క్రీడాభూమి

మరో రెండు రోజులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తర్వాత సిరీస్ రద్దేనని బిసిసిఐకి తేల్చిచెప్పిన పిసిబి చీఫ్

కరాచీ, డిసెంబర్ 10: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌పై ఒక నిర్ణయం కోసం మరో రెండు రోజులు మాత్రమే ఎదురు చూస్తామని, ఆతర్వాత సిరీస్ రద్దయినట్టే భావిస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) అధ్యక్షుడు షహర్యార్ ఖాన్ స్పష్టం చేశాడు. భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) యుఎఇలో ఆడేందుకు నిరాకరించినా అంగీకరించామని, శ్రీలంకలో టూర్‌కు సిద్ధమయ్యామని గురువారం విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. తమ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ కూడా లభించిందని చెప్పాడు. బిసిసిఐ మాత్రం ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆందోళన కలిగిస్తున్నదని అన్నాడు. ఇంకెంత కాలమో ఎదురుచూసే పరిస్థితి లేదన్నాడు. ఇతరత్రా సిరీస్‌లలో పాక్ జట్టు పాల్గొనాల్సి ఉంది కాబట్టి, మరో రెండు రోజులు మాత్రమే భారత్ నిర్ణయం కోసం ఎదురుచూస్తామన్నాడు. ఆతర్వాత భారత్ సానుకూలంగా స్పందించినా, సిరీస్‌ను కొనసాగించే పరిస్థితి తమకు ఉందని వ్యాఖ్యానించాడు. సిరీస్‌పై గత ఏడాది ఒప్పందం కుదుర్చుకున్న బిసిసిఐ దానిని అమలు చేసేందుకు వెనుకాడుతున్నట్టు కనిపిస్తున్నదని విమర్శించాడు.
భారత్ మాతో ఆడదు!
భారత్ తమతో సిరీస్ ఆడుతుందని తాను అనుకోవడం లేదని షహర్యార్ ఖాన్ అన్నాడు. సిరీస్‌ను ఆడే ఉద్దేశం లేనందుకే తాత్సారం చేస్తున్నదన్న అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పాడు. సిరీస్‌పై ఇప్పటి వరకూ తమకు నమ్మకం ఉందని, అది సడలిపోకుండా చూడాల్సిన బాధ్యత బిసిసిఐదేనని అన్నాడు.
నిర్ణయాధికారం కేంద్రానిదే
న్యూఢిల్లీ: భారత్, పాక్ సిరీస్‌పై నిర్ణయాధికారం కేంద్రానిదేనని బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశాడు. శ్రీలంకలో పాక్‌తో సిరీస్ ఆడాలన్న ప్రతిపాదన ప్రస్తుతం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని గురువారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పాడు. పాక్ కారణంగా సరిహద్దులో అమాయకులు హతమవుతున్నందున ఈ సిరీస్‌కు కేంద్రం అనుమతిస్తుందన్న నమ్మకం తనకు లేదన్నాడు.