రాష్ట్రీయం

సెట్ టాప్ బాక్స్‌ల ఏర్పాటుకు మరో 2 నెలల గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 31: ఆంధ్రప్రదేశ్‌లో సెట్ టాప్ బాక్స్‌లను అమర్చేందుకు మరో రెండు నెలల గడువును పొడిగిస్తూ హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ అనుసరించి సంబంధించిన అధికారులు ఎటువంటి చర్యలను తీసుకోరాదని హైకోర్టు పేర్కొంది. ఈ ఆదేశాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కార్ జారీ చేశారు. కేంద్రం ఈవిషయమై కౌంటర్ అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ కేసు విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేశారు.

‘ఉపాధి హామీ’పై ఇక స్థానిక కమిటీల పర్యవేక్షణ
హైదరాబాద్, డిసెంబర్ 31 : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆంధ్రప్రదేశ్‌లో సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం గ్రామపంచాయతీ స్థాయిలో విజిలెన్స్, మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసేందుకు వీలుగా గురువారం జీఓ జారీ చేశారు. ఈ కమిటీలో జన్మభూమి కమిటీ నుండి ఆరుగురు, విజిలెన్స్ ఆర్గనైజేషన్ నుండి ఒక ప్రతినిధి, శ్రమ శక్తి సంఘాల ఫెడరేషన్ నుండి ఇద్దరిని సభ్యులుగా నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పంచాయితీరాజ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ పేరుతో ఉత్తర్వులు వెలువడ్డాయి.

విలీన మండలాల్లో రెవెన్యూ పోస్టుల భర్తీ
హైదరాబాద్, డిసెంబర్ 31: రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లో రెవెన్యూ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. గ్రామ రెవెన్యూ అధికారి (విఆర్‌ఓ), గ్రామ రెవెన్యూ సహాయకుడు (విఆర్‌ఎ) పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా డిఎస్‌సి (డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటి) చేపట్టేందుకు కలెక్టర్లకు అధికారాలను ఇచ్చారు. ఈ మేరకు ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ హేమ మునివెంకటప్ప పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.