రాష్ట్రీయం

స్పేస్ పోర్టుగా మారిన షార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్
ఘనంగా విజయోత్సవ వేడుకలు
హాజరైన శాస్తవ్రేత్తలు, సిబ్బంది

సూళ్లూరుపేట, డిసెంబర్ 29: ఒకప్పుడు చుట్టూ నీరు, చీమలు దూరని చిట్టడవితో ప్రకృతి వరప్రసాదినిగా ఉన్న శ్రీహరికోట నేడు దేశానికి స్పేస్ పోర్టుగా మారిందని ఇస్రో చైర్మన్ ఎఎస్ కిరణ్‌కుమార్ అన్నారు. షార్ అంతరిక్ష కేంద్రం ఏర్పడి 50 రాకెట్ ప్రయోగాలు పూర్తిచేసిన సందర్భంగా మంగళవారం నెల్లూరు జిల్లా షార్‌లోని అంబేద్కర్ ఓపెన్ ఆడిటోరియంలో 50వ రాకెట్ ప్రయోగ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలకు విచ్చేసిన ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ 1979లో ఎస్‌ఎల్‌వితో షార్ కేంద్రం నుండి రాకెట్ ప్రయోగాలు ప్రారంభించిన ఇస్రో ఈ ఏడాది డిసెంబర్ 16న పిఎస్‌ఎల్‌వి-సి 29 ప్రయోగంతో 50ప్రయోగాలు పూర్తి చేసిందన్నారు. దేశ చరిత్రలో ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైన రోజన్నారు. 1969లో సూళ్లూరుపేట సమీపంలో ఓ చర్చిలో చిన్న కార్యాలయం ఏర్పాటు చేసి ప్రయోగాలకు శ్రీకారం చుట్టామన్నారు. తొలి ప్రయోగం విఫలమైనా ఆత్మవిశ్వాసంతో శాస్తవ్రేత్తలు ముందుకుసాగి సౌండ్ రాకెట్ల నుండి చంద్రయాన్-1, మార్చి ఆర్బిటల్ మంగళయాన్ వంటి ప్రయోగాలతో పాటు ఎన్నో రాకెట్ ప్రయోగాలు విజయవంతం చేశారన్నారు. షార్ కేంద్రం ఇంత ఉన్నత స్థితికి చేరడంతో శాస్తవ్రేత్తలతో పాటు ఇస్రో చైర్మన్ల కృషి ఎంతో ఉందన్నారు. ఈ ఏడాది ఆరు మాసాల్లో 4ప్రయోగాలు చేశామన్నారు. గత ఐదేళ్లల్లో 16ప్రయోగాలు వరుస విజయాలు సాధించాయన్నారు. భవిష్యత్‌లో కూడా మరిన్ని విజయాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌వితో ప్రారంభించి 1986లో ఎఎస్‌ఎల్‌వి, 1993లో పిఎస్‌ఎల్‌వి, 2001లో జిఎస్‌ఎల్‌వి రాకెట్లకు శ్రీకారం చుట్టడమే కాకుండా ఒక ఎక్స్‌పెరిమెంటల్ ప్రయోగం చేసి విజయవంతం కావడం వివేశమన్నారు. షార్ కేంద్రం శాస్తస్రాంకేతిక రంగాల్లో ఇంత స్థాయికి ఎదగడంతోనే విదేశాలు ఇక్కడ ప్రయోగించే రాకెట్ల ద్వారా వారి ఉపగ్రహాలను పంపేందకు క్యూకడుతున్నారన్నారు. ఇలాంటి రాకెట్ ప్రయోగాల స్వర్ణోత్సవ వేడుకలను ఇస్రో నిర్వహించుకోవడం ఎంతో గర్వమన్నారు.
తొలిరోజుల్లో ఐదేళ్లకు మూడు ప్రయోగాలు చేసేవాళ్లమని ఇప్పుడు 15ప్రయోగాలు చేసే స్థాయికి అంతరిక్ష కేంద్రం ఎదిగిందన్నారు. షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్ మాట్లాడుతూ త్వరలోనే 100వ ప్రయోగ వేడుకలు కూడా షార్‌లో జరుపుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన షార్ కేంద్రం తొలి ప్రాజెక్టు డైరెక్టర్ వైజే రావు యుఎస్‌ఎ నుండి పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నేడు ఇంత స్థాయికి ఎదిగి 50వ ప్రయోగ వేడుకలు జరుపుకోవడం వెనుక ఎందరో శాస్తవ్రేత్తల శ్రమ దాగి ఉందన్నారు. ఈ వేడుకల్లో షార్ మాజీ డైరెక్టర్లు ఎంవైఎస్.ప్రసాద్, ఎం.చంద్ర వదన్ దత్తన్, కె.నారాయణ, ఎస్.వసంత, ఎం. అన్నామలై, విఎస్‌ఎస్‌సి డైరెక్టర్ డాక్టర్ కె.శివన్, ఎంఆర్‌ఆర్ చైర్మన్ డాక్టర్ బిఎన్.సురేష్, స్పేస్ ఫైనాన్షిల్ మెంబరు ఎస్.శ్రీనివాసన్, షార్ కంట్రోలర్ జెవి.రాజారెడ్డి, అసోసియేట్ డైరెక్టర్ టి.సుబ్బారెడ్డి, గ్రూపు డైరెక్టర్ విజయసారధి తదితరులు పాల్గొన్నారు. (చిత్రం) షార్‌లో జరిగిన విజయోత్సవ వేడుకల్లో మాట్లాడుతున్న షార్ మాజీ డైరెక్టర్ నారాయణ, వేదిక పై ఇస్రో చైర్మన్, శాస్తవ్రేత్తలు