డైలీ సీరియల్

బడబాగ్ని 33

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాహుల్ దగ్గర నుంచి బయలుదేరిన అనే్వష్‌కి ఒకసారి లాయర్ భగవాన్ గారిని కలిసి తాము వెడుతున్న సంగతి చెప్పాలన్న ఆలోచన కలిగి అటు వెళ్ళేడు.
‘‘నమస్తే సార్’’ అన్న అనే్వష్ పిలుపుతో ఏదో ఫైల్ చూసుకుంటున్న ఆయన తలెత్తి చూసాడు.
‘‘ఆ రావోయ్ అనే్వష్.. ఏమిటీ వారం రోజులుగా అజాపజా లేవు, మీ ట్రైనింగ్ అయిపోయిందా, పోస్టింగ్స్ ఎక్కడా’’ అంటూ పలకరించేడు.
‘‘అవునూ.. మీ ఫ్రెండ్ కమల్, ఆ క్రైం రిపోర్టర్ చనిపోయాడట, పాపం చిన్నవాడు, అర్థాంతరంగా.. ప్చ్.. పేపర్లో చదివేను. అది ఏక్సిడెంటేనంటావా.. నాకెందుకో కాదేమో అనిపిస్తోంది.. ఉత్సాహం ఎక్కువ, ఏ కేసు ఎంక్వైరీ చెయ్యడానికో వెళ్లి, ఫినిష్ అయి ఉంటాడు..’’ ఆయన మాటల్లో ఉన్నది సానుభూతో.. వెటకారమో అర్థం కాలేదు అనే్వష్‌కి. వెంటనే ఆయన గురించి రాహుల్ అన్నమాటలే గుర్తువచ్చాయి.
‘‘మీ ఫ్రెండ్ ఎలా ఉన్నారు.. అందరికీ ఒక దగ్గరే పడ్డాయా ఆర్డర్స్?’’
‘‘లేదు సర్, నాకు కేరళా, అజిత్‌కి ఆంధ్రా, అరుణ్‌కి హిమాచల్‌ప్రదేశ్.. అందరం తలో చోట...’’ కొంచెం నిరుత్సాహంగా అన్నాడు.
‘‘ఉద్యోగాలంటే అంతే మరి. నాలా ‘లా’ ప్రాక్టీస్ అయితే ఎంచక్కా ఇంటి దగ్గరే...’’ నవ్వుతూ అన్నాడాయన.
‘‘కేసు లేదు ఏం లేదు సర్.. వాళ్ల అమ్మగారు చాలా దిగులు పడిపోయారు. అతనిని వెంటనే ఇక్కడనుంచి ఇంటికి వచ్చెయ్యమనీ, అక్కడ వేరే ఉద్యోగం చూసుకొమ్మని ఒకటే గొడవ పెట్టేరుట.. అతనూ యిక్కడ జాబ్ వదిలేసి వెళ్లిపోతున్నాడు సర్..’’
‘‘లేకపోతే.. తనది కాని పని తనకెందుకయ్యా? వాటిని చూడటానికి ఈ కోర్టు, లాయర్లు, పోలీసులూ ఉండగా, ఆ నేర పరిశోధన పని తనకెందుకు.. అయినా ఏ మాటకామాటే చెప్పుకోవాలి, మంచి షార్ప్ బ్రైన్.. ఆ తెలివీ, ఆ చురుకూ చక్కగా నా ‘లా’ కానీ మీలా పోలీస్ కాని అయితే బాగుండేది’’. ఆయనలో కనీ కనిపించకుండా అతనంటే అసూయ.. బహుశా కమల్ అంటే కూడా అందుకే పడదేమో.. చాలామంది అంతే. తమకంటే ఎవరైనా తెలివిగా ఆలోచిస్తున్నారంటే సహించలేరు.
కాసేపు మాట్లాడి, సెలవు తీసుకు హాస్టల్‌కి వచ్చేసాడు అనే్వష్.
అతను వచ్చేటప్పటికి అజిత్, అరుణ్.. ఇద్దరూ సాహూ సర్ రూంలో ఉన్నారని తెలిసి అనే్వష్ కూడా అక్కడికే వెళ్ళేడు.
ముగ్గురూ ఏవో కబుర్లు చెప్పుకుని నవ్వుకుంటున్నారు. అనే్వష్‌ని చూస్తూనే సాహూ ‘‘ఏమోయ్ అనే్వష్.. ఎంతవరకూ వచ్చింది నీ ఇనె్వస్టిగేషన్.. ఏమైనా ముందుకి కదిలిందా.. ఏమంటున్నాడు మీ రాహుల్, వాళ్ళ తమ్ముడి కంటే నీకే ఎక్కువ క్లోజ్ అయ్యేడే..’’ నవ్వుతూ అడిగేడు.
అందులో ఏమైనా నిగూఢత ఉందా ఆ మాటల్లో అని ఆలోచించిన అనే్వష్‌కి ఏ మాత్రం తేడా కనబడలేదు.. చాలా మామూలుగా అడిగినట్టే అనిపించింది.
‘‘ఏం కేస్‌లెండి సర్, వాళ్ల మదర్ గోల పడలేక చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఇక్కడ నుండి వాళ్ళ ఊరు వెళ్లిపోతున్నాడు’’ మెల్లిగా చెప్పాడు.
ఒక్క క్షణం అపనమ్మకంగా చూసి.. వెంటనే చిరునవ్వుతో విచ్చుకున్నాయి సాహూ పెదవులు..
‘‘సరే.. మేం రేపు వెళ్లిపోతున్నాం, మళ్లీ ఎప్పటికి కలుస్తామో, ఈ ట్రైనింగ్ అంతా ఎంతో బాగా జరిగింది, ఆఖరిలో పీడకలలా ఈ గొడవ తప్ప.. ఏదైతేనేం ఆఖరికి సుఖాంతమైంది.. కానీ అమర్.. ప్చ్.. వాడు కూడా ఉండి ఉంటే ఎంత బాగుండేదో..’’ యధాలాపంగా అన్నట్టు అన్నాడు అనే్వష్.
‘‘అతనికి అలా రాసిపెట్టి ఉంది.. ఏం చేస్తాం.. అదంతా మర్చిపోండి.. మీ మీ ఉద్యోగాలమీద పూర్తి ధ్యాస పెట్టి చక్కగా చేసుకోండి.. ఇంక వెళ్లిరండి...
‘‘వస్తాం సర్, ఎప్పుడైనా ఏదైనా సలహ కావలిస్తే మీకు రింగ్ చేస్తాం.. టచ్‌లో ఉంటాం.. ఉంటాం సార్.. నమస్తే’’ లేచారు ముగ్గురూ.
‘‘.. గదిలో అన్ని సామాన్లూ ఎవరి సామాను వారివి సర్దుకున్న వాళ్ళు, అమర్ తల్లిదండ్రులు అతని సామాను అక్కడే వదిలేసి ఎవరికైనా ఇచ్చేయమన్న సంగతి గుర్తొచ్చి అతని బట్టలు, వస్తువులు అన్నీ అక్కడి వాచ్‌మెన్‌కి యిచ్చేశారు.. మర్నాడు తెల్లవారు జామే ముగ్గురూ ప్రయాణమైపోయారు.
కొన్ని గంటల వ్యవధిలో ఎవరి గమ్యస్థానాలకి వాళ్లు బయలుదేరారు. రాహుల్, అజిత్ జీవితంలో మొట్టమొదిసారి కలసి ప్రయాణం చేశారు.. ముందు ఇంటికివెళ్లి తరువాత ఎవరి ఉద్యోగాలకు వాళ్లు వెళ్లిపోయారు.
***
రాహుల్ హోటల్ తాజ్‌లో ఆ రోజు కమల్ దిగిన గదిలో దిగాడు.. ఏదైనా క్లూ దొరుకుతుందేమో అనే ఆశతో.
అక్కడ పనిచేసే రూం బాయ్‌తో మాట కలిపాడు.
‘‘అవునూ మొన్నామధ్య పేపర్లో చదివాను, ఇక్కడ మీ హోటల్ గది బాల్కనీ నుంచి పడిపోయి ఒకతను చనిపోయాడటగా, ఎవరో పాపం, అయినా అలా ఎలా పడిపోయాడు.. ఎవరైనా తోసేసారా?’’
‘‘లేదు సార్.. అతనే నిద్రమత్తులో బాల్కనీ నుంచి జారిపోయాడు..’’ చెప్పాడు ఆ రూంబాయ్ కరీం.

-ఇంకాఉంది

- మీనాక్షి శ్రీనివాస్