీలు తెచ్చి ఆ మంట దగ్గర వేసింది.. బట్టలు మార్చుకునేటప్పుడు అతను తనను తినేసేటట్లు చూస్తాడేమోననుకుంది. అవకాశం దొరికిందని తనను అనుభవించే ప్రయత్నం చేస్తాడేమో!
అటువంటి ప్రయత్నాలు అతనేం చేయలేదు.
-- ఇంకాఉంది

అలపర్తి రామకృష్ణ