జాతీయ వార్తలు

షారుఖ్ ఖాన్‌కు 1.93 లక్షల జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి : బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌కు ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ 1.93 లక్షల జరిమానా విధించిన విషయం సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి సేకరించిన సమాచారంతో ఆలస్యంగా బయటపడింది. దాదాపు రెండేళ్ల క్రితం షారుఖ్ తన ఇంటి బయట రోడ్డును ఆక్రమించి ర్యాంప్‌ను నిర్మించటంతో మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీచేసింది. అయినా ఆయన పట్టించుకోకపోవడంతో ర్యాంప్‌ను మున్సిపల్ ఉద్యోగులు ధ్వంసం చేశారు. అనంతరం ఆయనకు జరిమానా విధించారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన షారుఖ్‌కు ఎలాంటి శిక్ష విధించారని సమాచార హక్కు కార్యకర్త ప్రశ్నించడంతో కార్పొరేషన్ ఈ వివరాలు బయటపెట్టింది.