బిజినెస్

షార్ మాజీ డైరెక్టర్‌కు విక్రమ సారాభాయ్ మెమోరియల్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, జనవరి 2: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) మాజీ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకమైన విక్రమ సారాభాయ్ అవార్డుకు ఎంపికయ్యారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి కేంద్ర సైన్స్ అకాడమీ తరపున ఈ అవార్డును అందిస్తారు. ప్రస్తుతం షార్ కేంద్రంలో సాంకేతిక పరిజ్ఞానంలో విశిష్ట సేవలందించిన మాజీ డైరెక్టర్ ఎంవైఎస్ ప్రసాద్‌ను విక్రమ సారాభాయ్ మెమోరియల్ అవార్డుకు ఎంపిక చేశారు. కర్నాటక ప్రాంతంలోని మైసూర్‌లో ఆదివారం జరిగే ఓ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఈయనకు అవార్డు అందజేయనున్నారు. అవార్డుకు ఎంవైఎస్ ప్రసాద్ ఎంపిక కావడంతో ఇస్రో శాస్తవ్రేత్తలు, షార్ ఉద్యోగులు హర్షం వెలిబుచ్చారు.