జాతీయ వార్తలు

షాబుద్దీన్ బెయిల్‌ రద్దు చేయాలంటూ సుప్రీంలో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ మాజీ ఎంపీ షహబుద్దీన్‌కు పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని బీహార్‌లోని నితీష్ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. శివన్‌కు చెందిన చంద్రకేశ్వర్ ప్రసాద్ అనే వ్యక్తి కూడా తన ముగ్గురు కుమారులను షాబుద్దీన్ హత్య చేశారంటూ శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం విశేషం. హత్య కేసులో యావజ్జీవ జైలుశిక్ష పడి పదకొండేళ్లుగా జైలులో ఉన్న షహబుద్దీన్‌కు పాట్నా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుంచి విడుదలయ్యారు. బెయిల్‌పై విడుదలైన షాబుద్దీన్ లాలూనే తమ నాయకుడని, అనివార్య పరిస్థితుల్లోనే నితీష్ సీఎం అయ్యారంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే షాబుద్దీన్‌కు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ నితీష్ సర్కార్ పిటిషన్ వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.