మహబూబ్‌నగర్

హరహర మహదేవ శంభో శంకర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఐదవశక్తి పీఠం, ఉమామహేశ్వరంలో మార్మోగిన శివనామస్మరణ
మహబూబ్‌నగర్, మార్చి 7: హరహర మహదేవ శంభో శంకర... ఓం నమః శివాయ అనే నామస్మరణం మారుమోగింది. శివనామస్మరణం సకాల పాపాలకు హరణం అని భక్తుల నమ్మకం ఉండడంతో ఎటుచూసిన శివనామస్మరణమే వినిపించింది. మహశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలో శివరాత్రి వేడుకలు కన్నుల పండువగా, వైభవంగా, భక్తిశ్రద్దలతో కొనసాగాయి. అర్ధరాత్రి నుండే శివాలయాల దగ్గరకు భక్తులు చేరుకోవడంతో తెల్లవారుజాము నుండే శివలింగాలను దర్శించుకుని భక్తులు అభిషేకాలు చేస్తూ మహశివరాత్రి వేడుకలను భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. మహశివరాత్రి సందర్భంగా జిల్లాలోని పుణ్యక్షేత్రాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. ముఖ్యంగా దక్షిణకాశీగా పిలువబడే ఐదవశక్తిపీఠం జోగులాంబదేవి, బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో శివరాత్రి వేడుకలు కన్నుల పండువగా కొనసాగాయి. తుంగభధ్రనదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు జోగులాంబదేవిని బాలభ్రహ్మేశ్వరస్వామిని దర్శించుకున్నారు. బాలబ్రహ్మేశ్వరస్వామి కళ్యాణోత్సవం కమనీయంగా కొనసాగింది. ఐదవశక్తి పీఠానికి భక్తులు పొటెత్తడంతో నవబ్రహ్మదుల దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బీచుపల్లి అంజనేయస్వామి ఆలయంలో గల శివాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని వందలాది శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఐదవశక్తిపీఠం అలంపూర్‌కు తూర్పుదిక్కున, ఆరవ శక్తిపీఠం శ్రీశైలానికి ఉత్తరదిశన వెలసిన ఉమామహేశ్వరుడి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అటవీ ప్రాంతంలోని కొండల మధ్య వెలసిన ఉమామహేశ్వరుడి దర్శనంతో పాటు పాలధార పంచదార దగ్గర వస్తున్న జలపాతంలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న లక్షలాది మంది భక్తులు ఉమామహేశ్వరంలోని ఉమామహేశ్వరుడిని దర్శించుకోవడానికి రావడంతో ఆ ప్రాంతమంతా శివనామస్మరణతో మారుమోగింది. దట్టమైన అటవీ ప్రాంతం లోతట్టు నల్లమల అటవీ ప్రాంతంలో వేలసిన మల్లెలతీర్థంలోని శివలింగం దర్శనం కోసం భక్తులు కిలో మీటర్ల మేర కాలినడకన నడిచివచ్చి లోయలో జలపాతంలో వెలసిన సాక్షాత్తు పరమేశ్వరుడిని భక్తులు దర్శించుకున్నారు. జలపాతంలో ఉన్న శివలింగంపై పడుతున్న నీటిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి తరించిపోచారు. అంతేకాకుండా రామేశ్వరంలో కూడా వేలాది మంది భక్తులు శివలింగానికి మారేడు, బిల్వ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామగ్రామాన శైవక్షేత్రాలు శివనామస్మరణతో మారుమోగాయి. 41రోజులు పవిత్రమైన శివమాలలు దరించి శివదీక్ష తీసుకున్న భక్తులు సోమవారం తెల్లవారుజాము నుండే శ్రీశైలానికి బయలుదేరారు. ముఖ్యంగా శ్రీశైలానికి వెళ్లే జిల్లాలోని ప్రతి రహదారి శివనామస్మరణతో భక్తులే కనిపించారు. రోడ్ల వెంట వెళ్తున్న స్వాములకు నల్లమల అటవీ ప్రాంతంలో వివిధ స్వచ్చంధ సంస్థలతో పాటు పోలీసులు, దేవదాయశాఖ ఆధ్వర్యంలో పలు సౌకర్యాలను కల్పించారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లోని పెద్ద శివాలయానికి ఉదయం నుండే భక్తులు పొటేత్తారు. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ పెద్ద శివాలయంలో గల శివలింగానికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా ఏనుగొండ సమీపంలోని గుట్టపై వెలసిన సాంబశివుడి శివాలయంలోని శివలింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వామివారి కళ్యాణోత్సవం దర్మకర్త వెంకటయ్య ఆధ్వర్యంలో కన్నుల పండువగా కొనసాగింది. గుట్టపై నుండి కింది వరకు మండుటెండల్లో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా చిన్నపెద్ద తేడా లేకుండా ఉపవాసదీక్షలు చేపట్టారు.జిల్లాలో మహాశివరాత్రి వేడుకలు భక్తిశ్రద్దలతో వైభవంగా కొనసాగాయి.

శివనామస్మరణతో మార్మోగిన రామేశ్వరం
షాద్‌నగర్: హర హర మహాదేవ..శంభో శంకర అంటూ రామేశ్వరం దేవాలయంలో భక్తులతో శివనామస్మరణ మారుమ్రోగింది.. ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని రాయికల్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం సంధర్భంగా నిర్వహించే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎటు చూసినా భక్తులతో దేవాలయ ప్రాంగణం కిటకిటలాడిపోయింది. మహా శివరాత్రి మరుసటి రోజు సాగే జాతరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలే కాకుండా షాద్‌నగర్ ప్రాంతం నుండి అధిక సంఖ్యలో తరలివెళ్లి ముందుగా శివపార్వతులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆనంతరం జాతర కార్యక్రమంలో నిమగ్నమవుతారు. చిన్న..పెద్ద అనే తారమత్యం లేకుండా కుటుంబ సమేతంగా దేవాలయానికి వెళ్లడంతో పాటు జాతరలో నెలకొల్పిన షాపుల్లో వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. చిన్నారులను అలరించేందుకు గాను రంగులరాట్నం సైతం ఏర్పాటు చేశారు. దేవాలయానికి వెళ్లే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా షాద్‌నగర్ ఆర్టీసి డిపో మేనేజర్ ప్రత్యేకంగా బస్సులను నడిపిస్తున్నారు. రామలింగేశ్వర స్వామి వారి జాతరను తిలకించేందుకు భక్తులు ఎంతగానో ఉత్సాహం కనబరుస్తున్నారు. ప్రైవేట్ వాహనాలలో తెల్లవారుజామునే రామేశ్వరానికి చేరుకుని కుటుంబ సమేతంగా కోనేటిలో స్నానం చేసుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో భక్తులు కొనుగోళ్లు చేశారు. భక్తుల సందర్శనాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏది ఎమైనప్పటికి శ్రీ ఉత్తర రామలింగేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో జాతరను ఘనంగా జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా మహబూబ్‌నగర్ ఆర్డీవో హన్మంత్‌రెడ్డి దంపతులు, డిఆర్‌వో భాస్కర్ దంపతులతోపాటు తహశీల్దార్ రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే సినీ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకున్నారు.
ఆరు వందల సంవత్సరాల నాటి
శివాలయాల్లో ప్రత్యేక పూజలు
నారాయణపేట: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం నారాయణపేట డివిజన్‌లోని శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కాగా డివిజన్ కేంద్రంలో వెలసిన ఆరు వందల సంవత్సరాల నాటి శివాలయాల్లో భక్తులు శివలింగాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం వేకువజామునే భక్తులు తలంట్లు పోసుకుని శివాలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరుడు, నందికి బిల్వార్చన, రుద్రాభిషేకం వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆరు వందల సంవత్సరం క్రితం నిర్మించిన బారంబావి శివాలయం, లింగయ్య దేవాలయం, తీర్థంబావి, మార్కండేయ దేవాలయం, నాగరేశ్వరదేవాలయం, బసవేశ్వరదేవాలయం, నారాయణ దేవాలయం, నీలకంఠేశ్వర దేవాలయం, శివాజీనగర్, మడి ఏరియాల్లో గల ఈశ్వర్ మందిర్ శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాసదీక్షలను చేపట్టారు. దాంతోపాటు లోకపల్లి సంస్థానంలో గల ఔదుంబరేశ్వర స్వామి దేవాలయంలో పట్టణానికి చెందిన భక్తులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని దర్శించుకుని ఉపవాస దీక్షలను చేపట్టారు. వ శివాలయాల్లో భజనలు, కీర్తనలతో భక్తులు మహా శివరాత్రి జాగరణ చేసేందుకు అన్నీ ఏర్పాట్లు చేశారు. కాగా బారంబావి శివాలయం, గాంధీనగర్‌లో గల లింగయ్యస్వామి దేవాలయాల వద్ద జాతర మహోత్సవాలను పురస్కరించుకుని రెట్టపట్ల పోటీలను నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. అనంతరం ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఉత్సవ కమిటీలు మంగళవారం బహుమతులను అందించనున్నారు. సోమవారం రాత్రి జాగరణ అనంతరం మంగళవారం ఉదయం అన్ని శివాలయాల్లో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను చేపట్టేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తితో ఉపవాస దీక్షలు చేపట్టంతో నారాయణపేటలోని పండ్ల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడాయి. అయితే వినియోగదారుల ఆసక్తి మేరకు పండ్ల వ్యాపారులు అధిక ధరలకు పండ్లను విక్రయించి తమ హస్తలాఘవాన్ని చాటుకున్నారు. అయినా తప్పని పరిస్థితుల్లో వినియోగదారులు పండ్లను కొనుగోలు చేశారు.
పులకించిన దక్షిణకాశి ఆలయాలు
అలంపూర్: నవబ్రహ్మాలయాల దివ్యదామం, అష్టాదశ శక్తిపీఠాలలో 5వ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబదేవి ఆలయాలు భక్తులు చేసిన శివనామస్మరణతో పులకించి పోయాయి. మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు అంబరాన్నంటేలా జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో సోమవారం ఉదయం 5.30గంటల నుంచి భక్తులచే అభిషేకాలు, నిత్యపూజా హోమాలు, రుద్రహోమాలు, సాయంత్రం నిత్యపూజా హోమాలు, బలిహరణలు, రాత్రి 9.30గం.కు మహన్యాస, ఏకాదశ రుద్రపారాయణం, లింగోద్భవ సమయంలో లఘు అభిషేకము (యామపూజ)లు కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన శ్రీ జోగులాంబదేవి, అతిపురాతనమైన శైవక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తి తరలిరావడంతో ఆలయాలు కిక్కిరిసాయి. బాలబ్రహ్మ కుమార అర్క వీర విశ్వచ్చతారక గరుడ స్వర్గ పద్మర్శ నవబ్రహ్మ ప్రకోపితహః అలంపూర్ క్షేత్రం నవబ్రహ్మాలయాల దివ్యదామంగా పిలవబడుతుంది. బాల, కుమార, అర్క, వీర, విశ్వ, గరుడ, తారక, స్వర్గా, పద్మబ్రహ్మాలయాలు ఇక్కడ 7వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం మధ్యకాలంలో చాళక్యులు నిర్మింప చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు నవబ్రహ్మాలయాలలోని బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను దర్శించుకునేందుకు భక్తులు ఉదయం 6గంటల నుంచి వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలుగకుండా తగు చర్యలను ఇఓ గురురాజ చేపట్టారు. ఆలయ పరిసరాల్లో భక్తుల కొరకు వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. భక్తులు ఉదయం నుంచే తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిఎస్‌పి బాలకోటి పర్యవేక్షణలో సిఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్‌ఐ పర్వతాలు బందోబస్తు నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పట్టణంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో శివజ్యోతికి ప్రత్యేకపూజలు నిర్వహించి వందలాది మహిళలు జ్యోతులను తీసుకొని మేళతాళాలు, నందికోళ్ల సేవల మద్య బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయంకు చేరుకొని శివస్వాములు శివజ్యోతిని ఆకాశంలోకి వదిలారు. రాత్రి 12గంటల సమయంలో శివజ్యోతి కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. జాగరణ చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసాయి. భక్తులకు ఉదయం నుంచి అల్పాహార విందును ఆర్యవైశ్య సంఘం నాయకులు ఏర్పాటు చేశారు. దక్షిణకాశి శ్రీ జోగుళాంబదేవి బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాలను సోమవారం కర్ణాటక హైకోర్టు జడ్జి మోహనశాంతనగౌడార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వరస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ సిబ్బంది చంద్రయ్యచారి శేషవస్త్రాలతో సత్కరించి ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. వీరితో పాటు కర్నూల్ జిల్లా జడ్జి సుమలత, కర్నూల్ ప్రోటోకాల్ జడ్జి రాజు, స్థానిక కోర్టు సబ్బంది చిన్నరాజు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు తదితరులున్నారు. అలాగే నాగర్‌కర్నూల్ మాజీ పార్లమెంటు సభ్యులు మందజగన్నాథం ఆలయాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్వాల ఆర్డీఓ అబ్దుల్‌హమీద్, అలంపూర్ తహశీల్దార్ మంజుల హాజరయ్యారు.
ఘనంగా మహాశివరాత్రి
నాగర్‌కర్నూల్: పట్టణంలోని శివాలయాలు భక్తుల కోలాహలంతో కిటకిటలాడాయి. సోమవారం తెల్లవారుజాము నుండే భక్తులు శివాలయాలలో ఏకాదశ అభిషేకాలు నిర్వహించారు. శివునికి ఇష్టమైన వారమైన సోమవారం మహాశివరాత్రి రావడంతో భక్తులు ఎంతో భక్తిశ్రద్దలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని భీమారంలోని శివాలయంతోపాటు పట్టణంలోని అన్ని దేవాలయాలలో భక్తుల రద్దీ అధికంగా కన్పించింది. పట్టణంలోని మార్కెట్‌యార్డులో ఉన్న శివాలయంలోను, షిర్డిసాయి మందిరం ఆవరణలో ఉన్న శివాలయం, మార్కెండేయాలయంలో మహాశివునికి అభిషేకాలు, బిల్వార్చన, తామలపత్ర పూజలు నిర్వహించారు. మండలంలోని ఎండబెట్ల గ్రామంలోని భీమారం శివాలయంలో వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. మార్కండేయ ఆలయంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యసాయి మందిరంలో సాయిభక్తులు ఎలిమె ఈశ్వరయ్య ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. ఆయా దేవాలయాలలో ఉపవాసం ఉండి, జాగరణ చేసేవారికోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. భజనతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. మార్కెట్‌యార్డులోని శివాలయంలో ప్రత్యేక పూజలను ఆలయ పూజారి సురేశ్‌శర్మ ఆధ్వర్యంలో రుద్రాభిషేకం నిర్వహించగా టిఆర్‌ఎస్ రాష్ట్ర మాజి కార్యదర్శి జక్కా రఘునందన్‌రెడ్డితోపాటు దేవాలయం కమిటి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శివాంజనేయ ఆలయంలో ప్రధాన పూజారి సత్యనారాయణశర్మ ఆధ్వర్యంలో శివలింగానికి అభిషేకాలు, బిల్వార్చన తదితర పూజాది కార్యక్రమాలను నిర్వహించారు. చాలా మంది భక్తులు నల్లమలలో వెలసిన శివాలయాలకు వెళ్లారు. శ్రీశైలం, ఉమామహేశ్వరం, సోమశిల, బుద్దారం గండి తదితర ప్రాంతాలకు వెళ్లారు.