తెలంగాణ

ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ పనుల కోసం పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

21న కామారెడ్డిలో అఖిలపక్ష సమావేశం : షబ్బీర్‌అలీ వెల్లడి

నిజామాబాద్, డిసెంబర్ 19: ప్రాణహిత - చేవెళ్ల పథకానికి సంబంధించిన 22వ ప్యాకేజీ పనుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని శాసన మండలి విపక్ష నేత మహ్మద్ షబ్బీర్‌అలీ తెలిపారు. ఆందోళన కార్యక్రమాలను రూపొందించుకునేందుకు వీలుగా ఈ నెల 21వ తేదీన కామారెడ్డిలో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. శనివారం జిల్లా కాంగ్రెస్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో షబ్బీర్‌అలీ మాట్లాడుతూ, తెలంగాణను సస్యశ్యామలంగా మార్చే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో తెరాస ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతూ, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ పథకం ద్వారా జిల్లాలో 20, 21, 22వ ప్యాకేజీల కింద పనులు చేపట్టి 3.04లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి పనులను చేపడితే, తెరాస అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులను నిలిపివేయించిందన్నారు. ప్రాణహిత పథకం డిజైన్లలో మార్పులు అనివార్యమని పేర్కొంటూ కాళేశ్వరం పథకాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. దీనిని నిరసిస్తూ ఇదివరకే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రెండు పర్యాయాలు పాదయాత్ర చేపట్టి నిరసన తెలియజేశామని అన్నారు. ఫలితంగా ప్రభుత్వం దిగివచ్చి 20, 21వ ప్యాకేజీ పనులను యథాతథంగా చేపట్టేందుకు అనుమతించిందని, అయితే ఇదే జిల్లాలోని 22వ ప్యాకేజీ పనులకు మాత్రం ఆమోదముద్ర వేయకపోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వాస్తవానికి ఎలాంటి సాగునీటి వసతి లేని కామారెడ్డి డివిజన్ పరిధిలో గల ఆరు మండలాలతో పాటు మెదక్ జిల్లాలోని రామాయంపేట మండలానికి 22వ ప్యాకేజీ ద్వారానే ఎంతో ప్రయోజనం చేకూరుతుందని షబ్బీర్‌అలీ పేర్కొన్నారు. ఈ ఒక్క ప్యాకేజీ కిందనే లక్షా 60వేల ఎకరాలకు సాగు జలాలు అందే అవకాశం ఉంటుందన్నారు. భూంపల్లి చెరువు నుండి కేవలం 20కిలోమీటర్ల వరకు కాల్వల తవ్వకాలు చేపట్టి 22వ ప్యాకేజీ పనులను పూర్తి చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఈ ప్యాకేజీని అనుమతించకపోవడం శోచనీయమన్నారు.