జాతీయ వార్తలు

యుపి సిఎం అభ్యర్థిత్వానికి షీలా విముఖత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: యుపి సిఎం అభ్యర్థిత్వానికి దిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సుముఖత చూపలేదని కాంగ్రెస్ వర్గాల సమాచారం. వచ్చే ఏడాది యుపి అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నందున ఆమెను సిఎం అభ్యర్థిగా ప్రకటించాలని కాంగ్రెస్ హైకమాండ్ యోచించింది. అయితే, అందుకు షీలా అయిష్టంగా ఉన్నారని తెలిసింది. దీంతో పార్టీ పంజాబ్ వ్యవహరాల ఇన్‌చార్జి బాధ్యతలను ఆమెకు అప్పగించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. కేంద్ర మాజీ మంత్రి కమల్‌నాథ్ పంజాబ్ ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఇపుడు హైకమాండ్ దృష్టి షీలాపై పడింది. వరుసగా 15 ఏళ్లపాటు దిల్లీ సిఎంగా బాధ్యతలు నిర్వహించిన షీలా దీక్షిత్‌ను అసెంబ్లీ ఎన్నికల ముందు పంజాబ్ ఇన్‌చార్జిగా నియమించాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తోంది. అయితే, ఈ విషయమై కూడా ఆమె అంతగా సుముఖత చూపడం లేదని తెలుస్తోంది.