రాష్ట్రీయం

ఆ ఏడుగురు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
నేడు మరో ఐదుగురి పేర్లు ప్రకటన
ఇంకా తేలని విపక్షాల అభ్యర్థులు

హైదరాబాద్, డిసెంబర్ 6: రాష్ట్రంలో పనె్నండు శాసన మండలి స్థానాలకు అభ్యర్థుల తొలి జాబితాను తెరాస ఆదివారం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 12 స్థానాలుండగా, ఇప్పటికి ఏడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. అభ్యర్థులను ఖరారుకు సిఎం కెసిఆర్ ఆదివారం పార్టీ నాయకులతో చర్చించారు. ఖరారైన అభ్యర్థుల పేర్లను రాజ్యసభ సభ్యులు కె కేశవరావు అధికారికంగా ప్రకటించారు. మధ్యాహ్నాం ఒక జాబితా, సాయంత్రం మరో జాబితాను విడుదల చేయడం గమనార్హం. ఇప్పటి వరకు ఏడుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించగా, మిగిలిన జాబితాపై ముఖ్యమంత్రి కసరత్తు సాగిస్తున్నారని, సోమవారం ప్రకటించనున్నట్టు కేశవరావు తెలిపారు. స్థానిక సంస్థల కోటాలో శాసన మండలిలో 12 స్థానాలకు పోటీ జరుగుతోంది. మెదక్ నియోజక వర్గానికి భూపాల్‌రెడ్డి పేరు ఖరారైంది. ఆదిలాబాద్‌కు పురాణం సతీష్, ఖమ్మానికి బాలసాని లక్ష్మీనారాయణ, నిజామాబాద్ నియోజక వర్గానికి భూపతిరెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. కరీంనగర్‌లో రెండు నియోజక వర్గాలుండగా, భానుప్రసాద్, నారదాసు లక్ష్మణరావు పేర్లు ప్రకటించారు. నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి పేరును తొలుత ప్రకటించారు. ఇంకా ఐదుగురు అభ్యర్థుల పేర్లు ప్రకటించాలి. ఏడుగురు అభ్యర్థుల్లో భూపాల్‌రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా అనుభవం ఉంది. అదేవిధంగా కరీంనగర్‌లో ఇద్దరు అభ్యర్థులు కూడా గతంలో శాసన మండలి సభ్యులే. భానుప్రసాద్, నారపదాసు ఎమ్మెల్సీలుగా బాధ్యతలు నిర్వహించారు. ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న బాలసాని లక్ష్మీనారయణ సైతం తెదేపాలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావుతోపాటు తెరాసలో చేరారు. ఆదిలాబాద్ నుంచి పోటీ చేస్తున్న పురాణం సతీష్, నిజామాబాద్ భూపతిరెడ్డి మాత్రమే తొలిసారిగా మండలికి పోటీ చేస్తున్నారు. తేరా చిన్నపరెడ్డి గత ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. తెదేపా, కాంగ్రెస్ పార్టీల నుంచి తెరాసలోకి వచ్చినప్పుడు ఇచ్చిన హామీ మేరకు అభ్యర్థులకు తిరిగి అవకాశం కల్పించారు. ముందు ఊహించినట్టుగానే అభ్యర్థులకు టికెట్లు దక్కాయి.
మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు నియోజక వర్గాలు, రంగారెడ్డి జిల్లాలోని రెండు నియోజక వర్గాలు, వరంగల్‌లోని ఒక నియోజక వర్గానికి అభ్యర్థులను ప్రకటించాలి. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఉంటుందని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వరంగల్ నుంచి బిసిగా రాజయ్య యాదవ్, పెద్ది సుదర్శన్‌రెడ్డిలప పేర్లు ప్రధానంగా పరిశీలిస్తున్నారు. అయితే బీసీ కోటా కింద రాజయ్య యాదవ్ పేరు ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెరాస అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్, తెదేపాలు మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థులపై ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. ఖమ్మం నుంచి సిపిఐ అభ్యర్థిగా పువ్వాడ నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ మద్దతుతో పువ్వాడ పోటీ చేస్తున్నారు. సిపిఎం సైతం మద్దతు ప్రకటించింది. ఏ నియోజక వర్గంలోనూ పోటీ చేసేంత బలం లేకపోవడంతో బిజెపి పోటీ చేయడం లేదు. అన్ని స్థానాలు తెదేపాకే వదిలిపెట్టింది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో విజయం సాధిస్తామని తెదేపా చెబుతోంది. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై కాంగ్రెస్ ఆశలు పెట్టుకొంది. తెరాస మాత్రం మొత్తం 12 స్థానాల్లో విజయం సాధిస్తామని బలంగా చెబుతోంది.