బిజినెస్

త్రిమూర్తులే దిగివచ్చినా అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వచ్చే ఏప్రిల్ 1 నుంచి జిఎస్‌టి అమలుపై మాజీ మంత్రి ఆనంద్ శర్మ
న్యూఢిల్లీ, డిసెంబర్ 19: ఆ త్రిమూర్తులే అవతరించినా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి)ను అమల్లోకి తీసుకురాలేరని కేంద్ర మాజీ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మ అన్నారు. ‘బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు భూమిపై జన్మించినా ఏప్రిల్ 1కి జిఎస్‌టిని అమలు పరచలేరు.’ అని శనివారం ఇక్కడ జరిగిన ఫిక్కీ 88వ వార్షికోత్సవంలో శర్మ అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత ఏకమైనా, పార్లమెంట్‌లో ఎంపీలందరూ నిర్విరామంగా శ్రమించినా, కేంద్రం నిర్దేశించుకున్నట్లుగా వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి మాత్రం జిఎస్‌టిని అమలు పరచలేరని చెప్పారు. ఎందుకంటే దేశంలోని సగం రాష్ట్రాల ఆమోదం తప్పనిసరి అని, అలాగే స్టేట్ జిఎస్‌టి, సెంటర్ జిఎస్‌టి, ఐజిఎస్‌టి చట్టాలను తేవాల్సి ఉందన్నారు. జిఎస్‌టి బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది తెలిసిందే. రాజ్యసభలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుకు తగినంత మెజారిటీ లేకపోవడమే దీనికి కారణం. దీంతో ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తోనూ జిఎస్‌టి అమలుకు సంబంధించి మోదీ చర్చలు జరిపారు. కాంగ్రెస్ డిమాండ్‌కు అనుగుణంగా 1 శాతం అదనపు పన్ను ఎత్తివేతకూ కేంద్రం సిద్ధమైంది. అయినప్పటికీ జిఎస్‌టి బిల్లుపై ప్రతిష్ఠంభన కొనసాగుతూనే ఉంది.