ఆంధ్రప్రదేశ్‌

పసుపు-కుంకమతో మభ్యపెట్టడం లేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అధికారంలోకి రాగానే డ్వాక్రా రుణాలను రద్దుచేస్తామని చెప్పిన చంద్రబాబు తన మాట నిలబెట్టుకోలేదనేది వాస్తవం కాదా? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. డ్వాక్రా రుణాలను రద్దుచేయలేమని మంత్రి సునీత శాసనసభలో ప్రకటించటం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు పసుపు-కుంకుమ పేరుతో మభ్యపెడుతున్నారని అన్నారు. చంద్రబాబు పాలనలో అభివృద్ధి అనేది భూతద్దం వేసి వెతికినా కనిపించటం లేదని, రాజధాని అమరావతిలో శాశ్వత భవనాలు నిర్మించగలిగారా అని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాలో రైతులు, పేదలు ధైర్యంగా ఉంటూ రాష్ట్రం కళకళలాడిందని అన్నారు. రాజధాని భూములను బినామీలకు కట్టబెట్టారు. అమరావతి రాజధానిలో ఎకరం భూమి రూ. 4కోట్లు వుండగా కేవలం రూ.50 లక్షలకు రైతుల నుంచి తీసుకున్నారని విమర్శించారు. నేటి రాజకీయ సినిమాలో పవన్ యాక్టర్, చంద్రబాబు డైరెక్టర్ అని పేర్కొన్నారు.