జాతీయ వార్తలు

కాశ్మీర్ సర్వీస్ సెలక్షన్ బోర్డు పరీక్షలో అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు సెంటర్లలో పరీక్ష రద్దు
శ్రీనగర్, డిసెంబర్ 26: జమ్మూ, కాశ్మీర్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు (జెకెఎస్‌ఎస్‌బి) శుక్రవారం నిర్వహించిన పరీక్షలో పెద్ద ఎత్తున అక్రమాలు, మాస్ కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలతో అభ్యర్థులు గొడవకు దిగడంతో నిర్వాహకులు జమ్మూ ప్రాంతంలోని రెండు సెంటర్లలో పరీక్షను రద్దు చేసారు. 2014, 2015 సంవత్సరాలకు గాను వివిధ శాఖలు నివేదించిన వివిధ కేటగిరీల గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టులకోసం బోర్డు ఈ పరీక్షను నిర్వహించింది. కాశ్మీర్ లోయలోని శ్రీనగర్, అనంత్‌నాగ్, పుల్వామా, గందేర్‌బల్, బుద్గామ్ జిల్లాల్లోని అనేక ప్రాంతాలనుంచి ఈ పరీక్షలో పెద్దఎత్తున మోసాలు, ఇన్విజిలేటర్లు అభ్యర్థులకు సాయం చేసారన్న ఆరోపణలు అందాయి. ఆరుబయట అభ్యర్థులు గుంపులు గుంపులుగా పరీక్ష రాస్తున్న, పరీక్ష హాలులో మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్న దృశ్యాలు సామాజిక నెట్‌వర్క్ సైట్లలో దర్శనమిచ్చాయి. జమ్మూ ప్రాంతంలోని రెండు సెంటర్ల వద్ద అభ్యర్థులు గొడవ చేయడంతో ఆ సెంటర్లలో పరీక్ష రద్దు చేసినట్లు బోర్డు కార్యదర్శి షబీర్ అహ్మద్ రైనా చెప్పారు. ఫిర్యాదులను బోర్డు పరిశీలిస్తుందని, ప్రభుత్వం కోరితే తిరిగి పరీక్ష నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. అభ్యర్థులను చెక్ చేయలేదని, సరయిన పద్ధతి పాటించకుండా ఆన్సర్ షీట్లు ఇచ్చారని చాలామంది అభ్యర్థులు ఆరోపించారు. పలుకుబడి కలిగిన కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు పరీక్ష హాళ్లకు వెలుపల ఆన్సర్‌షీట్లు ఇచ్చారని, వారికి ఇంటర్‌నెట్ సహా అన్ని సదుపాయాలు కల్పించారని మరికొందరు ఆరోపించారు. స్వయంగా ఇన్విజిలేటర్లే అభ్యర్థులకు సహకరించారని గందేర్‌బల్‌కు చెందిన ఓ అభ్యర్థి ఆరోపించారు. ఈ పరీక్షకోసం 89,457 మంది దరఖాస్తు చేసుకోగా, శుక్రవారం 58,548 మంది పరీక్ష రాసారు.