తెలంగాణ

ప్రియాంకరెడ్డి హత్యపై వెల్లువెత్తిన నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్యోదంతంపై నిరసనలు వెల్లువెత్తాయి. షాద్ నగర్ పోలీసు స్టేషన్ ఎదుట ప్రజాసంఘాలు ఆందోళన నిర్వహించాయి. మహిళలు, స్థానికులు సైతం ఈ ఆందోళనలో పాల్గొన్నారు. నిందితులను ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు. పోలీసు స్టేషన్ ఎదుట ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తటంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. శంషాబాద్ కళాశాల, పాఠశాలల విద్యార్థులు సైతం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి పోలీసు స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి నిందితులను కఠినంగా శిక్షించాలని నినదించారు. తెలుగు రాష్ట్రాల్లోని మహిళా, ప్రజాసంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. నిందితులను ఉరితియ్యాలంటూ పెద్ద ఎత్తున ర్యాలీలు, ధర్నాలు చేపట్టాయి. ఇదిలా ఉంటే నిందితులకు న్యాయసహాయం చేయబోమని జిల్లా బార్ కౌన్సిల్ ప్రకటించింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తామని తెలిపింది.